పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా రెండు ప్రపంచ రికార్డులు | Misbah-ul-haq smashes fastest test fifty | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా రెండు ప్రపంచ రికార్డులు

Published Sun, Nov 2 2014 3:04 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా రెండు ప్రపంచ రికార్డులు

పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా రెండు ప్రపంచ రికార్డులు

అబుదాబీ: పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ టెస్టు క్రికెట్లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ రెండు రికార్డులు ఒకే మ్యాచ్ లో చేయడం మరో విశేషం. అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా రికార్డు బద్దలు కొట్టిన మిస్బా..  టెస్టుల్లో పాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 21 బంతుల్లో 50 పరుగులు చేసిన మిస్బా 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం రిచర్డ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మిస్బా సమం చేశాడు. రిచర్డ్స్ కూడా 56 బంతుల్లోనే టెస్టు సెంచరీ చేశాడు.

ఇదిలావుండగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పాక్ తొలి ఇన్నింగ్స్ను  570/6 వద్ద డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్లో 250 పైచిలుకు స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 261 పరుగులకే కుప్పకూలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement