టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ జట్టు చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై వేటు వేసిన పీసీబీ.. కెప్టెన్సీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్‌కప్ ముందు పాక్ జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజం.. మరోసారి ఐసీసీ టోర్నీల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.
ఈ జాబితాలోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేరాడు. పరిమిత ఓవర్లలో పాక్ కెప్టెన్సీని స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించాలని బట్ పీసీబీని సూచించాడు. కాగా మసూద్ ప్రస్తుతం టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
"ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో కాస్త గందరగోళం నెలకొంది. జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటకి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా లేవు.
ఫీల్డ్‌లో వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. పాకిస్తాన్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లో రావాలంటే ఒక్కటే మార్గం. షాన్ మసూద్ అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ అప్పగించాలని"ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్ పేర్కొన్నాడు.
చదవండి: లంకతో సిరీస్‌తో రీఎంట్రీ!.. ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్
Comments
Please login to add a commentAdd a comment