కరాచీ: పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ మాజీ ఆటగాళ్లు జహీర్ అబ్బాస్, షాహిద్ ఆఫ్రిదిలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికి, పాక్ క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వన్డే, టీ20లకు కెప్టెన్‌గా సర్ఫరాజ్ విజయంతమయ్యాడని ప్రశంసించారు. అయితే టెస్టు క్రికెట్ ఎంతో కఠినమైదని.. సర్ఫరాజ్ ఈ ఫార్మట్ సారథిగా సత్తా చాటలేడని పేర్కొన్నాడు. అతడే స్వతహగా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టాలని సర్ఫరాజ్‌కు సూచించారు.
తప్పుకుంటే అతడికే మంచిది: ఆఫ్రిది
టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికే మేలు జరుగుతుందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడమనేది అధిక భారంతో కూడుకున్నదని పేర్కొన్నాడు. వన్డే, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్ విజయవంతమైన తరుణంలో టెస్టు నుంచి తప్పుకోవాలని ఆఫ్రిది అన్నాడు. అంతేకాకుండా టెస్టు జట్టు సారథిగా సర్ఫరాజ్ ఎంపిక సరైనది కాదనేది తన అభిప్రాయమన్నాడు.
మిస్బావుల్ ఎంపిక సరైనది కాదు: జహీర్
మిస్బావుల్ హక్‌ను చీఫ్ సెలక్టర్‌గా, ప్రధాన కోచ్‌గా నియమించడం సరైనది కాదని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. రెండు పదవులు మిస్బావుల్‌కు అప్పగించడంతో అతడిపై అధిక భారం పడుతుందన్నాడు. టెస్టు క్రికెట్ చాలా కఠినమైనది ఈ ఫార్మట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడమనేది సవాల్‌తో కూడుకున్నదని.. అయితే ఆ సత్తా సర్ఫరాజ్‌కు లేదన్నాడు. దీంతో వన్డే, టీ20లపై ఫోకస్ పెట్టి, టెస్టు నుంచి తప్పుకుంటే మంచిదని జహీర్ సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment