కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరిలో చేతన్ శర్మ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాలుగు నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్స్‌లోనూ ఉంచింది. అప్లికేషన్‌లో జాబ్ రోల్‌తో పాటు అందుకు కావాల్సిన అర్హతలను అందుబాటులో ఉంచింది. చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికైన వ్యక్తి టెస్టులు, వన్డేలు, టి20లకు జాతీయ టీమ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాగా దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 అని బీసీసీఐ పేర్కొంది.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేయాల్సిన పనులు, బాధ్యతలు..
1. న్యాయమైన, పారదర్శక పద్ధతిలో సాధ్యమైనంత ఉత్తమమైన జట్టును ఎంచుకునే ప్రయత్నం చేయాలి.
2. సీనియర్ జాతీయ జట్టు కోసం ఒక బలమైన బెంచ్ బలాన్ని సిద్ధం చేసుకోవాలి
3. అవసరమైన సమయంలో బృంద సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
4. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను చూడటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి
5. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధిత జట్టు ప్రదర్శనల మూల్యాంకన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు త్రైమాసిక రిపోర్టులు అందించాల్సి ఉంటుంది.
6. జట్టు ఎంపికపై బీసీసీఐ సూచనలను మీడియా సమావేశంలో వెల్లడించేందుకు సిద్దంగా ఉండాలి
7.ప్రతి ఫార్మాట్‌లో జట్టుకు కెప్టెన్‌ని నియమించండి.
8. బీసీసీఐ నియమాలు,నియంత్రణలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉండాలి.
► ఇక టీమిండియా తరపున ఏడు టెస్టులు లేదా కనీసం 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు.. లేదా 10 వన్డేలు లేదా 20 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి.
ముందు వరుసలో వీరేంద్ర సెహ్వాగ్..
ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి టీమిండియా మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నాడు. బీసీసీఐకి చెందిన ఒక అధికారి సెహ్వాగ్ వద్దకు వెళ్లి ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ సెహ్వాగ్ ఆ వార్తలను ఖండించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్ పదవిపై ఆశపడడం లేదు.. కానీ అవకాశం వస్తే ఆలోచిస్తా. అయితే రెమ్యునరేషన్ విషయంలో కాస్త గందరగోళం ఉందని తేలింది. అయితే తాజాగా సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులకు ఆహ్వనాలు ఇవ్వడంతో సెహ్వాగ్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చేతన్ శర్మ స్థానంలో ప్రస్తుతం శివ్‌సుందర్ దాస్ తాత్కాలిక సెలెక్టర్‌గా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment