BCCI- Team India- Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మకు బీసీసీఐ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని బరిలోకి దిగుతారంటూ సంచలన వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాడు. ఈ మేరకు ఓ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ బహిర్గతం కావడంతో చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీలోని శివ్ సుందర్ దాస్ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా అతడికి డిప్యూటీలుగా సేవలు అందిస్తున్నారు. దీంతో కొత్త చీఫ్ సెలక్టర్‌గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో బీసీసీఐ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారత క్రికెట్‌లో స్టార్లుగా వెలుగొందిన వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు చీఫ్ సెలక్టర్ పదవి పట్ల ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారో సదరు అధికారి వివరించారు.
నిజానికి ఐదేళ్ల కాలం కలిగిన టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్న వ్యక్తి ఏడాదికి రూ. కోటి జీతంగా పొందనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు 90 లక్షల ప్యాకేజీ ఉంటుందని సమాచారం. అయితే, తమకున్ను క్రేజ్ దృష్ట్యా సెహ్వాగ్, భజ్జీ వంటి స్టార్లు ఎండార్స్‌మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంటుంది.
కాబట్టి బిగ్‌స్టార్లు ఈ పదవిపై ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ‘‘కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(CoA) నియామక సమయంలో వీరూను హెడ్‌కోచ్ జాబ్‌కి అప్లై చేయమనే ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అతడు పట్టించుకోలేదు. అప్పుడు అనిల్ కుంబ్లేకు అవకాశం వచ్చింది.
ఆర్థికంగానూ పదవులు మనకు దోహదం చేస్తేనే ఎవరైనా ఇలాంటి వాటికి మొగ్గుచూపుతారు. తర్వాత సెహ్వాగ్ నార్త్ జోన్ నుంచి సెలక్టర్‌గా వచ్చే ఛాన్స్ ఉండింది. కానీ అదీ జరుగలేదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.
4-5 కోట్లు ఇవ్వడం సమస్యేమీ కాదు
‘‘చీఫ్ సెలక్టర్‌కు 4-5 కోట్ల రూపాయలు చెల్లించడం పెద్ద సమస్యేమీ కాదు. కేవలం జీతం తక్కువ అన్న కారణంగా కాకుండా.. తాము అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేమనే కారణంగానే ప్రసిద్ధ ఆటగాళ్లు సెలక్షన్ కమిటీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు’’ అని తెలిపారు. అంతేగాక.. అన్ని సవాళ్లను అధిగమించి సరైన జట్టును ఎంపిక చేయడం కూడా కత్తిమీద సాములాంటిదే అని వ్యాఖ్యానించారు.
చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు!
ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని!
Comments
Please login to add a commentAdd a comment