'మా క్రికెట్కు పాత రోజులు వస్తాయి'
కరాచీ: ఇంగ్లండ్లో జరిగే టెస్టు సిరీస్తో తమ దేశ క్రికెట్ కు పునర్ వైభవం స్తుందని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్-హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్తో పాక్ క్రికెట్ కు పాత రోజులు వస్తాయన్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్కు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మిస్బా.. తమ తాజా ఇంగ్లండ్ పర్యటన పాక్ క్రికెట్ కు లాభిస్తుందన్నాడు. ఇదొక పెద్ద పర్యటనగా మిస్బా అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ను గెలవడానికి శతవిధిలా ప్రయత్నిస్తామని మిస్బా తెలిపాడు.
2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో ఏ జట్టూ అడుగు పెట్టలేదు. క్రికెటర్లు బస్సులో వెళుతున్న సమయంలో దాడి జరిగింది. ఆ దాడిలో కొంతమంది ఆటగాళ్లతో పాటు స్థానిక అంపైర్ కూడా గాయపడ్డాడు. దీంతో అప్పట్నుంచీ పాకిస్తాన్ లో ఆడటానికి మిగతా దేశాలు జట్లు సంకోచిస్తున్నాయి. ఇటీవల తమ దేశంలో ఆడాలంటూ వెస్టిండీస్తో జరిపిన చర్చలు సత్ఫలితాన్నివ్వలేదు. మరోవైపు 2012 తరువాత ఇంగ్లండ్ లో పాక్ పర్యటించడం ఇదే తొలిసారి. దాంతో పాక్ జట్టు పేలవమైన ఫామ్ తో వరుస గా వైఫల్యం చెందుతుంది.