రెండో టెస్టుకు మిస్బా దూరం | Pakistan Captain Misbah-ul-Haq to miss the second test against newzealand for father in law demise | Sakshi
Sakshi News home page

రెండో టెస్టుకు మిస్బా దూరం

Published Sun, Nov 20 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

రెండో టెస్టుకు మిస్బా దూరం

రెండో టెస్టుకు మిస్బా దూరం

న్యూజిలాండ్ తో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెసుకు పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ దూరం కానున్నాడు.

హామిల్టన్:న్యూజిలాండ్ తో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెసుకు పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ దూరం కానున్నాడు. అతని మావయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మిస్బా తన పర్యటన నుంచి అర్థాంతరంగా వైదొలగనున్నాడు. ఆ మేరకు ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న మిస్బా..హుటాహుటీనా  భార్య, కూతురితో కలిసి పాక్ కు బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. 

 

దాంతో రెండో టెస్టులో అజహర్ అలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, మిస్బా గైర్హజరీతో సారథ్య బాధ్యతలు ఎవరికీ అప్పగించాలన్న దానిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement