
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు శనివారం దుబాయ్‌కు పయనమైంది.
ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్, యూఏఈ వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో రన్నరప్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్‌గా తిరిగిరావాలని పట్టుదలతో ఉంది. ఈ మినీ వరల్డ్‌కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
సచిన్ రికార్డుపై విరాట్ కన్ను..
కాగా ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli)ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో కోహ్లి మరో 37 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంతవేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
కోహ్లి ఇప్పటివరకు 285 ఇన్నింగ్స్‌లలో 13963 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో ఈ దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది.
అంతేకాకుండా ఈ టోర్నీలో విరాట్ మరో 173 పరుగులు సాధిస్తే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు కూడా బద్దలు అయ్యే ఛాన్స్ ఉంది. దావన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. కోహ్లి విషయానికి వస్తే.. 13 మ్యాచ్‌ల్లో 529 పరుగులు చేశాడు.
అదేవిధంగా కోహ్లి మరో 263 పరుగులు చేయగలిగితే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గిల్ 791 పరుగులతో ఈ టోర్నీలో టాప్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అదేజోరును ఈ ఐసీసీ ఈవెంట్‌లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?