ఆ కెప్టెన్ ఇప్పట్లో వీడ్కోలు పలకడు
'పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ మిస్బాఉల్ హక్ మరికొద్ది నెలల్లో రిటైర్ పోతాడని అందరూ అనుకుంటున్నారు. కానీ, మిస్బా నుంచి ఇంకా ఎంతో ఆశించవచ్చు' అని చీఫ్ సెలెక్టర్, వెటరన్ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో అతడి శతకం అనిర్వచనీయమంటూ ప్రశంసించాడు. అతడికి వయసు అనేది అడ్డంకి కాదని, పాక్ క్రికెట్ కు అతడు ఎంతో కాలం సేవలు అందిస్తాడని పాక్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన మిస్బాకు మద్ధతు తెలిపాడు. మిస్టా కెప్టెన్సీలో పాక్ 20 టెస్టు విజయాలు సొంతం చేసుకుంది.
ఈ వయసులో కూడా అతడి ఫిట్ నెస్ చూస్తే తనకు చాలా ఆశ్చర్యమేస్తుందన్నాడు. బ్యాట్స్ మన్గా, కెప్టెన్గానూ జట్టుకు అతడి సేవలు మరింత కాలం అందించాలని సూచించాడు. లార్డ్స్ టెస్టులో ఘనవిజయం సాధించిన పాక్, ఓల్డ్ ట్రాపోర్డ్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనా.. మిస్టా కెప్టెన్సీలో జట్టు కోలుకుని సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తుందని అభిప్రాయపడ్డాడు.