పాక్ క్రికెటర్లపై అభిమానుల ఆగ్రహం | severe response to pakistan cricketers | Sakshi

పాక్ క్రికెటర్లపై అభిమానుల ఆగ్రహం

Sep 18 2013 9:28 PM | Updated on Sep 1 2017 10:50 PM

జింబాబ్వే పర్యటనను ముగించుకొని వచ్చిన పాకిస్థాన్ ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరాచీ:  పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్, కోచ్ వాట్‌మోర్‌ల కు అభిమానుల సెగ తగిలింది. బలహీనమైన జింబాబ్వేతో జరిగిన సిరీస్ ను సమం చేసుకున్న వారిని అభిమానులు అడ్డుకుని వ్యతిరేకనినాదాలు చేశారు. వెంటనే పాకిస్తాన్ క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. జింబాబ్వే పర్యటనను ముగించుకొని వచ్చిన పాకిస్థాన్ ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు టెస్టుల సిరీస్‌ను పాక్ 1-1తో సమం చేసుకుంది. అయితే బలహీనమైన జట్టుతో రెండో టెస్టులో ఓటమిని ఇక్కడి అభిమానులు జీర్జించుకోలేకపోయారు. దీంతో బుధవారం లాహోర్ విమానాశ్రయం వద్ద వందల సంఖ్యలో గుమిగూడిన అభిమానులు... జట్టు కెప్టెన్ మిస్బావుల్, కోచ్ వాట్‌మోర్‌లు తక్షణం తమ పదవుల నుంచి తప్పుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తు నినాదాలు చేశారు.

 

అభిమానుల ఆందోళన సెగతో ఆటగాళ్లు ముఖం చాటేశారు. కనీసం మీడియాతోనూ మాట్లాడకుండా స్వస్థలాలకు బయల్దేరారు. మిస్బా ప్రస్తుతం భారత్‌లో వోల్వ్స్ తరఫున సీఎల్‌టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. మొత్తంమీద పరాజయ భారం కోచ్ వాట్‌మోర్ మెడకు పడనుంది. బోర్డు ఆయనపై వేటు వేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ‘జింబాబ్వే మాకన్నా బాగా ఆడింది. వాళ్లు రాణించిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. రెండో టెస్టులో వారికే విజయార్హత ఉంది’ అని వాట్‌మోర్ కూనలను ప్రశంసించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement