ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకు రోహిత్ కొవిడ్ కారణంగా దూరమైతే.. భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని నియమించవద్దని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ అభిప్రాయ పడ్డాడు. కోహ్లి ఫామ్ లేమి కారణంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని మిస్బా సూచించాడు. విరాట్ కోహ్లి గత కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు.
ప్రస్తుతం అతడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. టీమిండియాకు అతడు బ్యాటర్‌గా చాలా అవసరం. కాబట్టి అతడిని కెప్టెన్‌గా నియమించి మరింత ఒత్తిడిని పెంచవద్దు. భవిష్యత్తులో భారత కెప్టెన్‌గా ఎంపికయ్యే సత్తా ఉన్న ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించండి. కోహ్లి కేవలం తన బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టులో లేనప్పుడు కోహ్లి రాణించాల్సిన అవసరముంది అని మిస్బా మిస్బా-ఉల్-హక్ పేర్కొన్నాడు.
ఇక ఇరు జట్లు మధ నిర్ణయాత్మక ఐదో టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై1న వేదికగా ప్రారంభం కానుంది. రోహిత్ ఇంకా కోవిడ్ కోలుకోకపోవడంతో ఈ కీలక మ్యాచ్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక వేళ రోహిత్ దూరమైతే జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు అప్పగించే యోచనలో జట్టు మేనేజేమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment