fastest test fifty
-
టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్
Rishabh Pant Scores Fastest 50 For India In Test Cricket: టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా పంత్ కపిల్ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా పంత్ తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ 31 బంతుల్లో ఫిఫ్టి బాదాడు. ఇక 2008లో సెహ్వాగ్ ఇంగ్లండ్‌పై 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 47 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఓవరాల్‌గా 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక -
శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సెహ్వాగ్ రికార్డు సహా మరో రికార్డు బద్దలు
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని(31 బంతులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(32 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో నిలిచాడు. Shardul counter-attacks England in style and races to his 50 with a pull over square leg for 6. Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Shardul pic.twitter.com/pzGbUPnUI8 — Sony Sports (@SonySportsIndia) September 2, 2021 ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ దాన్ని అధిగమించాడు. 1986లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బోథమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక, 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ తన సుడిగాలి ఇన్నంగ్స్తో గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. రాబిన్సన్ వేసిన 60వ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్లో రెండో అర్థశతకం పూర్తి చేశాడు. శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) మినహా మరెవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం టీమిండియా బౌలర్లు కూడా చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి ఎదురీదుతోంది. బుమ్రా(2/15), ఉమేశ్(1/15) ఇంగ్లండ్ టపార్డర్ పతనాన్ని శాసించారు. చదవండి: అవిష్క సూపర్ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం -
పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా రెండు ప్రపంచ రికార్డులు
అబుదాబీ: పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ టెస్టు క్రికెట్లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ రెండు రికార్డులు ఒకే మ్యాచ్ లో చేయడం మరో విశేషం. అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు బద్దలు కొట్టిన మిస్బా.. టెస్టుల్లో పాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 21 బంతుల్లో 50 పరుగులు చేసిన మిస్బా 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం రిచర్డ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మిస్బా సమం చేశాడు. రిచర్డ్స్ కూడా 56 బంతుల్లోనే టెస్టు సెంచరీ చేశాడు. ఇదిలావుండగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 570/6 వద్ద డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 250 పైచిలుకు స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగులకే కుప్పకూలింది.