పాక్ క్రికెటర్ల బ్యాంకు ఖాతాల స్తంభన | Pakistan FBR freeze Misbah's bank accounts for tax evasion | Sakshi
Sakshi News home page

పాక్ క్రికెటర్ల బ్యాంకు ఖాతాల స్తంభన

Published Tue, Oct 14 2014 9:04 PM | Last Updated on Wed, Jul 25 2018 1:57 PM

మిస్బా-వుల్-హక్(ఫైల్) - Sakshi

మిస్బా-వుల్-హక్(ఫైల్)

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్బా-వుల్-హక్ పై అధికారులు కొరడా ఝుళిపించారు. పన్నులు చెల్లించనందుకు అతడి బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. 30.9 లక్షల రూపాయల పన్నులు కట్టకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూ(ఎఫ్ బీఆర్) అధికారులు ఈ చర్య తీసుకున్నారు.

ఇదే కారణంతో మరో అగ్రశేణి క్రికెటర్ అజర్ అలీ బ్యాంకు ఖాతాను కూడా అధికారులు స్తంభింపజేశారు. వీరిద్దరి నుంచి పన్నులు వసూలు చేసేందుకే ఖాతాలు ఆపేశామని ఎఫ్ బీఆర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఎఫ్ బీఆర్ అధికారుల చర్యను మిస్బా సవాల్ చేయనున్నారని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement