
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన రీఎంట్రీలో సత్తాచాటలేకపోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షమీ తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తన రిథమ్‌ను తిరిగి పొందడానికి ఈ బెంగాల్ స్టార్ సీమర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) రూపంలో షమీ మరో సవాలు ఎదురు కానుంది. ఈ టోర్నీకి పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌కు షమీనే నాయకత్వం వహించాలి.
అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యాతో కూడా పేస్ త్రయాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత షమీపైనే ఉంది. అయితే షమీ తన రిథమ్‌ను అందుకుంటే అపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తనంటో ఈ స్పీడ్ స్టార్ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో షమీపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షమీ దుమ్ములేపుతాడని రాబిన్‌సింగ్ జోస్యం చెప్పాడు. కాగా రాబిన్ సింగ్ ప్రస్తుతం ఇంటర్ననేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో అతడికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే దుబాయ్ వికెట్ షమీకి సరిగ్గా సెట్ అవుతాందని రాబిన్ సింగ్ అంచనా వేశాడు.
"దుబాయ్ వికెట్‌పై రాత్రి పూట బౌలింగ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. మంచు కారణంగా బంతి బౌలర్లు చేతి నుంచి జారిపోయే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మంచు విస్తృతంగా లేదు. ఈ వికెట్‌పై రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
పరుగులు సునాయసంగా రాబట్టవచ్చు. కానీ ఈ పరిస్థితులను మంచి సీమ్ బౌలర్ అయితే తనకు తగ్గట్టు మలుచుకుంటాడు. షమీలాంటి స్పీడ్ స్టార్‌కు ఈ వికెట్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సరైన లెంగ్త్‌తో పాటు గుడ్ ఏరియాలలో అతడు హిట్ చేస్తాడు. షమీ పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ కలిగి ఉన్నాడని" ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment