పాక్ క్రికెటర్ల బ్యాంకు ఖాతాల స్తంభన
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్బా-వుల్-హక్ పై అధికారులు కొరడా ఝుళిపించారు. పన్నులు చెల్లించనందుకు అతడి బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. 30.9 లక్షల రూపాయల పన్నులు కట్టకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూ(ఎఫ్ బీఆర్) అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
ఇదే కారణంతో మరో అగ్రశేణి క్రికెటర్ అజర్ అలీ బ్యాంకు ఖాతాను కూడా అధికారులు స్తంభింపజేశారు. వీరిద్దరి నుంచి పన్నులు వసూలు చేసేందుకే ఖాతాలు ఆపేశామని ఎఫ్ బీఆర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఎఫ్ బీఆర్ అధికారుల చర్యను మిస్బా సవాల్ చేయనున్నారని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.