పాక్ చీఫ్ సెలక్టర్గా ఇంజమామ్ వుల్-హక్!
కరాచీ: ఆఫ్గనిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్కు సొంతగడ్డ నుంచి పిలుపువచ్చింది. పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్గా ఇంజమామ్ వుల్-హక్ను నియమించాలని పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది చివరి వరకు ఆఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు తో ఇంజమామ్కు కాంట్రాక్టు ఉంది. ఇంజమామ్ను కాంట్రాక్ట్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పాక్ బోర్డు నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని అఫ్గనిస్తాన్ బోర్డు తెలిపింది.
ఇంజమామ్ నేతృత్వంలో ఆఫ్గనిస్థాన్ క్రికెట్ జట్టు రాటుదేలి, వరల్డ్ కప్ టీ20లో తన సట్టాచాటింది. సూపర్10లో ప్రవేశించడమే కాకుండా తాము ఆడిన చివరి మ్యాచ్లో వెస్టిండిస్ పై నెగ్గి దుమ్మురేపింది.
పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ టీమ్ కు కోచ్గా ఇంతకు ముందు అతడికి అవకాశం వచ్చింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు తిరస్కరించాడు.