
'క్రికెట్ వరల్డ్ పాక్ కు అండగా నిలవాలి'
కరాచీ: క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్ కు అండగా నిలవాల్సిన అవసరముందని పాక్ క్రికెట్ టెస్టు కెప్టెన్ మిస్బా-వుల్-హక్ అన్నాడు. జింబాబ్వే జట్టుతో తాము ఆడిన సిరీస్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ సిరీస్ ద్వారా మిగతా క్రికెట్ ప్రపంచానికి గట్టి సందేశం వెళ్లిందన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు క్రికెట్ వరల్డ్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాడు.
బయటి పరిణామాల గురించి పట్టించుకోకుండా అభిమానులు క్రికెట్ ను మునుపటిలా ఆదరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మిస్బా పేర్కొన్నాడు. ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. పాక్, జింబాబ్వే జట్లు ఒక టెస్టు, రెండు వన్డే మ్యాచ్ లు ఆడాయి. మూడే వన్డే వర్షం కారణంగా రద్దయింది.