నాటీ బాయ్కి హ్యాపీ బర్త్ డే: సచిన్ | sachin tendulkar birthday wishes to kohli on twitter | Sakshi
Sakshi News home page

నాటీ బాయ్కి హ్యాపీ బర్త్ డే: సచిన్

Published Sat, Nov 5 2016 2:57 PM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

నాటీ బాయ్కి హ్యాపీ బర్త్ డే: సచిన్ - Sakshi

నాటీ బాయ్కి హ్యాపీ బర్త్ డే: సచిన్

నేడు (నవంబర్ 5న) టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు.  ఈరోజు (శనివారం) విరాట్ సరిగ్గా 28 వసంతాలు పూర్తిచేసుకుని 29వ వసంతంలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి.. క్రికెట్ దేవుడు, టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ప్రస్తుత టీమిండియాలో కోహ్లీనే షరారతి గయ్(నాటీ బాయ్) అంటూ సచిన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. విరాట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని, అతడు ఎన్నో విజయాలు సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు. బర్త్ డే బాయ్ కోహ్లీ ఎక్కడ.. ఎలా తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాడో తెలియదు కానీ.. క్రికెట్ లెజెండ్ సచిన్ విషెస్ మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న కోహ్లీకి ప్రత్యేకమని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement