సచిన్ ను కీర్తించడం ఆపండి: పాక్ కు తాలిబాన్ హెచ్చరిక
సచిన్ ను కీర్తించడం ఆపండి: పాక్ కు తాలిబాన్ హెచ్చరిక
Published Thu, Nov 28 2013 11:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను పాక్ మీడియా ఆకాశానికెత్తడం నిషేధిత తెహరీక్ ఏ తాలీబాన్ కు ఒళ్లు మండినట్లుంది. దాంతో సచిన్ పై ప్రశంసల వర్షం కురిపించడం ఆపాలని పాకిస్థాన్ మీడియాకు తాలీబాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏకే 47 ఆయుధాన్ని ధరించిన తాలీబాన్ అధికార ప్రతినిధి షాహీదుల్లా షాహీద్ వీడియో సందేశంలో అంతర్జాతీయ క్రికెట్ కు సచిన్ వీడ్కోలు పలుకడంపై మాట్లాడారు. భారతీయ క్రికెటరైన సచిన్ పై పాకిస్థాన్ మీడియా తన పరిధిని మించి ప్రశంసించడం చాలా దురదృష్టకరం అని షాహీద్ వ్యాఖ్యానించాడు. అదే మీడియా పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పై విమర్శలు చేస్తూ మీడియాలో దుష్ప్రచారం చేయడం విచారకరమైన సంఘటన అని వీడియో సందేశంలో తెలిపారు.
టెండూల్కర్ ఎంత గొప్ప క్రికెటైనా.. ఓ భారతీయుడు అని వివాదస్పద వ్యాఖ్యలే తాలీబాన్ నేత చేశాడు. అంతేకాక సచిన్ గురించి ప్రశంసించడం ఆపివేయాలని తాలిబాన్ హెచ్చరించింది. నవంబర్ 16 తేదిన అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత పాక్ మీడియా, దినపత్రికలు డాన్, ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యున్, డెయిలీ టైమ్స్ లు సచిన్ ఘనతను ఆకాశానికెత్తేసింది. పాక్ దిన పత్రిక డాన్ సచిన్ పై ప్రత్యేక కథనాన్ని వెల్లడించింది. సచిన్ తన ఆటతో ప్రపంచ క్రికెట్ కు వన్నె తెచ్చారని పలు పత్రికలు ప్రచురించాయి. 1989లో కరాచీ లో పాకిస్తాన్ పై తన కెరీర్ ను ఆరంభించిన సచిన్ ఆతర్వాత క్రికెట్ లో రికార్డులను తిరగరాశాడని పలు పత్రికలు కీర్తించాయి. ఇక ఇన్సాఫ్ అనే ఉర్దూ పత్రిక సచిన్ లాంటి ఆటగాళ్లు చాలా ఆరుదుగా వస్తుంటారు అని వ్యాఖ్యలు చేసింది. సచిన్ లేడనే వార్త అభిమానులను విషాదానికి గురి చేస్తోంది అని పత్రికలు రాశాయి.
Advertisement
Advertisement