Inzamam-ul-Haq discharged from hospital: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ఇంజమామ్-ఉల్-హక్ వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఛాతీ నొప్పితో భాద పడుతున్న అతడిని సోమవారం ఉదయం లాహోర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడికి వైద్యులు ఆంజియోప్లాస్టి శస్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఇంజమామ్ ఆరోగ్యం మెరుగు పడడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఇక 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ గెలవడంలో ఇంజమామ్ కీలక పాత్ర పోషించాడు. అతడు 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. గతంలో పాక్ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇంజమామ్ ఉల్ హక్.. తన కెరీర్‌లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు.
చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..?
Comments
Please login to add a commentAdd a comment