గంగూలీ, ధోనీల రికార్డు బద్దలుకొట్టాడు! | Misbah-ul-Haq is most successful Asian captain in Test history | Sakshi
Sakshi News home page

గంగూలీ, ధోనీల రికార్డు బద్దలుకొట్టాడు!

Published Tue, Oct 25 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

గంగూలీ, ధోనీల రికార్డు బద్దలుకొట్టాడు!

గంగూలీ, ధోనీల రికార్డు బద్దలుకొట్టాడు!

అబుదాబి: పాకిస్తాన్ జట్టులో విజయవంతమైన ఆటగాడిగా, సక్సెస్ ఫుల్ టెస్ట్ కెప్టెన్ గానూ పేరు తెచ్చుకున్నాడు మిస్బా ఉల్ హక్. అత్యధిక సిరీస్ విజయాలు అందించిన పాక్ కెప్టెన్ అయిన మిస్బా.. ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఉపఖండం జట్ల(భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్,) లో ఎక్కువ టెస్టు సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గానూ ఘనత వహించాడు. దీంతో భారత దిగ్గజ కెప్టెన్లయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అదిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాక్ జట్టుకు 48 టెస్టులకు మిస్బా  సారథిగా వ్యవహరించగా.. 24 విజయాలు, 13 ఓటములతో పాటు 11 టెస్టులు డ్రా చేసుకుని 50శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు.

ఇప్పటివరకూ గంగూలీ, ధోనీలతో సహా 9 టెస్టు సిరీస్ విజయాలతో మిస్బా ఉల్ హక్ తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వెస్టిండీస్ పై మంగళవారం పాక్ టెస్ట్ సిరీస్ నెగ్గడంతో 10 టెస్ట్ సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గా మిస్బా నిలిచాడు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా అబిదాబిలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ పై 133 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయాన్ని సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement