కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ బుధవారం ప్రకటించాడు. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా సమాచారమిచ్చానని వెల్లడించాడు. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పూర్తిగా సేవలందించేందుకే సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ‘రానున్న జింబాబ్వే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంతో సెలెక్టర్‌గా నా పని ముగుస్తుంది. ఆ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారిస్తా. నా నిర్ణయంలో బోర్డు ప్రమేయం లేదు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని తెలిసింది. అందుకే కోచ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నా’ అని మిస్బా వివరించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ జట్టు సెలెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా మిస్బా నియమితుడయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment