వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. ఒక్క టీమిండియాతో మాత్రమే అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. అయితే చెన్నై, కోల్‌కతాల్లో తాము ఆడలేమని.. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ ఐసీసీకి అభ్యర్థన పెట్టుకున్నప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం క్లియరెన్స్ తప్పనిసరి. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయమై మా ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే ఈవెంట్ నిర్వహించే ఐసీసీ సమచారం అందిస్తాం. అయితే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో రెండు వేదికలను మార్చాలని పెట్టుకున్న ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది తెలియదు అని చెప్పుకొచ్చాడు.
కాగా పాక్ ప్రభుత్వం నుంచి పీసీబీకి వరల్డ్‌కప్ ఆడేందుకు క్లియరెన్స్ రాకపోతే బోర్డు చాలా నష్టపోవాల్సి వస్తోంది. పాక్ జట్టు వరల్డ్‌కప్‌లో ఆడకుంటే కోట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పాక్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఇక అభిమానులు మాత్రం ఆడకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమి ఉండదు.. పీసీబీకే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కామెంట్ చేశారు.
వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు:
అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2
అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్
అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా
అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్
నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్
Comments
Please login to add a commentAdd a comment