టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీకి ముహర్తం ఖారరైనట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కాలి మడమ గాయం కారణంగా షమీ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లండన్‌లో తన మడమ గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న షమీ.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీలో పునరావసం పొందుతున్నాడు.
అయితే షమీ తన గాయం నుంచి శర వేగంగా కోలుకుంటున్నాడు. షమీ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం నెట్స్‌లో జాగ్రత్తగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పూర్తిస్థాయి తీవ్రతతో బౌలింగ్ చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది.
ఇక షమీ రీ ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం తాజాగా స్పందించాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సమయానికి షమీ పునరాగమనం చేసే ఛాన్స్ ఉందని అగార్కర్ తెలిపాడు.
"ప్రస్తుతం భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు గాయాలతో సతమతవుతున్నారు. అందులో ఒకరు మహ్మద్ షమీ. షమీ ప్రస్తుతం తిరిగి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికం. సెప్టెంబరు 19నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనున్నాం.
ఆ సమయానికి షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాము. షమీ బంగ్లా సిరీసే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను. ఎన్సీఏ ఆధికారులను అడిగి అప్‌డేట్ తెలుసుకోవాలి.
మాకు బంగ్లాతో సిరీస్ తర్వాత చాలా టెస్టులు ఉన్నాయి. కాబట్టి షమీ లాంటి బౌలర్ కచ్చితంగా మాకు అవసరం. గత కొంత కాలంగా టెస్టుల్లో బుమ్రా, షమీ, సిరాజ్ మాత్రమే ఫాస్ట్ బౌలర్లగా కొనసాగుతున్నారు.
టెస్టు ఫార్మాట్‌కు సెట్ అయ్యేలా బౌలర్లను తయారు చేయాల్సిన సమయం వచ్చింది. త్వరలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ప్రారంభం కాబోతంది. అక్కడ మెరుగ్గా రాణించే వారికి భారత జట్టులోకి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగర్కార్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment