Misbah-ul-Haq
-
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని
T20 World Cup 2022- India Vs Pakistan: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ తమ జట్టును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు. పాక్ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై పట్టింపు లేదని.. పొట్టలు వేలాడటం అందరికీ కనిపిస్తోందంటూ దారుణంగా విమర్శించాడు. శరీర కింది భాగంలో అధిక బరువు కారణంగా పరుగులు తీసేందుకు వారికి ఒళ్లు సహకరించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్తాన్ తొలుత ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇందులో పాక్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీవీ షోలో మాట్లాడిన మిస్బా ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశవాళీ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫిట్నెస్ టెస్టు అనేది పెద్ద జోక్‌లా తయారైందన్నాడు. అంతర్జాతీయ స్థాయి మాదిరిగానే ప్రమాణాలు నెలకొల్పాలని తాము ఎంతగా చెప్పినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్, వార్మప్ మ్యాచ్‌లో పరాజయం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘పాక్ ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వకార్ నాలుగుసార్లు, నేను ఒకసారి కోచ్ పదవులను వదిలేసిన సంగతి తెలిసిందే. నాతో సహా షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ వంటి ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై దృష్టి ఉండేది. ఎవరో మమ్మల్ని ముందుకు తోస్తేనే ఆ విషయం గురించి ఆలోచించకుండా స్వయంగా మాకు మేముగా ఫిట్‌గా ఉండాలని శ్రమించేవాళ్లం. కానీ ఇప్పుడు.. ఆటగాళ్ల పొట్టలు బయటికి కనబడుతున్నాయి. ... అధిక బరువు కారణంగా వాళ్లు ఫీల్డ్‌లో పాదరసంలా కదలలేకపోతున్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం’’ అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 23న టీమిండియాతో పాక్ ప్రపంచకప్-2022 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: SCO Vs IRE: స్కాట్లాండ్పై ఐర్లాండ్ ఘన విజయం.. సూపర్ 12 ఆశలు సజీవం T20 WC- Semi Finalists: ప్రపంచకప్.. సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే! ఇక విజేతగా..: సచిన్ టెండుల్కర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ దూరమైతే అతడిని కెప్టెన్‌గా నియమించవద్దు: పాక్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకు రోహిత్ కొవిడ్ కారణంగా దూరమైతే.. భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని నియమించవద్దని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ అభిప్రాయ పడ్డాడు. కోహ్లి ఫామ్ లేమి కారణంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని మిస్బా సూచించాడు. విరాట్ కోహ్లి గత కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం అతడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. టీమిండియాకు అతడు బ్యాటర్‌గా చాలా అవసరం. కాబట్టి అతడిని కెప్టెన్‌గా నియమించి మరింత ఒత్తిడిని పెంచవద్దు. భవిష్యత్తులో భారత కెప్టెన్‌గా ఎంపికయ్యే సత్తా ఉన్న ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించండి. కోహ్లి కేవలం తన బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టులో లేనప్పుడు కోహ్లి రాణించాల్సిన అవసరముంది అని మిస్బా మిస్బా-ఉల్-హక్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్లు మధ నిర్ణయాత్మక ఐదో టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై1న వేదికగా ప్రారంభం కానుంది. రోహిత్ ఇంకా కోవిడ్ కోలుకోకపోవడంతో ఈ కీలక మ్యాచ్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక వేళ రోహిత్ దూరమైతే జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు అప్పగించే యోచనలో జట్టు మేనేజేమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు -
కన్నేసి ఉంచాలంటూ పాక్ ఆటగాళ్ల భార్యలను భారత్‌కు పంపించాం!
టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. రెండు దేశాలకు తమ గౌరావాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్షతో ఉంటాయి. ఏ జట్టుతో మ్యాచ్ ఓడినా పర్లేదు కానీ దాయాది చేతిలో ఓడితే మాత్రం విమర్శలు తప్పవు. కాగా ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమే అవుతుంది. రెండు దేశాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల మేజర్ టోర్నీల్లో తప్ప భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. ఇటీవలే పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ప్రస్తావించిన నాలుగు దేశాల టోర్నీ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఆ టోర్నీలో ఆడబోయేది లేదని భారత్ ఐసీసీకి తెలిపింది. అయితే పాకిస్తాన్ జట్టు భారత్‌లో చివరిసారి 2012-13లో పర్యటించింది. ఆ సమయంలో మూడు వన్డేలు. రెండు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియాకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని ఉండగా.. పాకిస్తాన్ కెప్టెన్‌గా మిస్బా-ఉల్-హక్ వ్యవహరించాడు. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ కైవసం చేసుకోగా.. రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1 డ్రా చేసుకున్నాయి. సిరీస్ ఫలితం పక్కనబెడితే.. అప్పుడు జరిగిన ఒక సంఘటనను మాజీ పీసీబీ చైర్మన్ జాకా అశ్రఫ్ తాజాగా పంచుకున్నాడు. పాక్ ఆటగాళ్ల వెంబడి వారి భార్యలను కూడా తొలిసారి భారత్‌కు పంపించామని పేర్కొన్నాడు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆయన వివరించాడు. '' పాకిస్తాన్ ఆటగాళ్లు ఎప్పుడు భారత్‌కు వచ్చినా.. ఆ దేశ మీడియా పాక్ ఆటగాళ్లపై ఆరోపణలు చేసేది. ఆటగాళ్లు ఎప్పుడు భారత్‌కు వచ్చినా తమ భార్యలను తీసుకురారని.. వాళ్లు రాకపోవడం వల్ల ఇక్కడ తమ సరసాలకు అడ్డు ఉండదని.. ఎవరు ఏం చేసినా అడిగేవారు ఉండరని.. అందుకే పాక్ ఆటగాళ్లు తమ భార్యలను తీసుకురారని వార్తలు రాసేవారు. కానీ వీటన్నింటికి చెక్ పెట్టడానికే.. పాక్ ఆటగాళ్లు వెళ్లిన తర్వాత.. ఒక కన్నేసి ఉంచమని వారి భార్యలను భారతదేశానికి పంపించాను. పీసీబీ మాజీ చైర్మన్ జాకా అశ్రఫ్ ఆ సమయంలో వాళ్లు పాక్ ఆటగాళ్లతోనే ఉండడంతో అక్కడి మీడియా(భారత్ మీడియా)కు వార్తలు రాయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కాగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్.. సెక్యూరిటీ విషయంలో హామీ ఇస్తే పాకిస్తాన్ పర్యటనకు భారత్‌ను పంపిస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు ఆ మాట నిలుపుకోలేకపోయారు. అయితే భారత్‌తో సిరీస్ ఆడేందుకు ఎప్పటికప్పుడు మా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాం.. కానీ భారత్ ఒప్పుకునే ప్రతిపాదనలో కనిపించడం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Tim Southee: ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ Pollard Run-out: పొలార్డ్.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు! -
Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్!
This Former Cricketer To Replace Misbah-ul-Haq: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదరగొడుతోంది. టీమిండియా, న్యూజిలాండ్ వంటి మేటి జట్లపై వరుస విజయాలు సాధించి సెమీస్‌కు చేరువవుతోంది. తద్వారా క్రీడా విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ సహా బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సందిగ్దంలో పడింది. సక్లెయిన్ ముస్తాక్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించింది. అయితే... విదేశీ కోచ్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పాలని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, టీమిండియాకు హెడ్ కోచ్‌గా సేవలు అందించిన గ్యారీ కిర్‌స్టన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిస్బా స్థానాన్ని కిర్‌స్టన్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అతడితో పాటు సైమన్ కటిచ్(ఆస్ట్రేలియా), పీటర్ మూర్స్(ఇంగ్లండ్) పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. మూడేళ్లపాటు గ్యారీ కిర్‌స్టన్ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. అతడి నిర్దేశనంలో.. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత జగజ్జేతగా నిలిచింది. ఇక కిర్‌స్టన్ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్లోనూ నంబర్ 1 ర్యాంకుకు చేరుకుంది. క్రికెటర్‌గా కిర్‌స్టన్ గణాంకాలు దక్షిణాఫ్రికా తరఫున గ్యారీ కిర్‌స్టన్.. 185 వన్డేలు, 101 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 7289, వన్డేల్లో 6798 పరుగులు చేశాడు. 2004లో ప్రొటిస్ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. చదవండి: T20 World Cup 2021: నెట్స్‌లో శ్రమిస్తున్న పాండ్యా.. శార్దూల్, భువీతో కలిసి బౌలింగ్ చేస్తూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే.. -
Misbah-ul-Haq: బలిపశువుల కోసం వెతకడమే పని.. పైపై మెరుగులు చాలవు..
Misbah-ul-Haq questions Pakistan selectors on T20 World Cup squad: ‘‘అవసరమైన విషయాలపై మనం దృష్టి పెట్టం. మూలాల నుంచి అభివృద్ధి చేయాల్సిన సత్యాన్ని గుర్తించం. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా.. జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు ఆశిస్తాం. అనుకున్న ఫలితాలు రాకపోతే... బలిపశువుల కోసం వెదుకుతాం. మనకు ఓపిక ఉండదు. ప్రణాళిక అంతకంటే ఉండదు. కానీ... ఆశించిన ఫలితాలు మాత్రం రావాలి’’ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్సా ఉల్ హక్ పాక్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు. అదే విధంగా ఆటను ఎలా అభివృద్ధి చేయాలన్న విషయం కంటే కూడా... పైపై మెరుగులు దిద్దేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. పాక్ హెడ్ కోచ్ మిస్బా, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు వీరిద్దరు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారిగా పాక్ జట్టు గురించి మీడియాతో మాట్లాడిన మిస్బా... పీసీబీ తీరును ఎండగట్టాడు. ‘‘దురదృష్టవశాత్తూ... బలిపశువుల కోసం వెతకడం పాకిస్తాన్ క్రికెట్లో ఓ ఆనవాయితీగా మారింది. ఒక మ్యాచ్ లేదంటే, సిరీస్ ఓడిపోయిన అనంతరం.. తమను తాము కాపాడుకునేందుకు కొంతమంది ఇలా చేస్తారు. ఇది ఇలాగే కొనసాగితే మన తలరాత అస్సలు మారదు. పైపై మెరుగులతో ఎక్కువ రోజులు నెట్టుకురాలేము. కోచ్‌లను, ఆటగాళ్లను మార్చినంతం మాత్రాన... సమస్య పరిష్కారం కాదు. మూలాల నుంచే ప్రక్షాళన జరగాలి’’ అని చురకలు అంటించాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి మిస్బా స్పందిస్తూ... ‘‘అసలేం జరుగుతోంది? తొలుత కొంతమంది ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తారు. ఆ తర్వాత 10 రోజులకే యూటర్న్ తీసుకుంటారు. తొలుత డ్రాప్ చేసిన ఆటగాళ్లను మళ్లీ జట్టుకలోకి తీసుకుంటారు. ఇదంతా ఏంటి?’’ అని ప్రశ్నించాడు. కాగా 15 మంది సభ్యులు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో జట్టును ప్రకటించిన పీసీబీ.. ఆ తర్వాత మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. అనంతరం సొహైబ్ మక్సూద్ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానంలో వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌కు అవకాశం ఇచ్చింది. చదవండి: T20 World Cup Ind vs Pak: ఎల్లప్పుడూ మనదే విజయం.. ఈసారి కూడా! -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా
ఇస్లామాబాద్: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్ కోచ్ మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్ ప్రపంచకప్ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేయడం పాక్ క్రికెట్లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి తప్పుకోవడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లకు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో 15 మంది సభ్యుల పాక్ బృందాన్ని పీసీబీ ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. కాగా, ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల సమరం అక్టోబర్ 24న జరగనున్న సంగతి తెలిసిందే. పాక్ టీ20 ప్రపంచకప్ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..? -
'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు'
కరాచీ: పాకిస్తాన్ జట్టు ఈ ఏడాది మంచి ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బాబర్ అజమ్ సారధ్యంలోని పాక్ జట్టు వరుసగా నాలుగు సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. మొదట దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌తో పాటు.. జింబాబ్వేతో జరిగిన టెస్టు , టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే పాక్ జట్టు దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలవడానికి ప్రొటీస్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు లేకపోవడయే కారణమని కొందరు విమర్శించారు. ఐపీఎల్ సీజన్లో పాల్గొనడానికి పలువరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రావడంతో పాక్ జట్టు బలంగా లేని జట్టుపై సిరీస్ గెలవడం పెద్ద గొప్ప విషయం కాదన్నారు. అంతేగాక జింబాబ్వే జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్లు గాయాల కారణంతో ఆడకపోవడంతో అత్యంత బలహీనంగా ఉన్న జట్టుపై సిరీస్‌ను గెలవడం పెద్ద గొప్ప కాదంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై పాకిస్తాన్ ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు. ''దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేరన్న మాట నిజమే.. కానీ వారు ఆడింది హోం గ్రౌండ్లో అన్న విషయం మరిచిపోయారు. బలహీనంగా కనిపించే ఏ జట్టైనా స్వదేశంలో ఆడుతున్నారంటే కాస్త బలంగానే కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ ప్రొటీస్ జట్టు మంచి ప్రదర్శన చేయలేకపోయింది. మేం వారి నుంచి సరైన పోటీ అందుకోలేకపోయామంటే దానికి కారణం వారి జట్టు బలంగా లేదని అర్థం. ముందు దక్షిణాఫ్రికా జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడి అప్పుడు ఈ విమర్శలు చేయండి. మేం సిరీస్ గెలిచామంటే ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉందనే కదా అర్థం. జింబాబ్వే సిరీస్‌తోనూ ఇదే వర్తిస్తుంది. వారికి అది హోం గ్రౌండే.. కానీ ఉపయోగించుకోలేకపోయారు. అది వదిలేసి ఇలా దెప్పి పొడుస్తూ మాట్లాడడం సరికాదు. అయినా మేం విమర్శలు పట్టించుకోం.. మేం కష్టపడ్డాం.. ఫలితం సాధించాం. మా పనేంటో మాకు తెలుసు.. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మా బ్యాటింగ్‌లో పవాద్ అలమ్, బాబర్ అజమ్ అజర్ అలీ వెన్నుముకలా నిలిచారు. బౌలింగ్‌లో హసన్ అలీ కీలకపాత్ర పోషించాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ తన తర్వాతి సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడనుంది. చదవండి: కోహ్లి అండతోనే నేనిలా... ZIM Vs PAK: పాకిస్తాన్‌దే టెస్టు సిరీస్ -
‘చీఫ్ సెలెక్టర్’ పదవికి మిస్బా గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ బుధవారం ప్రకటించాడు. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా సమాచారమిచ్చానని వెల్లడించాడు. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పూర్తిగా సేవలందించేందుకే సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ‘రానున్న జింబాబ్వే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంతో సెలెక్టర్‌గా నా పని ముగుస్తుంది. ఆ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారిస్తా. నా నిర్ణయంలో బోర్డు ప్రమేయం లేదు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని తెలిసింది. అందుకే కోచ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నా’ అని మిస్బా వివరించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ జట్టు సెలెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా మిస్బా నియమితుడయ్యాడు. -
‘కోచ్‌లుగా ఉండి ఏంచేస్తున్నారు’
కరాచీ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సోహైల్ ... మిస్బా నేతృత్వంలోని కోచింగ్ టీంను తనదైన శైలిలో విమర్శించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాక్ జట్టు నిరాశజనక ప్రదర్శనపై కోచ్‌లు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమీర్ సోహైల్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. 'పాక్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమవుతుంటే.. కోచ్‌లు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప వారికి ఎటువంటి సూచనలు చేయడం లేదు. మిస్బా నేతృత్వంలోని కోచింగ్ టీమ్ ఏం చేస్తుంది.. వారిని ఎందుకు కోచ్‌లుగా నియమించారు.. సరదాగా ఇంగ్లండ్ చూడడానికి వచ్చారా.. లేక పాక్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వచ్చారా.. ఎంజాయ్ చేయడానికి వచ్చాం అనుకుంటే మాత్రం కోచ్‌లందరూ కలిసి వరల్డ్ టూర్‌కు వెళ్లండి..మీరు కోచ్‌లుగా పనిచేయడం వ్యర్థం 'అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా పాక్ జట్టుకు మిస్బా ఉల్ హక్ ప్రధాన కోచ్‌గా కొనసాగడంతో పాటు పాక్ జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక పాక్ బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్, ఫీల్డింగ్ కోచ్‌గా గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న పాకిస్తాన్ 0-1 తేడాతో వెనుకపడి ఉంది. రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. కీలకమైన మూడో టెస్టులోనూ నిరాశపరుస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 8వికెట్ల నష్టానికి 583 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 273 పరుగులకే చాప చుట్టేసి పాలోవన్ ఆడుతోంది. ఇప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. చదవండి : (ఇది నా 13 ఏళ్ల కష్టం) (‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్ చేజార్చుకున్నాం’) -
తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా
కరాచీ: ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ జరిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి స్పష్టత లేకపోయినా వాయిదా తప్పదని ఆలోచనలో చాలా క్రికెట్ బోర్డులు ఉన్నాయి. దీనిపై ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడగా, అప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ కోరుతున్నాడు. (టి20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకోండి) ఈ మెగా టోర్నీపై తొందరపడి నిర్ణయం తీసుకుని వాయిదా వేసేకంటే మరికొంత కాలం వేచి చూస్తేనే బెటర్ అని పేర్కొన్నాడు. ఒకసారి క్రికెట్ యాక్టివిటీలు ఆరంభమైతే టీ20 వరల్డ్‌కప్ కంటే అత్యుత్తమ టోర్నీ ఏదీ ఉండదన్నాడు. దాంతో టోర్నీ వాయిదా నిర్ణయాన్ని అప్పుడే తీసుకోవద్దని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశాడు. ‘ టీ20 వరల్డ్‌కప్‌ను నిర్ణీత షెడ్యూల్లో నిర్వహించే మార్గం దొరుకుతుందనే ఆశిస్తున్నా. వరల్డ్‌కప్ అంటే దాని కుండే క్రేజే వేను. ప్రతీ ఒక్కరూ వరల్డ్‌కప్‌ను చూడాలనుకుంటారు. వరల్డ్‌కప్ అనేది క్రికెట్లో హైలైట్ టోర్నీ. ఇంకా వరల్డ్‌కప్‌కు చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి పరిస్థితులు చక్కబడతాయనే ఆశిద్దాం. ఇంకా ఒక నెల, ఆపై సమయంలోనే నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం’ అని మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. (భారత హాకీ దిగ్గజం బల్బీర్ కన్నుమూత) -
‘ఇదేం పద్ధతి.. నాకైతే అర్థం కావట్లేదు’
ఇస్లామాబాద్: కోచింగ్‌లో కనీసం క్లబ్ లెవల్లో కూడా అనుభవం లేని మిస్బావుల్ హక్‌ను పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా కొనసాగించడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చర్యలను తప్పుపడుతూ ఎగతాళిగా మాట్లాడాడు. ఆటలో నైపుణ్యం, కెప్టెన్సీలో నిజాయితీ, కోచ్‌గా అనుభవం లేనటువంటి మిస్బావుల్‌ను పాక్ హెడ్ కోచ్‌గా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రామాణికంగా అతడిని కోచ్‌గా కొనసాగిస్తున్నారో చెప్పాలని పీసీబీని యూసఫ్ ప్రశ్నించారు. ‘కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస అనుభవం ఉండాలనే షరతును పీసీబీ పెట్టింది. కానీ కనీసం క్లబ్ లెవల్లో కూడా కోచింగ్ అనుభవం లేని మిస్బావుల్‌ను ఎంపిక చేసింది. కోచ్ ఎంపిక విషయంలో పీసీబీ అవలంభించిన ద్వంద్వ వైఖరేంటో అర్థం కావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆటగాళ్లు, సారథి నిజాయితీగా, నిస్వార్థంగా ఉండాలని మిస్బా పేర్కొన్నాడు. కానీ అతడు సారథిగా ఉన్నప్పుడు అజహర్ అలీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పగలడా? అజహర్ అలీ మంచి బ్యాట్స్‌మన్. అయితే అతడు క్రీజులో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. మిస్బా కూడా అంతే. అతడి ఆటలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేదు. ఒకే రీతిలో రక్షణాత్మకంగా ఆడతాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగేవరకు వేచి చూసి ఆ తర్వాత పరుగులు రాబట్టేవాడు’అని యూసఫ్ వ్యాఖ్యానించాడు. మిస్బావుల్ పాక్ తరుపున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా మంచి రికార్డు ఉండటంతో పాటు వివాదరహితుడుగా పేరుగాంచిన మిస్బాను పాక్ జట్టు ప్రధానకోచ్, చీఫ్ సెలక్టర్‌గా పీసీబీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్ ఇలాంటి దిగ్గజం.. తరానికి ఒక్కరు -
‘ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది’
ఇస్లామాబాద్: రెండు టెస్టు సిరీసుల్లో (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) ఓటమి చవిచూడటం, రన్‌రేట్ కారణంగా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరకపోవడం వంటి ఘటనలతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఈ ఏడాది(2019) చాలా కష్టంగా గడిచిందని ఆ జట్టు కోచ్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో తమ జట్టు ఆశించిన మేర రాణించలేదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే దాదాపు దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ జరగడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో పాక్ కైవసం చేసుకోవడం ఈ ఏడాది తమ జట్టుకు మరో హైలెట్‌గా నిలిచిందన్నాడు. అయితే అదే జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కూడా బాధించిందన్నాడు. అయితే ఓవరాల్‌గా పొట్టి క్రికెట్లో పాక్ ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నామని.. అయితే రెడ్ బాల్ క్రికెట్లో ప్రదర్శనపైనే తాము ఆందోళనగా ఉన్నామని మిస్బావుల్ అన్నాడు. టెస్టు ఫార్మట్‌పై తాము ఇంకాస్త దృష్టి పెట్టాలన్నాడు. అయితే స్వదేశంలో టెస్టులు ఆడితే ఏ జట్టుకైనా అదనపు బలం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాక్‌లో టెస్టులు లేకపోవడం వలన జట్టులో స్థైర్యం దెబ్బతిందన్నాడు. కనీసం రానున్న ఏడాదిలోనైనా పాక్‌లో ఎక్కువ టెస్టులు ఆడగలిగితే తమ జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందన్నాడు. ఇక ఈ ఏడాది ఆటగాళ్ల ప్రదర్శనపై మిస్బావుల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బాబర్ అజమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఫార్మట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడని, పాక్ జట్టుకు అతడే స్టార్ బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చాడు. ఇక అతడితో పాటు కర్రాళ్లు నసీమ్ షా, షాహీన్ ఆఫ్రిదిల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అంతేకాకుండా పాక్ భవిష్యత్ క్రికెటర్లు వీరేనంటూ వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం టీ20 ప్రపంచకప్ అని ఈ మెగా టోర్నీ కోసం సన్నద్దమవుతున్నట్లు మిస్బావుల్ తెలిపాడు. 2017 చాంపియన్ ట్రోఫీ తర్వాత పాక్ చెప్పుకునేంత పెద్ద టోర్నీలు గెలవలేదని.. అందుకే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు. -
పాకిస్తాన్‌కు ఝలక్ ఇచ్చిన బంగ్లా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బంగ్లాదేశ్ చిన్న ఝలక్ ఇచ్చింది. జనవరిలో రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాక్‌లో పర్యాటించాల్సివుంది. దీనికోసం పీసీబీ అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే పాక్‌లో కేవలం టీ20లు మాత్రమే ఆడతామని, టెస్టులు తటస్థ వేదికపై ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తేల్చిచెప్పింది. పాక్‌లో ఎక్కువ రోజులు ఉండటానికి బంగ్లా క్రికెటర్లు విముఖత వ్యక్తం చేయడంతోనే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయంతో కంగుతిన్న పాక్ క్రికెట్ బోర్డు బీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో పాక్ కెప్టెన్ అజహర్ అలీ, హెడ్‌కోచ్ మిస్బావుల్ హక్‌లు కూడా బీసీబీ తీరును తప్పుపడుతున్నారు. ‘కేవలం టీ20లే ఆడతాం, టెస్టులు ఆడం అనడం అనైతికం. ప్రస్తుతం పాక్‌లో క్రికెట్ పునరజ్జీవం పోసుకోవాలంటే అది టెస్టులతోనే సాధ్యం. వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్‌లు నిర్వహించడంతో పాక్‌లో క్రికెట్ బతుకుతుంది. దీని కోసమే పీసీబీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలో టెస్టులు ఆడమని, కేవలం టీ20లో అడతామనడం సరైనదికాదు. ఈ విషయంలో బీసీబీని ఉపేక్షించేదిలేదు. టెస్టులు ఆడకపోతే బంగ్లాపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు కోరినట్లు కేవలం టీ20లు మాత్రమే ఆడే అవకాశం ఇస్తే మిగతా దేశాలు కూడా అదే దారిలో వెళతాయి. దీంతో పాక్‌లో టెస్టు క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే శ్రీలంక టెస్టు సిరీస్ దిగ్విజయంగా ముగిసింది. లంక దారిలోనే మరిన్ని జట్లు పాక్‌లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నాం’అంటూ మిస్బావుల్, అజహర్లు పేర్కొన్నారు. ఇక బీసీబీ నిర్ణయంతో పాకిస్తాన్‌కు మింగుడుపడటంలేదు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి కూడా స్పందించారు. బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాక్‌లో బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించబోమని మరోసారి స్పష్టం చేశారు. భద్రతాపరమైన ఎలాంటి చిక్కులు లేవని శ్రీలంక సిరీస్‌తో ప్రపంచానికి తెలిసిపోయిందని.. ఈ క్రమంలో పాక్‌లో పర్యటిచడానికి వారి సమస్యేంటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మిస్బా.. నీ ‘ఆట’లు సాగవ్!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్సీ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడంపై ఆ దేశ మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. సర్ఫరాజ్‌ను రెండు ఫార్మాట్ల నుంచి సారథిగా తొలగించడానికి ప్రధాన కారణంగా కొత్తగా కోచ్‌గా వచ్చిన మిస్బావుల్ హక్ కారణమని విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఏదో అద్భుతాలు చేయాలని చూస్తున్న మిస్బా.. సింగిల్‌గా ఏమీ సాధించలేడని విషయం తెలుసుకోవాలన్నాడు. ‘ పాకిస్తాన్ క్రికెట్లో మిస్బా ఒక శక్తిగా ఎదగాలనుకుంటన్నాడు. అదే పని చేయదనే విషయాన్ని గ్రహించు. అసలు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా ఎందుకు తీసేయాల్సి వచ్చింది. టీ20 క్రికెట్లో పాకిస్తాన్‌కు 11 వరుస సిరీస్‌లు అందించిన సర్ఫరాజ్‌ను సారథిగా ఎలా తప్పిస్తారు. మిస్బాతో వకార్ యూనస్‌కు సర్ఫరాజ్ అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు. వారి వారి వ్యక్తిగత కారణాలతోనే సర్ఫరాజ్‌ను తొలగించారు. నువ్వు పాకిస్తాన్ క్రికెట్లో అత్యంత శక్తిమంతుడిగా ఎదగాలనుకుంటున్నావ్. కానీ సింగిల్ అది వర్క్ ఔట్ కాదు’ అని విమర్శించాడు. ఇటీవల పాకిస్తాన్ టెస్టు, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్‌ను తప్పించి అజహర్ అలీ, బాబర్ అజామ్‌లకు ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం వన్డే కెప్టెన్సీకి మాత్రమే సర్ఫరాజ్‌ను పరిమితం చేశారు. దాంతో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడాన్ని సమర్థిస్తే, మరికొందరు మాత్రం పీసీబీ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా పంజాబ్ క్రికెట్ బోర్డు అయ్యిందంటూ విమర్శిస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన మిస్బా-వకార్‌లు తమ స్థానికత కోసం కృషి చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అజహర్ అలీ కూడా పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడే కావడంతో మిస్బాపై విరుచుకుపడుతున్నారు., -
మిస్బా మార్క్.. సర్ఫరాజ్ కెప్టెన్సీ ఫట్!
కరాచీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్ కావడంతో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముప్పు తెచ్చిపెట్టింది. దీనిపై వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. సర్ఫరాజ్‌ను టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో తొలుత సర్ఫరాజ్‌ను రెండు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఒక కెప్టెన్‌గా పాకిస్తాన్ క్రికెటర్లను సరైన దారిలో పెట్టడంలో విఫలమవుతున్న సర్ఫరాజ్ వైఖరిపై మిస్బా గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో సర్ఫరాజ్‌ను సారథిగా తప్పించడమే మంచిదని భావించిన మిస్బా.. దాన్ని వెంటనే అమలు చేశాడు. కేవలం వన్డేలకు మాత్రమే సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా పరిమితం చేసిన మిస్బా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. టీ20, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు సారథుల్ని నియమించింది. అజహర్ అలీని టెస్టు కెప్టెన్సీ అప్పచెప్పగా, బాబర్ అజామ్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. కాకపోతే వచ్చే ఏడాది జూలై వరకూ పాకిస్తాన్‌కు పెద్దగా వన్డే సిరీస్‌లు లేకపోవడంతో సర్ఫరాజ్‌ను నామమాత్రపు కెప్టెన్‌గానే ఉంచారు. 2016లో టీ20 కెప్టెన్‌గా నియమించబడ్డ సర్ఫరాజ్.. 2017లో వన్డే సారథిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్‌గా కూడా సర్ఫరాజ్ నియమించబడ్డాడు. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ‘జూనియర్ శ్రీలంక’ జట్టు చేతిలో వైట్‌వాష్ కావడంతో సర్ఫరాజ్ కెప్టెన్సీకి ప్రధానంగా ఎసరు తెచ్చింది. -
పాక్ క్రికెటర్లతో కోచ్‌కు తిప్పలు
కరాచీ: ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు టీ2ల సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్ కావడంతో ఆ జట్టు ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ విమర్శల పాలవుతున్నాడు. టీ20 ఫార్మాట్లో నంబర్ వన్‌గా ఉన్న పాకిస్తాన్.. శ్రీలంక ‘జూనియర్’ జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని మూట గట్టుకోవడంతో మిస్బావుల్‌పై అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ క్రికెటర్లు క్రమశిక్షణ విషయంలో కూడా సరైన వైఖరిని ప్రదర్శించడం కూడా మిస్బావుల్‌కు తలపోటుగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని పలువురు క్రికెటర్లు ప్రాక్టీస్ చేయడంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే మిస్బావుల్ కొత్త తలపోటుకు కారణమైంది. ‘కొంతమంది పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్‌ను తేలిగ్గా తీసుకోవడమే కాకుండా రిలాక్స్డ్గా గడపడం మిస్బావుల్‌కు మింగుడు పడటం లేదు. ఒకవైపు తమ క్రికెట్ క్రమశిక్షణా ప్రమాణాలను పెంచాలని మిస్బా చూస్తున్నా అందుకు ఆటగాళ్ల నుంచి సహకారం లభించడం లేదు. ఈ విషయంలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరైతే క్రమ శిక్షణలో భాగమైన ప్రాక్టీస్‌ను ఎగ్గొడుతున్నారో వారిని మందలించే యత్నం కూడా చేయడం లేదు. వారంటే సర్ఫరాజ్ భయపడుతున్నట్లు ఉన్నాడు. ప్రధానంగా వహాబ్ రియాజ్, ఇమాద్ వసీం, హరీస్ సొహైల్‌ల వ్యవహారం మిస్బాను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో వంకతో ప్రాక్టీస్‌ను తప్పించుకోవడానికే వారు చూస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్‌కు సంబంధించి ప్రణాళికల్లో భాగం కావడానికి కూడా వారు రావడం లేదు’ అని పీసీబీలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు. -
క్రికెట్‌కు తక్కువ.. కుస్తీ పోటీకి సిద్ధంగా!
ఇస్లామాబాద్ : శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా పేరు తెచ్చుకున్న పాక్.. ప్రత్యర్థి జట్టు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాకపోయినప్పటికీ... శ్రీలంక యువ క్రికెటర్లు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహా హెడ్‌కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆమిర్ సోహైల్ కూడా పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. అయితే క్రికెట్‌కు తక్కువ... కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్ లేదా డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలకు సిద్ధం అవుతున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. (చదవండి : కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్..!) కాగా ప్రపంచకప్ సమయంలోనూ పాక్ క్రికెటర్ల ఫిట్నెస్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీమిండియాతో ఓటమి తర్వాత.. ‘మా టీం తిండి తినడం మీద చూపే శ్రద్ధలో పావు వంతు అయినా ఫిట్నెస్, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేది. పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప మైదానంలో పోరాడలేరు. రేపు మ్యాచ్ ఉందంటే.. ఫిట్నెస్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. జంక్ ఫుడ్ తిని కడుపు నింపుకోవడంలో మా ఆటగాళ్లు బిజీగా ఉంటారు’ అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పాక్ జట్టుపై విపరీతంగా జోకులు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జట్టు కోచ్‌గా పగ్గాలు చేపట్టిన మిస్బా... ఫిట్నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు ప్రణాళికలు రచించాడు. బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని అతడు ఆటగాళ్లకు సూచించాడు. -
కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్..!
ఇస్లామాబాద్ : ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో క్రికెటర్లకు ఉన్న క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లి అరెస్టైన ఫ్యాన్స్ కూడా కోకొల్లలు. అయితే విజయం సాధించినపుడు ఆకాశానికెత్తేసే కొంతమంది ‘వీరాభిమానులు’.. ఓడిపోయిన సమయాల్లో వారిపై కోపం ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జయభేరి మోగించిన పాకిస్తాన్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ.. అద్భుత ప్రదర్శనతో లంక యువ ఆటగాళ్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా టీ20ల్లో వైట్‌వాష్ ఎరుగని జట్టుగా ఉన్న పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసి ప్రత్యర్థి జట్టుకు గట్టి షాకిచ్చారు.(చదవండి : అందుకే ఓడిపోయాం.. సరేనా: పాక్ కోచ్) ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, కోచ్ మిస్బావుల్ హక్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆటతో పరువు తీశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ అహ్మద్ కటౌట్‌ను ఓ అభిమాని కసితీరా కొట్టి కాలితో తన్నాడు. కటౌట్ పూర్తిగా నేలమట్టం అయ్యేంత వరకు కోపంతో ఊగిపోతూ తిట్ల వర్షం కురిపించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సాజ్ సాదిఖ్ అనే నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సర్ఫరాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. A fan not happy with Sarfaraz Ahmed after the 3-0 loss to Sri Lanka #PAKvSL #Cricket pic.twitter.com/S6Biri8z4f — Saj Sadiq (@Saj_PakPassion) October 10, 2019 -
అందుకే ఓడిపోయాం.. సరేనా: పాక్ కోచ్
ఇస్లామాబాద్ : ‘నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. అందుకే జట్టు ఓడిపోయిందనుకుంటున్నా.. సరేనా ’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెచ్ కోచ్ మిస్బావుల్ హక్ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు లేనప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక యువ ఆటగాళ్లు పాక్‌ను వైట్‌వాష్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో మూడో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి మిస్బా విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పొట్టి క్రికెట్ ఫార్మాట్లో నంబర్ 1గా ఉన్న జట్టుగా పేరు గాంచిన పాక్ ఇంతటి అపజయాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఏంటని ఓ విలేకరి మిస్బాను ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా... ‘ అవును అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. కేవలం నేను మాత్రమే మారాను. నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్‌ను ఎడమ చేతివాటంతో ఆడమని చెప్పాను. అంతేకాదు రైట్ ఆర్మ్ బౌలర్లను.. లెఫ్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేయమని చెప్పాను. అందుకే ఓడిపోయామని అనుకుంటున్నా. నేను అలా చేయకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అదే విధంగా లెగ్ స్పిన్నర్ షాబాద్ ఖాన్ ప్రదర్శనపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించగా.. దేశవాళీ జట్టులో మెరుగ్గా రాణిస్తున్న ఒక్క రిస్ట్ స్పిన్నర్‌ని అయినా జాతీయ జట్టులోకి తీసుకోకుండా ఉన్నామా అంటూ మిస్బా ఎదురు ప్రశ్నించాడు. ఇక తమ కోచ్ వ్యాఖ్యలను పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సమర్థించాడు. ‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఇదే ఆటగాళ్లతో ఆడినప్పుడు మేం నంబర్ వన్ జట్టుగా ఉన్నాము. మాపై బోర్డు ఒత్తిడి ఉందనడం సరికాదు. స్వేచ్చగా ఆడేందుకు మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. టీం మేనేజ్మెంట్ కఠినంగా శ్రమిస్తోంది. అయితే మైదానంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఆటగాళ్లు విఫలమం అవుతున్నారు’ అని పేర్కొన్నాడు. కాగా పాక్ సిరీస్‌కు తమ ఆటగాళ్లను పంపడానికి శ్రీలంక వెనుకాడటంతో.. భారత్ బెదిరింపుల కారణంగానే శ్రీలంక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ఆరోపించిన సంగతి తెలిసిందే. -
తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?
లాహోర్: చాలాకాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో రీఎంట్రీ ఇచ్చిన ఉమర్ అక్మల్ ఇప్పుడు విమర్శకులకు బాగానే పనిచెప్పాడు. శ్రీలంకతో వరుస రెండు టీ20ల్లో గోల్డెన్ డక్(ఆడిన తొలి బంతికే) పెవిలియన్ చేరి ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో మూడో స్థానంలోబ్యాటింగ్‌కు దిగి గోల్డెన్ డకౌట్ కాగా రెండో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేపట్టి మరోసారి మొదటి బంతికే ఔటయ్యాడు. కాగా, రెండో టీ20కి ముందు ఉమర్ అక్మల్‌తో పాటు మరో క్రికెటర్ అహ్మద్ షెహజాద్‌లకు అండగా నిలిచాడు కోచ్ మిస్బావుల్ హక్. వారిని విమర్శలతో ప్రమాదంలోకి నెట్టవద్దని, స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని మద్దతు ప్రకటించాడు. అయితే రెండో టీ20లో ఉమర్ అక్మల్-షెహజాద్‌లు నిరాశపరచడంతో ట్వీటర్లో విమర్శల వర్షం కురుస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ కోచ్ మిస్బావుల్ హక్‌ను కూడా టార్గెట్ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ కాలం చెల్లిపోయిన తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?’ అంటూ నిలదీస్తున్నారు. ‘ బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ డక్స్. రీఎంట్రీలో ఇది అత్యంత ప్రదర్శన’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘ పాపం మిస్బావుల్.. ఉమర్ అక్మల్ వరుస గోల్డెన్ డక్‌లతో మిస్బా ఇబ్బందిల్లో పడ్డాడు’ అని మరొక నెటిజన్ చమత్కరించారు. ‘ ఇక మీ ఇద్దర్నీ చూడాలని అనుకోవడం లేదు’ అంటూ మరొకరు పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక జట్టు టి20 సిరీస్‌లో ఆకట్టుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టి20ల సిరీస్‌ను శ్రీలంక 2–0తో కైవసం చేసుకుంది. లాహోర్‌లో సోమవారం జరిగిన రెండో టి20లో లంక 35 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాజపక్స (77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు. పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇమద్ వసీమ్ (47) రాణించాడు. రేపు ఆఖరి మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. శ్రీలంక సీనియర్ జట్టులో పది మంద వరకూ పాక్ పర్యటనకు రావడానికి వెనుకాడితే.. ‘జూనియర్’ జట్టుతోనే పోరుకు సిద్ధమైంది. అయితే వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంకేయులు.. టీ20 సిరీస్‌లో అంచనాలు మించి రాణించారు. వరుస రెండు టీ20ల్లోనూ విజయం సాధించి తాము ఎంత ప్రమాదకరమో చాటిచెప్పారు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్‌ను శ్రీలంక మట్టికరిపించడం గమనార్హం. -
‘ఆ ఇద్దర్నీ మరింత ప్రమాదంలోకి నెట్టకండి’
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసిన అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్‌లకు ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ మద్దతుగా నిలిచాడు. వారిద్దరూ వచ్చిన సత్తాచాటుకోవాలంటే కష్టమని మిస్బా పేర్కొన్నాడు. కనీసం వారిద్దరూ టచ్‌లోకి రావడానికి కనీస మద్దతు ఇస్తే వారు తమ పూర్వ ఫామ్‌ను అందిపుచుకుంటారన్నాడు. అంతేకానీ ఏదో ఒకటి రెండు ప్రదర్శనలతో తర్వాత ఆ ఇద్దరిపై విమర్శలు వారి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించాడు. ఇక ఒత్తిడిలో ఉన్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అండగా నిలిచాడు మిస్బావుల్ హక్. ‘ప్రమాదంలో ఉన్నవారు సాయం కోసం ప్యానిక్ బటన్ నొక్కినట్లు షెహజాద్, ఉమర్ అక్మల్ విషయంలో చేయకండి. వారు తిరిగి ఫామ్‌లోకి వస్తారు. దయచేసి మరింత ప్రమాదంలోకి నెట్టవద్దు. వారి నుంచి ఆశించిన ప్రదర్శన రావాలంటే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక సర్ఫరాజ్‌ను ఒత్తిడి నుంచి బయట పడేయటం కూడా నా విధుల్లో భాగం’ అని మిస్బా పేర్కొన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో షెహజాద్, ఉమర్ అక్మల్‌లు విఫలమైన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిస్బావుల్ మాట్లాడుతూ.. ఒక్క ప్రదర్శన కారణంగా విమర్శలు చేయడం తగదన్నాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. -
వారిద్దరూ నమ్మక ద్రోహం చేశారు..
కేప్‌టౌన్: తనను పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రస్తుత హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బావుల్ హక్ కూడా ఒక కారణమంటూ మికీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను తప్పించడంలో మిస్బావుల్తోపాటు వసీం అక్రమ్ కూడా కీలక పాత్ర పోషించారంటూ ఆర్థర్ పేర్కొన్నాడు.. వీరిద్దర్నీ తాను ఎంతగానో నమ్మితే తనకు అన్యాయం చేశారన్నాడు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆర్థర్ పేర్కొన్నాడు.వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ వైఫల్యం తర్వాత పీసీబీ ఒక కమిటీని నియమించింది. దీనిపై సదరు కమిటీ విచారణ చేపట్టిన తర్వాతే మికీ ఆర్థర్ కాంట్రాక్ట్‌ను పొడిగించడానికి పీసీబీ మొగ్గు చూపలేదు. ఇందులో మిస్బావుల్ హక్‌తో పాటు వసీం అక్రమ్‌లు సభ్యులుగా ఉండటాన్ని ఆర్థర్ ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ కమిటీ రిపోర్ట్ తనకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఈ క్రమంలోనే మిస్బావుల్, వకార్‌లను టార్గెట్ చేశాడు. ‘ నేను ఎందుకు పదవి కోల్పోయానో ఊహించగలను. అందుకు కారణం నేను నమ్మినవారే. మిస్బావుల్, అక్రమ్‌లు కమిటీ సభ్యులిగా ఉన్నప్పటికీ నా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. నేను పాకిస్తాన్ క్రికెట్‌కు పూర్తిస్థాయిలో సేవలందించాను. దాంతోనే మిస్బావుల్-అక్రమ్‌లు నాకు అనుకూలంగా నివేదిక ఇస్తారనుకున్నా. కానీ నాకు వ్యతిరేకంగా ఇచ్చారు. దాంతో నేను కోచ్ పదవి నుంచి వైదొగాల్సి వచ్చింది’ అని ఆర్థర్ పేర్కొన్నాడు. మరొకవైపు కొత్తగా హెడ్ కోచ్‌గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ సక్సెస్ కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశాడు. ‘ మిస్బావుల్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అతనొక ఉన్నతమైన వ్యక్తి.. అందుకోసమే పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల్ని అప్పజెప్పింది. కానీ నేను ప్రతీ సెకండ్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా నన్ను తప్పించడం బాధించింది’ అని ఆర్థర్ తెలిపాడు. -
కశ్మీర్ గురించి మనకెందుకు?: పాక్ కోచ్
కరాచీ: జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు మండిపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ధ్వజమెత్తగా, ఇది కశ్మీర్ ప్రజలకు కష్ట కాలంగా సర్పరాజ్ అభివర్ణించాడు. కశ్మీర్ ప్రజలకు యావత్ పాకిస్తాన్ అండగా ఉంటుందంటూ పేర్కొన్నాడు. అయితే ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డ ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్ మాత్రం కశ్మీర్ అంశం గురించి మాట్లాడటానికి నిరాకరించాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు సిద్ధమైన తరుణంలో మిస్బావుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా కశ్మీర్‌పై అభిప్రాయం చెప్పమని ఒక విలేకరి అడిగాడు. దీనికి మిస్బావుల్ సమాధానమిస్తూ‘ మనం క్రికెట్ గురించి మాట్లాడదాం. కశ్మీర్‌పై యావత్ పాకిస్తాన్ కరుణ చూపెడుతుంది. కానీ మనం మాత్రం క్రికెట్ గురించే చర్చిద్దాం. క్రికెట్ ఆడటానికే ఇక్కడికి వచ్చాం కదా. కశ్మీర్‌పై మనం మాట్లాడటానికా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్’ అని కాస్త తెలివిగా సమాధానం చెప్పాడు. ఈ రోజు పాకిస్తాన్-శ్రీలంక జట్ల కరాచీలో తొలి వన్డే జరగాల్సి ఉండగా, అందుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ పర్యటనకు తాము రాలేమంటే సీనియర్ క్రికెటర్లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నేలతో పాటు మరో 8మంది తేల్చిచెప్పడంతో శ్రీలంక జట్టు జూనియర్ జట్టుతో సిద్ధమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లలో చాలా మంది యువ క్రికెటర్లే ఉన్నారు. -
శ్రీలంకతో సిరీస్: కొత్త పెళ్లికొడుకు దూరం
కరాచీ: స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్, హెడ్ కోచ్ మిస్బావుల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం జట్టులో పలు మార్పులు చేసింది. పాక్ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని కొత్త పెళ్లికొడుకు, హరియాణా అల్లుడు హసన్ అలీని జట్టులోకి తీసుకోలేదు. హరియాణా యువతితో హసన్ అలీ వివాహం గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఇక హసన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదని, అందుకే అతడికి విశ్రాంతినిచ్చామని మిస్బావుల్ తెలిపాడు. అంతేకాకుండా సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్‌ను పక్కకు పెట్టారు. పేలవ ఫామ్‌తో విఫలమవుతున్న మహ్మద్ అమిర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ‘క్రికెట్లో గెలవడానికి సులువైన జట్లు, బలహీన ప్రత్యర్థులు ఉండరు. అనుభవం లేని ఆటగాళ్లు వచ్చినా.. సీనియర్ క్రికెటర్లు వచ్చినా మేము బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. (భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాక్ పర్యటనకు ఆసక్తి చూపకపోవడంతో.. జూనియర్ ఆటగ్లాను పంపించాలనే ఆలోచనలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఉంది. ఈ నేపథ్యంలో మిస్బావుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.) ఐదుగురు కొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే.. కానీ వారికి అవకాశం దక్కలేదు. అన్ని విభాగాల్లో పాక్ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్‌దే విజయం’అంటూ మిస్బావుల్ పేర్కొన్నాడు. పాక్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), బాబర్ అజమ్(వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఆసిఫ్ ఆలీ, పఖర్ జామన్, హారీస్ సోహైల్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హక్, అమిర్, మహమ్మద్ హస్నైన్, నవాజ్, రియాజ్, షాదాబా ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వాహబ్ రియాజ్. -
‘ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో’
కరాచీ: పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ మాజీ ఆటగాళ్లు జహీర్ అబ్బాస్, షాహిద్ ఆఫ్రిదిలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికి, పాక్ క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వన్డే, టీ20లకు కెప్టెన్‌గా సర్ఫరాజ్ విజయంతమయ్యాడని ప్రశంసించారు. అయితే టెస్టు క్రికెట్ ఎంతో కఠినమైదని.. సర్ఫరాజ్ ఈ ఫార్మట్ సారథిగా సత్తా చాటలేడని పేర్కొన్నాడు. అతడే స్వతహగా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టాలని సర్ఫరాజ్‌కు సూచించారు. తప్పుకుంటే అతడికే మంచిది: ఆఫ్రిది టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికే మేలు జరుగుతుందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడమనేది అధిక భారంతో కూడుకున్నదని పేర్కొన్నాడు. వన్డే, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్ విజయవంతమైన తరుణంలో టెస్టు నుంచి తప్పుకోవాలని ఆఫ్రిది అన్నాడు. అంతేకాకుండా టెస్టు జట్టు సారథిగా సర్ఫరాజ్ ఎంపిక సరైనది కాదనేది తన అభిప్రాయమన్నాడు. మిస్బావుల్ ఎంపిక సరైనది కాదు: జహీర్ మిస్బావుల్ హక్‌ను చీఫ్ సెలక్టర్‌గా, ప్రధాన కోచ్‌గా నియమించడం సరైనది కాదని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. రెండు పదవులు మిస్బావుల్‌కు అప్పగించడంతో అతడిపై అధిక భారం పడుతుందన్నాడు. టెస్టు క్రికెట్ చాలా కఠినమైనది ఈ ఫార్మట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడమనేది సవాల్‌తో కూడుకున్నదని.. అయితే ఆ సత్తా సర్ఫరాజ్‌కు లేదన్నాడు. దీంతో వన్డే, టీ20లపై ఫోకస్ పెట్టి, టెస్టు నుంచి తప్పుకుంటే మంచిదని జహీర్ సూచించాడు. -
ఇక పాక్ క్రికెటర్లకు బిర్యానీ బంద్?
లాహోర్: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్లు తింటూ డైట్ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఒక అభిమానైతే పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పిజ్జా-బర్గర్ తింటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ విమర్శించాడు. భారత్‌తో మ్యాచ్‌లోసర్పరాజ్ ఫీల్డ్‌లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర్లు కొట్టింది. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనకు ఆహార నియమావళిలో సరైన నియంత్రణ లేకపోవడమేననే వాదన వినిపించింది. కాగా, పాక్ క్రికెటర్లకు కొత్త కోచ్ మిస్బావుల్ హక్ సరికొత్త నియమావళిని ప్రవేశపెట్టాడట. ఫిట్నెస్ విషయంలో కొత్త సంప్రదాయానికి తెరలేపాలనే ఉద్దేశంతో ఇక నుంచి పాక్ క్రికెటర్లు బిర్యానీ, స్వీట్లకు దూరంగా ఉండాలనే నిబంధనను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మ్యాచ్‌లు జరిగే సందర్భంలో కొవ్వును పెంచే బిర్యానీ, స్వీట్లు వంటి పదార్థాలు పాక్ క్రికెటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదనే నిబంధనను చేర్చాడట. దీన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో కూడా అవలంభించాలని చూస్తున్నట్లు ఒక పాక్ జర్నలిస్టు ట్వీట్ చేశాడు. కొన్ని రోజుల క్రితం మికీ ఆర్థర్‌ను పాక్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ.. మిస్బావుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. మరొకవైపు దేశవాళీ మ్యాచ్‌లకు కోచ్‌లుగా వ్యవహరించే వారికి చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్‌ను ఎంపిక చేశారు. దాంతో ఒకే సమయంలో రెండు కీలక బాధ్యతలు మిస్బావుల్ స్వీకరించాల్సి వచ్చింది. దానిలో భాగంగా తన మార్కును చాటడానికి యత్నిస్తున్న మిస్బావుల్ హక్.. ముందుగా ఆహార నియంత్రణలో కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
నీకు పీసీబీ చైర్మన్ పదవి ఇవ్వలేదా?: అక్తర్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా, దేశవాళీ క్రికెట్ జట్ల హెడ్ కోచ్‌లకు చీఫ్ సెలక్టర్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్‌ను నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు ప్రధాన బాధ్యతలను మిస్బావుల్ హక్కు అప్పజెప్పడంపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో చమత్కరించాడు. ‘కేవలం రెండు కీలక పదవులే నీకు అప్పచెప్పారు. ఇంకా నయం పీసీబీ చైర్మన్‌గా కూడా నిన్నే నియమించలేదు’ అంటూ సెటైర్ వేశాడు. ఇది తాను తమాషాకే మాత్రమే అంటున్నానని, మిస్బావుల్‌కు కీలక బాధ్యతలు ఇవ్వడం తనకేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదన్నాడు. వీటికి మిస్బావుల్‌కు అర్హత ఉందని కొనియాడాడు. ‘ కంగ్రాట్స్ మిస్బావుల్. రెండు కొత్త బాధ్యతల్లో నీ మార్కు ఉంటుందనే అనుకుంటున్నా. అతను క్రికెట్ ఆడుతున్న సమయంలో జట్టుకు ఎంతటి ఘన విజయాలు అందించాడో, అదే తరహాలో కోచ్‌గా కూడా రాణించాలి. ఇక చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బా తనదైన ముద్ర వేస్తాడనే అనుకుంటున్నా. కాకపోతే పీసీబీ చైర్మన్‌గా మిస్బాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది(నవ్వుతూ)’ అని అక్తర్ పేర్కొన్నాడు. అయితే పీసీబీ చైర్మన్‌గా ఎంపిక చేయలేదనేది కేవలం సరదాగా వ్యాఖ్యానించానని అక్తర్ వివరణ ఇచ్చాడు. మూడేళ్ల పాటు మిస్బావుల్ హక్‌ను పాక్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించగా, మూడు ఫార్మాట్లకు అతనే కోచ్‌గా ఉంటాడని బుధవారం పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్లో భాగంగా ఆరు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అసోసియేన్లలో ప్రధాన కోచ్‌లగా ఉన్న వారికే కూడా చీఫ్‌గా మిస్బానే వ్యవహరిస్తాడని తెలిపింది. ఇక బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌ను ఎంపిక చేసింది. గతంలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌కు బౌలింగ్ యూనిట్ బాధ్యతల్ని కేటాయించింది. -
హెడ్ కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా..
కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్ ఆ దేశ ప్రస్తుత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పీసీబీ మిస్బావుల్ హక్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కోచ్ పదవి కోసం పలువురు దిగ్గజాలు పోటీ పడ్డప్పటికీ మిస్బావుల్‌కే పీసీబీ పెద్దలు పెద్ద పీట వేశారు. ప్రధానంగా విదేశీ కోచ్‌లను వద్దనుకున్న పీసీబీ.. స్వదేశీ కోచ్‌ల్లో మిస్బావులే యోగ్యుడిగా భావించి అతనికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. మూడేళ్ల పాటు మిస్బావుల్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. కాగా, పాకిస్తాన్‌కు చెందిన ఆరు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ జట్ల కోచ్‌లకు చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్నే ఎంపిక చేయడం విశేషం. దాంతో దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి హెడ్ కోచ్‌ల పని తీరును కూడా మిస్బావులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. 2017 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిస్బావుల్ తన తాజా నియామకంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనపై ఉంచిన అతి పెద్ద బాధ్యతగా పేర్కొన్నాడు. ఇప్పుడు తనపై చాలా అంచనాలు ఉన్నాయని, దాన్ని సాకారం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఇక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌ను ఎంపిక చేశారు. గతంలో పాకిస్తాన్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌పై మరోసారి నమ్మకం ఉంచుతూ బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. -
పాక్ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మిస్బావుల్ హక్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మిస్బావుల్‌ను హెడ్ కోచ్‌గా నియమించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ పాక్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, స్వదేశీ క్రికెటర్ కావడంతో మిస్బావుల్ హక్కే మొగ్గుచూపినట్లు సమాచారం. విదేశీ కోచ్‌ల ప్రయోగం పాకిస్తాన్‌కు పెద్దగా లాభించకపోవడంతో డీన్ జోన్స్‌ను ఫైనల్ జాబితా వరకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. పీసీబీ కుదించిన జాబితాలో మిస్బావుల్ హక్‌తో పాటు ఆ దేశానికి చెందిన మొహిసిన్ హసన్ కూడా పోటీ పడ్డారు. అయితే 65 ఏళ్ల మొహిసిన్ ఖాన్‌పై పీసీబీ పెద్దగా ఆసక్తికనబరచలేదు. ఆయనకి వయసే ప్రధాన అడ్డంకిగా నిలవడంతో మిస్బావుల్‌కే ఫైనల్ ఓటేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనస్‌ను ఎంపిక చేయడానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని యోచిస్తున్నారు. ఈ రేసులో వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్నీ వాల్ష్ ఉన్నప్పటికీ వకార్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చూస్తున్నారు. -
విజయంతో వీడ్కోలు
►చివరి టెస్టులో పాక్ విజయం ►ఆటకు మిస్బా, యూనిస్ టాటా ►విండీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ సొంతం రొసియూ (డొమినికా): ఒక్క బంతి... ఒకే ఒక్క బంతి... ఉత్కంఠకు తెరదించింది. చివరి వరుస బ్యాట్స్‌మన్‌ను బౌల్డ్ చేసింది. ఓ జట్టును చివరి టెస్టులో గెలిపించింది. 1–1తో సమమయ్యే సిరీస్‌ను 2–1తో మురిపించింది. ...ఆ బంతి యాసిర్ షాది. ఈ విజయం పాకిస్తాన్‌ది. అంతేకాదు... పాక్ వెటరన్స్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్లకు ఘనమైన వీడ్కోలు పలికింది. పాక్ బౌలర్ యాసిర్ షా చివరి బంతి వేసేందుకు సిద్ధమయ్యాడు. ఐదో రోజు ముగిసేందుకు... అతని తర్వాత మరో ఓవర్ మాత్రమే మిగిలుంది. ఈ ఏడు బంతులాడితే వెస్టిండీస్ చివరి టెస్టును డ్రా చేసుకుంటుంది. మూడు టెస్టుల సిరీస్ 1–1తో డ్రా అవుతుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ మధ్య యాసిర్ బంతి వేశాడు. క్రీజులో ఉన్న గాబ్రియెల్ (4) వైడ్‌గా వెళుతున్న దాన్ని వికెట్లపై ఆడుకున్నాడు. అతని బ్యాట్ అంచును తాకుతూ బంతి వికెట్లకు తగిలింది. అంతే గాబ్రియెల్ బౌల్డ్! ఇక ‘డ్రా’ తప్పదేమో... అనుకునే దశలో అనూహ్య మలుపు పాక్‌ను గెలుపు వైపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో పాక్ 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో వెస్టిండీస్ గడ్డపై పాక్ తొలిసారి సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 304 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ చివరి రోజు 96 ఓవర్లలో 202 పరుగుల వద్ద ఆలౌటైంది. కడదాకా మొండిగా పోరాడిన చేజ్ (239 బంతుల్లో 101 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూనిస్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సంక్షిప్త స్కోర్లు: పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 376; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 247; పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 174/8; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (96 ఓవర్లలో) (చేజ్ 101 నాటౌట్, హెట్మెయిర్ 25, హోల్డర్ 22; యాసిర్ షా 5/92, హసన్ అలీ 3/33). అన్ని రకాల క్రికెట్‌ను ఆడేశాను. ఏ జట్టుకు ఆడినా... నూటికి 200 శాతం అంకితభావంతో ఆడా. నా లైఫ్‌లో నేను 27, 28 ఏళ్లు క్రికెట్‌కే వెచ్చించానని భావిస్తున్నా. ఇక మళ్లీ రిటైర్మెంట్ను సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదు. –యూనిస్ ఖాన్ నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే... నేను చేయగలిగిన దానికంటే కొంచెం ఎక్కువే చేశానన్న అనుభూతి ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. సారథిగా నడిపించాను. ఉన్న వనరులతో, గడ్డు పరిస్థితుల్లో సాధించిన విజయాలతో సంతృప్తిగా ఉంది. –మిస్బా ఉల్ హక్ -
బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్!
జమైకా: చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా-వుల్-హక్‌ను దురదృష్టం వెంటాడింది. టెస్టుల్లో 11 సెంచరీ ఒక్క పరుగు తేడాతో దూరమైంది. వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 407 పరుగులకు ఆలౌటైంది. మిస్బా ఒక్క పరుగు తేడాతో శతకం కోల్పోయాడు. 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి అండగా నిలిచే బ్యాట్స్ మన్ లేకపోవడంతో సెంచరీ చేయలేకపోయాడు. చివరి బ్యాట్స్‌మన్ మహ్మద్ అబ్బాస్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో శతకానికి ఒక్క దూరంలో మిస్బా నిలిచిపోయాడు. అయితే పాకిస్తాన్ ఇంకా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సివుంది. విండీస్ మరో రెండు టెస్టులు కూడా ఆడనుంది. కాగా, టెస్టుల్లో సెంచరీ దగ్గర ఆగిపోయిన పాకిస్తాన్ తొలి క్రికెటర్ గా మిస్బా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ విధంగా సెంచరీకి దూరమైన ఆరో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. గతంలో జెఫ్రీ బాయ్‌కాట్, స్టీవ్ వా, అలెక్స్ టుడర్, షాన్ పొలాక్, ఆండ్రూ హాల్ ఇదేవిధంగా సెంచరీ చేజార్చుకున్నారు. -
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సీనియర్
-
మిస్బా గుడ్ బై!
కరాచీ:పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ తన అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తనకు చివరిదని మిస్బా తెలిపాడు. ఈ మేరకు గురువారం తన క్రికెట్ కెరీర్ పై ఓ ప్రకటన చేశాడు.'విండీస్ తో సిరీస్ నాకు ఆఖరిది. ఈ విషయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కు ఇప్పటికే తెలియజేశా. నా చివరి సిరీస్ ను విజయవంతంగా ముగించాలని అనుకుంటున్నా. దాని కోసం యత్నిస్తా. నాపై ఎటువంటి ఒత్తిడి లేదు'అని పాకిస్తాన్ క్రికెట్ లో అత్యంత సక్సెస్ ఫుల్ గా నిలిచిన మిస్బా అన్నాడు. 53 టెస్టు మ్యాచ్ లకు సారథిగా మిస్బా వ్యవహరించాడు. అందులో 23 విజయాలు, 11 డ్రాలు, 18 ఓటములు ఉన్నాయి. ఈ నెల 21న పాకిస్థాన్-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ తరువాత మిస్బా కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని మిస్బా తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించాలని చూస్తున్న పీసీబీ.. దానిలో భాగంగా మిస్బాపై ఒత్తిడి తెచ్చింది. ఇక పాకిస్తాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చైర్మన్ షహర్యార్ తేల్చిచెప్పడంతో మిస్బా తన అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడు. -
కెప్టెన్సీని వీడనని.. రిటైరయ్యాడు
లాహోర్: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. వెస్టిండీస్‌తో జరిగే సిరీసే తనకు చివరిదని చెప్పాడు. గురువారం లాహోర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నట్టు స్పష్టం చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, క్రికెట్‌తో తన అనుబంధాన్నికొనసాగిస్తానని చెప్పాడు. 42 ఏళ్ల హక్ పాక్ తరపున 72 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బాను తప్పుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరగా, దానికి ఈ వెటరన్ క్రికెటర్ ఒప్పుకోలేదు. తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ పీసీబీని ప్రశ్నించాడు. పాక్ తరఫున మరికొన్ని రోజులు ఆడాల్సిందిగా తన భార్య, పిల్లలు కోరుకుంటున్నట్టు చెప్పాడు. కాగా పాక్ ఇటీవల టెస్టు ఫార్మాట్లో ఓటమి చవిచూడటంతో ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ హక్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పాడు. రిటైర్మెంట్ గురించి హక్‌తో చర్చించలేదని తెలిపాడు. ఇంతలోనే అతను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. -
క్రికెట్ కెప్టెన్ గా చివరి సిరీస్?
కరాచీ: తాను క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనంటూ ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై తిరుగుబాటు జెండా ఎగురేసిన మిస్సావుల్ హక్ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్ తో జరుగనున్న టెస్టు సిరీస్ తరువాత మిస్బావుల్ ను సాగనంపేందుకు పీసీబీ సమాయత్తమైంది. ఈ మేరకు మిస్బావుల్ హక్ తప్పుకోవాల్సిందిగా పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ సూత్రప్రాయంగా సూచించారు. 'మిస్బావుల్ హక్ నన్ను కలవడానికి గతవారం అపాయింట్ మెంట్ తీసుకున్నాడు. దాంతో మిస్బావుల్ ను కలిసి అతని నాయకత్వంపై సుదీర్ఘంగా చర్చించా. ఈ క్రమంలోనే అతని క్రికెట్ కెరీర్ పై కూడా ఒక నిర్ణయానికి రావాలని సూచించా. ఇక అతని క్రికెట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వెస్టిండీస్ తో సిరీస్ కు మిస్బావుల్ హక్ నే కెప్టెన్ గా నియమించాం. అతని క్రికెట్ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నా. ప్రస్తుతం 43 ఒడిలో ఉన్న మిస్బా.. విండీస్ తో సిరీస్ తో తరువాత ఆడతాడని నేను అనుకోవడం లేదు'అని షహర్యార్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించాలనే పీసీబీ భావిస్తోంది. దీనిలో భాగంగా అజహర్ అలీని ఇప్పటికే వన్డే కెప్టెన్ గా పీసీబీ తప్పించింది. ఇప్పుడు టెస్టు కెప్టెన్ మిస్బావుల్ వీడ్కోలుకు విండీస్ తో సిరీస్ ద్వారా ముగింపు పలికేందుకు ప్రణాళిక రూపొందించింది. ట్వంటీ 20 కెప్టెన్ గా సర్ఫరాజ్ ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా చేసే క్రమంలోనే పీసీబీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. -
ఉండాలా? వద్దా?
కరాచీ: తన కెప్టెన్సీ పదవిపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు పాకిస్తాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్ మిస్బావుల్ హక్. కొన్ని రోజుల క్రితం కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ ప్రశ్నించిన మిస్బావుల్.. అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తన అవసరం ఉందా? లేదా? అనే విషయాన్ని తేల్చుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ను కలిసి తన కెప్టెన్సీ పదవిపై క్లారిటీ కోరనున్నాడు. ఈ మేరకు మరో రెండు రోజుల్లో షహర్యార్ ఖాన్ తో భేటీ కానున్నట్లు మిస్బా తెలిపాడు. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్ తో సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో తన కెప్టెన్సీపై తుది నిర్ణయాన్ని షహర్యార్ కే వదిలేయనున్నట్లు మిస్బా తెలిపాడు . 'వచ్చే సిరీస్ కు ఆటగాడిగా అందుబాటులో ఉంటా. అంతవరకూ ఓకే. అదే క్రమంలో కెప్టెన్ గా నేనే ఉంటానా?లేక ఎవరినైనా ఎంపిక చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఆ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ నిర్ణయిస్తారు. దాని కోసమే రెండు రోజుల్లో షహర్యార్ ను కలిసి వివరణ అడుగుతా?' అని మిస్బా పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్తాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి దిగే ప్రసక్తే లేదని మిస్బా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 'నన్ను ఎల్లగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. నేను ఫిట్‌గానే ఉన్నసమయంలో నన్ను వీడ్కోలు చెప్పమంటున్నారు. ఇక్కడ వయసు అనేది ప్రధానం కాదు.. ఫిట్ నెస్ అనేదే ముఖ్యం. నేను చాలా ఫిట్ గా ఉన్నా. ఇప్పుడు నేనున్నపరిస్థితుల్లో వీడ్కోలు చెప్పే యోచన లేదు. త్వరలో జరగబోయే పీఎస్ఎల్లో నా ఫిట్ నెస్‌ను నిరూపించుకుంటా' అంటూ మిస్బా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల్లో షహర్యార్ తో మిస్బా భేటీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇక బోర్డుతో తాడో పేడో తేల్చుకునేందుకే మిస్బా సిద్ధమయ్యాడనే వాదని వినిపిస్తోంది. ఒకవేళ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోమని బోర్డు ఆదేశించిన పక్షంలో ఆటగాడిగా కూడా వీడ్కోలు చెప్పాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
కెప్టెన్సీ నుంచి దిగను గాక దిగను!
కరాచీ:ఇప్పటికే అనేక అంతర్గత సమస్యలతో సతమవుతున్న పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో మరో సరికొత్త ముసలం మొదలైంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ నియమించాలనే ప్రయత్నంలో ఉన్న పీసీబీకి ఆ దేశ టెస్టు సారథి మిస్బావుల్ హక్ ఊహించని ఝలక్ ఇచ్చాడు. పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బాను తప్పుకోమని కోరగా, దానికి ఆ వెటరన్ క్రికెటర్ ఒప్పుకోలేదు. దాంతో పాటు తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ పీసీబీని ప్రశ్నించాడు. తాను ఫిట్ గా ఉన్న క్రమంలో జట్టు నుంచి తప్పుకోమంటూ సంకేతాలు పంపడం ఏమిటని నిలదీశాడు. గతంలో కెప్టెన్సీ ని తప్పుకుంటానంటూ పీసీబీకి మిస్బా పదే పదే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు మిస్బా అవసరం జట్టుకు చాలా ఉందని భావించిన పీసీబీ.. ఆ మేరకు అతన్ని బతిమాలి మరీ టెస్టు కెప్టెన్ గా ఉండేలా చేసింది. ఈ ప్రయత్నంలో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ముఖ్య భూమిక పాత్ర పోషించారు. ప్రస్తుతం మిస్బా తాను జట్టులో కొనసాగడంతో పాటు కెప్టెన్ గా ఉంటానని అంటుంటే, పీసీబీ మాత్రం ఇక చాలు అంటూ సాగనంపే ప్రయత్నం చేస్తోంది. 'నన్ను ఎల్లగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. నేను ఫిట్‌గానే ఉన్నసమయంలో నన్ను వీడ్కోలు చెప్పమంటున్నారు. ఇక్కడ వయసు అనేది ప్రధానం కాదు.. ఫిట్ నెస్ అనేదే ముఖ్యం. నేను చాలా ఫిట్ గా ఉన్నా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో వీడ్కోలు చెప్పే యోచన లేదు. త్వరలో జరగబోయే పీఎస్ఎల్లో నా ఫిట్ నెస్‌ను నిరూపించుకుంటా'అని మిస్బా తెలిపాడు. మరొకవైపు పాక్ వన్డే సారథిని మార్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సమాయత్తమవుతోంది. ఆసీస్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవానికి కెప్టెన్ అలీని బాధ్యున్ని చేస్తూ దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు పీసీబీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే లాహోర్‌లో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్, ప్రధాన కోచ్ ముస్తాక్ అహ్మద్‌ల భేటీ అయ్యారు. ఈ భేటీలో అజహర్ అలీని తప్పించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరొ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్‌కు వన్డే పగ్గాలు అప్పజెప్పేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ట్వంటీ 20 కెప్టెన్‌గా ఉన్న సర్పరాజ్‌ను వన్డే కెప్టెన్‌గా చేయాలనేది పీసీబీ పెద్దల భావనగా ఉంది. మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు ఒక కెప్టెన్‌నే నియమిస్తే ఆశించిన ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తుందని వారు యోచిస్తున్నారు. టెస్టు కెప్టెన్ గా మిస్బావుల్ హక్ ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా తొలగించి మొత్తం జట్టు పగ్గాలను సర్ఫరాజ్‌ను అప్పగించాలనేది పాక్ పెద్దల భావన. -
'నా రిటైర్మెంట్ సమయం వచ్చేసింది'
సిడ్నీ:తన పదిహేనళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నాడు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మిస్బా.. సిడ్నీలో జరిగే చివరిదైన మూడో టెస్టు తరువాత తన వీడ్కోలు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు మిస్బా తన మనుసులోని మాటను వెల్లడించాడు. 'నేను ఎప్పుడూ రిటైర్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జట్టులో కొనసాగుతున్నా. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసింది అనుకుంటున్నా. నా రిటైర్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జట్టు అవసరాల కోసం ఆడకపోతే ఇక నేను అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఆ క్రమంలోనే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. సిడ్నీ టెస్టుకు ముందుగానీ, ఆ తరువాత గానీ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటా'అని మిస్బా పేర్కొన్నాడు.ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ ఇప్పటికే 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో తన రిటైర్మెంట్ గురించి ఆలోచనలో పడ్డాడు మిస్బా. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో మిస్బా దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 పరుగులు చేసిన మిస్బా.. రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ గా పెవిలియన్ చేరాడు. -
ఆ మార్కు అవసరం లేదు: మిస్బా
కరాచీ: గత కొంతకాలంగా తన వీడ్కోలుపై వస్తున్న ఊహాగానాలకు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన రిటైర్మెంట్పై ఎవ్వరూ తొందరపడాల్సిన అవసరం లేదంటూనే, ఆ నిర్ణయం తన చేతుల్లో ఉందనే విషయం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నాడు. దాంతోపాటు వీడ్కోలు నిర్ణయాన్ని ముందుగా ప్రకటించి ఏదో సత్కారం పొందాలనేది తన అభిమతం కాదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వీడ్కోలుపై ఎటువంటి ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 'ఇక్కడ వయసులో పనిలేదు. మన ఫిట్‌నెస్‌పైనే జట్టులో ఉండటం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకూ నా జట్టుకు ఉపయోగపడటమే నా పని. ఆ రకంగానే ఆలోచిస్తున్నా. ఒక సీనియర్‌గా యువకులకు ఏ తరహాలో ఉపయోగపడాలి అనేదే నా ఆలోచన. అంతేగానీ ఇది నా చివరి మ్యాచ్ అని ముందుగా ప్రకటించి సన్మానాలు అందుకోవడం వంటి ప్రణాళికలు ఏమీ లేవు. నా రిటైర్మెంట్ అనేది నా చేతుల్లోనే ఉంది. మా క్రికెట్ బోర్డుకు ఇక్కడ సంబంధం ఉండదు. ఇది నా చివరి మ్యాచ్ అనే మార్కు నాకు అవసరం లేదు' అని మిస్బా తెలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు ముందు మిస్బా తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి. అయితే పీసీబీ చైర్మన్ షహర్యాన్ ఖాన్ విన్నపం మేరకు మిస్బా తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఆ క్రమంలోనే ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల్లో మిస్బా కొనసాగుతూ వచ్చాడు. కాగా, తాజాగా తన వీడ్కోలు నిర్ణయంపై ముందస్తు ప్రకటన అవసరం లేదని స్పష్టం చేయడంతో అతను మరికొంత కాలం కొనసాగాలనే ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. -
రెండో టెస్టుకు మిస్బా దూరం
హామిల్టన్:న్యూజిలాండ్ తో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెసుకు పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ దూరం కానున్నాడు. అతని మావయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మిస్బా తన పర్యటన నుంచి అర్థాంతరంగా వైదొలగనున్నాడు. ఆ మేరకు ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న మిస్బా..హుటాహుటీనా భార్య, కూతురితో కలిసి పాక్ కు బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. దాంతో రెండో టెస్టులో అజహర్ అలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, మిస్బా గైర్హజరీతో సారథ్య బాధ్యతలు ఎవరికీ అప్పగించాలన్న దానిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. -
మిస్బా మరో రికార్డు
క్రైస్ట్ చర్చ్: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ టీమ్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మరో రికార్డు సాధించాడు. పాకిస్థాన్ జట్టుకు ఎక్కువ టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో అతడు ఆడుతున్నాడు. కెప్టెన్ గా ఈ మ్యాచ్ అతడికి 50వది. ఇమ్రాన్ ఖాన్ రికార్డు అతడు అధిగమించాడు. ఇమ్రాన్ ఖాన్ 48 టెస్టుల్లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇప్పటివరకు 68 టెస్టులు ఆడిన మిస్బా ఉల్ హక్ 48.31 సగటుతో 4831 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలున్నాయి. ఉపఖండం జట్ల(భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్,) లో ఎక్కువ టెస్టు సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గానూ మిస్బా ఖ్యాతికెక్కాడు. భారత దిగ్గజ కెప్టెన్లయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించి అతడీ ఘనత అందుకున్నాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలనుకున్న మిస్బా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అభ్యర్థన మేరకు మరికొంత కాలం కొనసాగేందుకు అంగీకరిచాడు. భవిష్యత్ లో అతడు మరిన్ని రికార్డులు సాధించడం ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. -
గంగూలీ, ధోనీల రికార్డు బద్దలుకొట్టాడు!
అబుదాబి: పాకిస్తాన్ జట్టులో విజయవంతమైన ఆటగాడిగా, సక్సెస్ ఫుల్ టెస్ట్ కెప్టెన్ గానూ పేరు తెచ్చుకున్నాడు మిస్బా ఉల్ హక్. అత్యధిక సిరీస్ విజయాలు అందించిన పాక్ కెప్టెన్ అయిన మిస్బా.. ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఉపఖండం జట్ల(భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్,) లో ఎక్కువ టెస్టు సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గానూ ఘనత వహించాడు. దీంతో భారత దిగ్గజ కెప్టెన్లయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అదిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాక్ జట్టుకు 48 టెస్టులకు మిస్బా సారథిగా వ్యవహరించగా.. 24 విజయాలు, 13 ఓటములతో పాటు 11 టెస్టులు డ్రా చేసుకుని 50శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకూ గంగూలీ, ధోనీలతో సహా 9 టెస్టు సిరీస్ విజయాలతో మిస్బా ఉల్ హక్ తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వెస్టిండీస్ పై మంగళవారం పాక్ టెస్ట్ సిరీస్ నెగ్గడంతో 10 టెస్ట్ సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గా మిస్బా నిలిచాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అబిదాబిలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ పై 133 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయాన్ని సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇలా అయితే ఎలా?: మిస్బావుల్ ధ్వజం
కరాచీ:తమతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడటానికి సుముఖంగా లేమంటూ స్పష్టం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ ధ్వజమెత్తాడు. అసలు ఇండో -పాక్ క్రికెట్ సంబంధాలపై ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలియకుండా ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని విమర్శించాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగాలని ప్రజలు కోరుకున్నప్పుడు, ఈ క్రీడలో రాజకీయ పరమైన అంశాలను ముడిపెట్టకూడదన్నాడు. 'నేను ఎప్పుడూ భారత్‌తో సిరీస్‌తో ఆడటానికి ఇష్టపడుతుంటాను. ప్రత్యేకంగా భారత్ ఆడుతున్నప్పుడు పాక్ కెప్టెన్‌గా ఉండాలని అనుకుంటా. క్రికెట్ అనే క్రీడలో రాజకీయ జోక్యం లేనప్పుడే మాత్రమే ఇరు దేశాల క్రికెట్ సిరీస్ జరుగుతుంది' అని మిస్బా విమర్శనాస్త్రాలు సంధించాడు. అంతకుముందు పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అనురాగ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సంగతి తెలిసిందే. . అనురాగ్ ఒక క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా?లేక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? అంటూ పాక్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ విమర్శించాడు. అనురాగ్ తాజా ప్రకటన కచ్చితమైన రాజకీయ వ్యాఖ్యగా ఉందంటూ విమర్శించాడు. ఒక స్పోర్టింగ్ బాడీలో భాగమైన బీసీసీఐ ..రాజకీయ పరమైన ఆధిపత్యం చెలాయిస్తుందనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని మరో మాజీ అబ్దుల్ ఖాదిర్ విమర్శించారు. చాలాకాలం నుంచి తమతో క్రికెట్ ఆడటానికి భారత్ మొగ్గు చూపకపోయినప్పటికీ, అనురాగ్ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలతో వచ్చే లాభం ఏముందని ప్రశ్నించాడు. -
'నా కెరీర్లోనే గర్వించదగ్గ క్షణం'
లాహోర్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ జట్టు తొలిసారి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ మిస్బావుల్-హక్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది తమ సుదీర్ఘ నిరీక్షణలో భాగమైనా, ఈ ర్యాంకును కాపాడుకోవాలంటే తీవ్రపోటీ తప్పదనే వాస్తవాన్ని మిస్బా అంగీకరించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న నిలకడను కొనసాగిస్తే తప్పకుండా మరింత కాలం నంబర్ వన్‌గానే కొనసాగుతామనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇది తన టెస్టు కెరీర్లోనే గర్వించదగ్గ క్షణమని మిస్బా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తమ జట్టు సమష్టి కృషికి తగిన ఫలితమన్నాడు. టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో గతవారం టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. వారం రోజుల్లోనే ఆ ర్యాంకును కోల్పోయింది. నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకోవాలంటే విరాట్ కోహ్లి సేన కచ్చితంగా గెలవాల్సిన టెస్టు వర్షార్పణం అయ్యింది. దీంతో అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-2 తో డ్రా చేసుకున్న పాకిస్తాన్ రెండో స్థానం నుంచి నంబర్ వన్ కు చేరింది. గత ఐదు సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంకపై మాత్రమే పాకిస్తాన్ టెస్టు సిరీస్ లను కోల్పోగా, మిగతా అన్నింటా విజయం సాధించింది. -
ఆ కెప్టెన్ ఇప్పట్లో వీడ్కోలు పలకడు
'పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ మిస్బాఉల్ హక్ మరికొద్ది నెలల్లో రిటైర్ పోతాడని అందరూ అనుకుంటున్నారు. కానీ, మిస్బా నుంచి ఇంకా ఎంతో ఆశించవచ్చు' అని చీఫ్ సెలెక్టర్, వెటరన్ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో అతడి శతకం అనిర్వచనీయమంటూ ప్రశంసించాడు. అతడికి వయసు అనేది అడ్డంకి కాదని, పాక్ క్రికెట్ కు అతడు ఎంతో కాలం సేవలు అందిస్తాడని పాక్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన మిస్బాకు మద్ధతు తెలిపాడు. మిస్టా కెప్టెన్సీలో పాక్ 20 టెస్టు విజయాలు సొంతం చేసుకుంది. ఈ వయసులో కూడా అతడి ఫిట్ నెస్ చూస్తే తనకు చాలా ఆశ్చర్యమేస్తుందన్నాడు. బ్యాట్స్ మన్‌గా, కెప్టెన్‌గానూ జట్టుకు అతడి సేవలు మరింత కాలం అందించాలని సూచించాడు. లార్డ్స్ టెస్టులో ఘనవిజయం సాధించిన పాక్, ఓల్డ్ ట్రాపోర్డ్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనా.. మిస్టా కెప్టెన్సీలో జట్టు కోలుకుని సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తుందని అభిప్రాయపడ్డాడు. -
పాక్ ఆటగాళ్లు ఎందుకు రెచ్చిపోయారు?
కరాచీ: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం తమ క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమని కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలువురు పాకిస్తాన్ ఆటగాళ్లు నిషేధం ఎదుర్కొన్న ఇదే వేదికలో విజయం సాధించడం జట్టులో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత ఆసియా ఉపఖండం వెలుపల పాక్ సాధించిన తొలి విజయం కావడం గమనార్హం. పుష్ అప్స్ సీక్రెట్ చెప్పేశాడు! 'కాబుల్ ఆర్మీ క్యాంపు సిబ్బంది పర్యవేక్షణలో పాక్ ఆటగాళ్లు శిక్షణ పొందారు. కఠోరశ్రమతో కూడిన ఫీట్స్ చేశాం. ఆర్మీతో కలిసి పుష్ అప్స్ చేసేవాళ్లం. అందుకే వారికి ఈ విజయంలో భాగం ఉందని తెలిపేందుకు, ఆర్మీ వారికి ఈ విషయం గుర్తుకుతేవడానికి ఇంగ్లండ్ పై గెలిచిన అనంతరం లార్డ్స్ లో పాక్ ఆటగాళ్లు పుష్ అప్స్ తీశారు' అని మిస్బా వివరించాడు. సెంచరీ చేసిన అనంతరం మిస్బా కూడా పుష్ అప్స్ తీశాడు. ఆర్మీ వారు తమలో స్ఫూర్తిని నింపారని, మూడు టెస్టుల్లోనూ మంచి ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిఖ్ భాగస్వామ్యంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించారని కొనియాడాడు. -
మిస్బా అజేయ శతకం: పాక్ 282/6
లండన్: ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ (179 బంతుల్లో 110 బ్యాటింగ్; 18 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ తొలి రోజు ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. హఫీజ్ 40, యూనిస్ ఖాన్ 33 పరుగులు చేశారు. అనంతరం అసద్ షఫిక్ (130 బంతుల్లో 73; 12 ఫోర్లు) అండతో మిస్బా జట్టు స్కోరును పెంచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు తీశాడు. -
'మా క్రికెట్‌కు పాత రోజులు వస్తాయి'
కరాచీ: ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌తో తమ దేశ క్రికెట్ కు పునర్ వైభవం స్తుందని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్-హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌తో పాక్ క్రికెట్ కు పాత రోజులు వస్తాయన్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్‌కు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మిస్బా.. తమ తాజా ఇంగ్లండ్ పర్యటన పాక్ క్రికెట్ కు లాభిస్తుందన్నాడు. ఇదొక పెద్ద పర్యటనగా మిస్బా అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌ను గెలవడానికి శతవిధిలా ప్రయత్నిస్తామని మిస్బా తెలిపాడు. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో ఏ జట్టూ అడుగు పెట్టలేదు. క్రికెటర్లు బస్సులో వెళుతున్న సమయంలో దాడి జరిగింది. ఆ దాడిలో కొంతమంది ఆటగాళ్లతో పాటు స్థానిక అంపైర్ కూడా గాయపడ్డాడు. దీంతో అప్పట్నుంచీ పాకిస్తాన్ లో ఆడటానికి మిగతా దేశాలు జట్లు సంకోచిస్తున్నాయి. ఇటీవల తమ దేశంలో ఆడాలంటూ వెస్టిండీస్‌తో జరిపిన చర్చలు సత్ఫలితాన్నివ్వలేదు. మరోవైపు 2012 తరువాత ఇంగ్లండ్ లో పాక్ పర్యటించడం ఇదే తొలిసారి. దాంతో పాక్ జట్టు పేలవమైన ఫామ్ తో వరుస గా వైఫల్యం చెందుతుంది. -
వీడ్కోలుపై మిస్బా త్వరలో నిర్ణయం!
కరాచీ:పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ తన క్రికెట్ కెరీర్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరే ముందే మిస్బా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుదామని మిస్బా భావించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విన్నపం మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. అయితే మిస్బా తన క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు పీసీబీ ఉన్నతాధికారి తెలిపారు. ఇంగ్లండ్ తో సిరీస్‌కు మిస్బా కెప్టెన్ గా వ్యవహరించనున్నా, ఆ పర్యటనకు బయల్దేరే ముందే తన వీడ్కోలు నిర్ణయాన్ని మిస్బా వెల్లడించే అవకాశం ఉందన్నారు. గతేడాది ఏడాది ప్రపంచకప్‌లో ఆసీస్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు, టీ 20లకు మిస్బా గుడ్ బై చెప్పాడు. పాకిస్తాన్ విజయాల్లో అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా మిస్బా కీలక పాత్ర పోషించాడు. 2012, 2015 సంవత్సరాల్లో ఇంగ్లండ్ పై పాక్ గెలిచిన రెండు టెస్టు సిరీస్ లకు మిస్బానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ రెండు టెస్టు సిరీస్‌లు యూఏఈలో జరిగాయి. కాగా, త్వరలో ఇంగ్లండ్ లో ఆరంభం కానున్న టెస్టు సిరీస్ నుంచి మాత్రం 42 ఏళ్ల మిస్బాకు తీవ్రమైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. -
పాక్ క్రికెటర్లకు డోప్ టెస్టులు!
కరాచీ: పలువురు పాకిస్తాన్ క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. గతేడాది డోపింగ్ కు పాల్పడి కొంతకాలం నిషేధం ఎదుర్కొన్న యాసిర్ షాతో పాటు, టెస్టు కెప్టెన్ మిస్బావుల్-హక్లకు క్రికెట్ వరల్డ్ గవర్నింగ్ బాడీ డోప్ టెస్టులు నిర్వహించినట్లు పాకిస్తాన్ టీమ్ మేనేజర్ ఇంతికాబ్ అలమ్ శుక్రవారం ధృవీకరించారు. వచ్చే నెలలో పాక్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న నేపథ్యంలో ఏ విధమైన పాజిటివ్ ఫలితం వచ్చినా అది జట్టుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున కొంతమంది క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించినట్లు ఇంతికాబ్ పేర్కొన్నారు. మిస్బావుల్ హక్, యాసిర్ షాలతో పాటు, వన్డే కెప్టెన్ అజహర్ అలీ, ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అయితే వీరిలో యాసిర్ షాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధానంగా దృష్టిసారించినట్లు ఇంతికాబ్ తెలిపారు. గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం నిర్వహించిన డోపింగ్ టెస్టులో యాసిర్ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై మూడు నెలల నిషేధం విధించారు. అయితే ఈ ఏడాది మార్చి నెలతో యాసిర్ పై విధించిన నిషేధం గడువు ముగిసింది. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ కు వెళ్లే పాక్ జట్టులో యాసిర్ తో పాటు పలువురు క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. జూలై 14 నుంచి ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో పాక్ తలపడనుంది. -
వచ్చే ఏడాదే అతడి రిటైర్మెంట్!
కరాచీ: రిటైర్మెంట్ అంశంపై కొన్ని రోజులవరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను కోరింది. వచ్చే ఏడాది వరకూ ఆటను కొనసాగించాలని బోర్డు మిస్బాను సంప్రదించింది. ఇంగ్లండ్‌తో సిరీస్ జరిగే వరకు వీడ్కోలు విషయంపై ఎటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవద్దని పేర్కొంది. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ ముగిశాక తన రిటైర్మెంట్ విషయాన్ని బోర్డుకు వెల్లడిస్తాడని మిస్బా చెప్పాడు. ఒకవేళ వీడ్కోలు పలకాలని మిస్బా భావించినట్లయితే, మరో ఏడాదిపాటు ఆటను కొనసాగించాలని అతడిని కోరతామన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో కెప్టెన్, సీనియర్ ప్లేయర్‌గా మిస్బా జట్టులో ఉండటం మాకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతవారం దుబాయ్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం తన రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు. 2010లో పాక్ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లతో సిరీస్‌లు జరగలేదని, వచ్చే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో టెస్ట్ సిరీస్‌లు ముగిశాక మిస్బా రిటైర్మెంట్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆసీస్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు మిస్బా గుడ్ బై చెప్పిన విషయం విదితమే. -
'మా క్రికెట్ టీమ్ బలహీనంగా లేదు'
అబు దాబి : రేపట్నుంచి పాకిస్థాన్ -ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో ముందుగానే ఇరుజట్ల ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు బలహీనంగా ఉందంటూ పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్-హక్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ ఎదురుదాడికి దిగాడు. తమ జట్టులో సీనియర్లు లేకపోయినా.. ఇప్పుడు తాము ఎంతమాత్రం బలహీనంగా లేమన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. 2012 లో పాకిస్థాన్ ఓడించిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కంటే ప్రస్తుతం తమతో తలపడుతున్న ఇంగ్లిష్ టీమ్ బలహీనంగా ఉందని మిస్బా వ్యాఖ్యానించడంపై అండర్సన్ స్పందించాడు. కొంతవరకూ తమ జట్టులో అనుభవలేమి ఉండవచ్చు కానీ తామేమి అప్పటికంటే బలహీనంగా అయితే లేమన్నాడు. పాకిస్థాన్ తో తలపడుతున్న తమ జట్టు టాలెంట్ ఉన్న ఆటగాళ్లతో నిండివుందన్న విషయం గుర్తించుకోవాలని మిస్బాకు సూచించాడు. -
పాక్ సంచలనం
శ్రీలంకపై 10 వికెట్లతో గెలుపు యాసిర్ షాకు ఏడు వికెట్లు గురువారం నుంచి రెండో టెస్టు గాలే: తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ. రెండో రోజు ఆడింది 64 ఓవర్లే. దీనికి తోడు పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ‘డ్రా’ ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌ను మిస్బా ఉల్ హక్ బృందం సంచలన ఆటతీరుతో దక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తించిన లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (7/76) కెరీర్లో ఉత్తమ గణాంకాలను నమోదు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయం అందేలా చేశాడు. ఫలితంగా పాక్ 10 వికెట్ల తేడాతో తొలి టెస్టులో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య కొలంబోలో రెండో టెస్టు జరుగుతుంది. ఆట చివరిరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 63/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 77.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరుణరత్నే (173 బంతుల్లో 79; 10 ఫోర్లు), తిరిమన్నే (95 బంతుల్లో 44; 4 ఫోర్లు), చండిమాల్ (73 బంతుల్లో 38; 4 ఫోర్లు) మినహా మిగతా ఆటగాళ్లంతా యాసిర్ షా లెగ్ స్పిన్‌కు బెంబేలెత్తారు. అతడి ధాటికి చివరి 5 వికెట్లను శ్రీలంక 39 పరుగుల తేడాలో కోల్పోయింది. అనంతరం 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు హఫీజ్ (33 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు; 1 సిక్స్), షెహజాద్ (35 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడడంతో 11.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసి నెగ్గింది. 2006 అనంతరం శ్రీలంకలో పాక్ టెస్టు గెలవడం ఇదే తొలిసారి యాసిర్ షా (7/76) రూపంలో గత 20 ఏళ్లల్లో పాక్ తరఫున లెగ్ స్పిన్నర్ అత్యుత్తమ ప్రదర్శన ఇది.ఠ ఈ గెలుపుతో పాకిస్తాన్ అత్యధిక టెస్టు విజయాలు (123) సాధించిన ఆసియా జట్టుగా నిలిచింది. 122 టెస్టు విజయాలతో ఇప్పటివరకు టాప్ స్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి పడిపోయింది. -
పాక్ క్రికెట్ కెప్టెన్ కారు సీజ్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్ గా కొనసాగుతున్న మిస్బా-వుల్-హక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. అతడి కారుని అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ డ్యూటీ, పన్నులు చెల్లించకపోవడంతో మిస్బాకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్(ఎఫ్ బీఆర్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెనాల్టీతో సహా పన్నులు చెల్లించిన తర్వాతే కారు తిరిగిస్తామని అధికారులు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.40 లక్షలు పన్ను బకాయిలు కట్టనందుకు అతడి బ్యాంకు ఖాతాను గతేడాది ఎఫ్ బీఆర్ అధికారులు నిలిపివేశారు. తర్వాత ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ను కలిసి ఈ సమస్యను మిస్బా పరిష్కరించుకున్నాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల కోసం మిస్బా సిద్ధమవుతున్నాడు. -
'క్రికెట్ వరల్డ్ పాక్ కు అండగా నిలవాలి'
కరాచీ: క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్ కు అండగా నిలవాల్సిన అవసరముందని పాక్ క్రికెట్ టెస్టు కెప్టెన్ మిస్బా-వుల్-హక్ అన్నాడు. జింబాబ్వే జట్టుతో తాము ఆడిన సిరీస్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ సిరీస్ ద్వారా మిగతా క్రికెట్ ప్రపంచానికి గట్టి సందేశం వెళ్లిందన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు క్రికెట్ వరల్డ్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాడు. బయటి పరిణామాల గురించి పట్టించుకోకుండా అభిమానులు క్రికెట్ ను మునుపటిలా ఆదరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మిస్బా పేర్కొన్నాడు. ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. పాక్, జింబాబ్వే జట్లు ఒక టెస్టు, రెండు వన్డే మ్యాచ్ లు ఆడాయి. మూడే వన్డే వర్షం కారణంగా రద్దయింది. -
'ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం'
కరాచీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను మట్టికరిపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు సాధ్యమైనతంవరకూ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని అభిమానులకు హామీ ఇచ్చాడు. మరో 23 రోజుల్లో ఆరంభం కానున్నప్రపంచకప్ కు తమ జట్టు ఇప్పటికే సిద్ధమైందని మిస్బావుల్ తెలిపాడు. ఫిబ్రవరి 15 వ తేదీన అడిలైడ్ లో పాకిస్తాన్-టీమిండియాల మధ్య జరిగే పోరులో విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తామన్నాడు. ఇరుదేశాల మధ్య జరిగే ఆ పోరు ఎంతటి ప్రాముఖ్యత కల్గిందో తమకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటకు సిద్దమవుతున్నామన్నాడు. -
పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా రెండు ప్రపంచ రికార్డులు
అబుదాబీ: పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ టెస్టు క్రికెట్లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ రెండు రికార్డులు ఒకే మ్యాచ్ లో చేయడం మరో విశేషం. అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు బద్దలు కొట్టిన మిస్బా.. టెస్టుల్లో పాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 21 బంతుల్లో 50 పరుగులు చేసిన మిస్బా 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం రిచర్డ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మిస్బా సమం చేశాడు. రిచర్డ్స్ కూడా 56 బంతుల్లోనే టెస్టు సెంచరీ చేశాడు. ఇదిలావుండగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 570/6 వద్ద డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 250 పైచిలుకు స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగులకే కుప్పకూలింది. -
పాక్ క్రికెటర్ల బ్యాంకు ఖాతాల స్తంభన
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్బా-వుల్-హక్ పై అధికారులు కొరడా ఝుళిపించారు. పన్నులు చెల్లించనందుకు అతడి బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. 30.9 లక్షల రూపాయల పన్నులు కట్టకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూ(ఎఫ్ బీఆర్) అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఇదే కారణంతో మరో అగ్రశేణి క్రికెటర్ అజర్ అలీ బ్యాంకు ఖాతాను కూడా అధికారులు స్తంభింపజేశారు. వీరిద్దరి నుంచి పన్నులు వసూలు చేసేందుకే ఖాతాలు ఆపేశామని ఎఫ్ బీఆర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఎఫ్ బీఆర్ అధికారుల చర్యను మిస్బా సవాల్ చేయనున్నారని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
విజయ రహస్యాన్ని ఇమ్రాన్ ను అడిగి తెలుసుకుంటా!
ప్రపంచ కప్ గెలుచుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్పావుల్ హక్ ప్రయత్నాల్ని ప్రారంభించారు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ వ్యవహరిస్తున్న మిస్బావుల్ హక్ 2015 ప్రపంచకప్ ను గెలుచుకునేందుకు మాజీ కెప్టెన్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ సలహాలను తీసుకోవాలని అనుకుంటున్నారు. 1992 లో అండర్ డాగ్స్ ఉన్న పాక్ క్రికెట్ జట్టుకు తన కరిష్మాతో ప్రపంచకప్ ను ఇమ్రాన్ ఖాన్ సాధించిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెట్ జట్టులో స్పూర్తిని నింపడానికి ఇమ్రాన్ సలహాలు అమూల్యమైనవని మిస్బావుల్ హక్ భావిస్తున్నారు. క్రికెట్ పై ఇమ్రాన్ ఖాన్ ఉన్న పట్టు యువ క్రికెటర్లకు స్పూర్తిని, తోడ్పాటును అందిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్ కు వెల్లడానికి ముందు ఇమ్రాన్ సలహాలు, మార్గదర్శకాలను తీసుకుంటామన్నారు. 1992 సంవత్సరంలో దక్కిన విజయాన్ని మళ్లీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ను అడుగుతానన్నారు. -
పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా ఆఫ్రిది
లాహోర్: పాకిస్థాన్ టి20 కెప్టెన్ గా డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది నియమితులయ్యాడు. 2016లో జరగనున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ వరకు అతడు కెప్టెన్ గా కొనసాగుతాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. కోచ్ వకార్ యూనిస్, క్రికెట్ బోర్డుతో గొడవ కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన మూడేళ్ల తర్వాత టీమ్ నాయకత్వ పగ్గాలు అతడికి అప్పగించడం విశేషం. మహ్మద్ హఫీజ్ కెప్టెన్సీ వదులుకోవడంతో ఆఫ్రిదికి అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మొదటి రౌండ్ నుంచి వెనుదిరగడంతో హఫీజ్ కెప్టెన్సీ వదులుకున్నాడు. కాగా మిస్బా-వుల్-హక్ కు ఊరట లభించింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు అతడు టెస్టు, వన్డే కెప్టెన్ గా కొనసాగుతాడని పీసీబీ ప్రకటించింది. -
సచిన్ ను కీర్తించడం ఆపండి: పాక్ కు తాలిబాన్ హెచ్చరిక
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను పాక్ మీడియా ఆకాశానికెత్తడం నిషేధిత తెహరీక్ ఏ తాలీబాన్ కు ఒళ్లు మండినట్లుంది. దాంతో సచిన్ పై ప్రశంసల వర్షం కురిపించడం ఆపాలని పాకిస్థాన్ మీడియాకు తాలీబాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏకే 47 ఆయుధాన్ని ధరించిన తాలీబాన్ అధికార ప్రతినిధి షాహీదుల్లా షాహీద్ వీడియో సందేశంలో అంతర్జాతీయ క్రికెట్ కు సచిన్ వీడ్కోలు పలుకడంపై మాట్లాడారు. భారతీయ క్రికెటరైన సచిన్ పై పాకిస్థాన్ మీడియా తన పరిధిని మించి ప్రశంసించడం చాలా దురదృష్టకరం అని షాహీద్ వ్యాఖ్యానించాడు. అదే మీడియా పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పై విమర్శలు చేస్తూ మీడియాలో దుష్ప్రచారం చేయడం విచారకరమైన సంఘటన అని వీడియో సందేశంలో తెలిపారు. టెండూల్కర్ ఎంత గొప్ప క్రికెటైనా.. ఓ భారతీయుడు అని వివాదస్పద వ్యాఖ్యలే తాలీబాన్ నేత చేశాడు. అంతేకాక సచిన్ గురించి ప్రశంసించడం ఆపివేయాలని తాలిబాన్ హెచ్చరించింది. నవంబర్ 16 తేదిన అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత పాక్ మీడియా, దినపత్రికలు డాన్, ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యున్, డెయిలీ టైమ్స్ లు సచిన్ ఘనతను ఆకాశానికెత్తేసింది. పాక్ దిన పత్రిక డాన్ సచిన్ పై ప్రత్యేక కథనాన్ని వెల్లడించింది. సచిన్ తన ఆటతో ప్రపంచ క్రికెట్ కు వన్నె తెచ్చారని పలు పత్రికలు ప్రచురించాయి. 1989లో కరాచీ లో పాకిస్తాన్ పై తన కెరీర్ ను ఆరంభించిన సచిన్ ఆతర్వాత క్రికెట్ లో రికార్డులను తిరగరాశాడని పలు పత్రికలు కీర్తించాయి. ఇక ఇన్సాఫ్ అనే ఉర్దూ పత్రిక సచిన్ లాంటి ఆటగాళ్లు చాలా ఆరుదుగా వస్తుంటారు అని వ్యాఖ్యలు చేసింది. సచిన్ లేడనే వార్త అభిమానులను విషాదానికి గురి చేస్తోంది అని పత్రికలు రాశాయి. -
పాక్ క్రికెటర్లపై అభిమానుల ఆగ్రహం
కరాచీ: పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్, కోచ్ వాట్మోర్ల కు అభిమానుల సెగ తగిలింది. బలహీనమైన జింబాబ్వేతో జరిగిన సిరీస్ ను సమం చేసుకున్న వారిని అభిమానులు అడ్డుకుని వ్యతిరేకనినాదాలు చేశారు. వెంటనే పాకిస్తాన్ క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. జింబాబ్వే పర్యటనను ముగించుకొని వచ్చిన పాకిస్థాన్ ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు టెస్టుల సిరీస్‌ను పాక్ 1-1తో సమం చేసుకుంది. అయితే బలహీనమైన జట్టుతో రెండో టెస్టులో ఓటమిని ఇక్కడి అభిమానులు జీర్జించుకోలేకపోయారు. దీంతో బుధవారం లాహోర్ విమానాశ్రయం వద్ద వందల సంఖ్యలో గుమిగూడిన అభిమానులు... జట్టు కెప్టెన్ మిస్బావుల్, కోచ్ వాట్మోర్లు తక్షణం తమ పదవుల నుంచి తప్పుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తు నినాదాలు చేశారు. అభిమానుల ఆందోళన సెగతో ఆటగాళ్లు ముఖం చాటేశారు. కనీసం మీడియాతోనూ మాట్లాడకుండా స్వస్థలాలకు బయల్దేరారు. మిస్బా ప్రస్తుతం భారత్‌లో వోల్వ్స్ తరఫున సీఎల్టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. మొత్తంమీద పరాజయ భారం కోచ్ వాట్మోర్ మెడకు పడనుంది. బోర్డు ఆయనపై వేటు వేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ‘జింబాబ్వే మాకన్నా బాగా ఆడింది. వాళ్లు రాణించిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. రెండో టెస్టులో వారికే విజయార్హత ఉంది’ అని వాట్మోర్ కూనలను ప్రశంసించారు.