భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త | Tendulkar advises Indian players to be careful against Tahir | Sakshi
Sakshi News home page

భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త

Published Fri, Sep 25 2015 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త

భారత్ క్రికెటర్లూ.. అతనితో జాగ్రత్త

ముంబై: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్తో జాగ్రత్త అంటూ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్లను హెచ్చరించాడు. ప్రపంచ క్రికెట్లో టాప్ స్పిన్నర్లలో తాహిర్ ఒకరని, నాణ్యమైన బౌలరని, అతని బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలంటూ సచిన్ సలహా ఇచ్చాడు.

త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్లో భాగంగా ఇరు జట్లు 3-టీ-20లు, 5 వన్డేలు, 4 టెస్టులు ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ స్పందించాడు. 'భారత జట్టు పటిష్టంగా ఉంది. ప్రతిభావంతులు, అంకితభావం గల యువ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది' అని సచిన్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement