సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన బ్యాట్‌ను ఝళిపించాడు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. చంఢీఘర్‌తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కులు చూపించాడు.
అద్భుతమైన షాట్లతో ఈ వెటరన్ క్రికెటర్ అలరించాడు. కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా షమీ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాటర్లలో షమీతో పాటు కరణ్ లాల్(33), ప్రదీప్త ప్రమాణిక్(30) పరుగులతో రాణించారు. చంఢీగర్ బౌలర్లలో జగిత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ భా రెండు, నికిల్, అమ్రిత్, లాథర్ తలా వికెట్ సాధించారు.
టీమిండియాలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు షమీ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తొలుత బ్రిస్బేన్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ముందు షమీ జట్టుతో కలుస్తాడని వార్తలు వినిపించాయి.
కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. షమీ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని పరోక్షంగా హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు.
Bengal have set a target of 160 in front of Chandigarh 🎯
Mohd. Shami provides a crucial late surge with 32*(17)
Karan Lal top-scored with 33 (25)
Jagjit Singh Sandhu was the pick of the Chandigarh bowlers with 4/21#SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/u42rkbUfTJ pic.twitter.com/gQ32b5V9LN— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2024
Comments
Please login to add a commentAdd a comment