టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఒక చానెల్‌కు ఇంటర్య్వూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.
''క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని సగర్వంగా చెప్పగలను. క్రికెట్‌లో కేఎస్ భరత్ లాంటి యంగ్ క్రికెటర్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. అదే విధంగా ఇతర క్రీడలో సాత్విక్ సాయిరాజ్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులు బ్యాడ్మింటన్‌లో.. టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశానికి వివిధ కేటగిరీల్లో పతకాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిస్తున్నారు. ఇక క్రీడల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా ఉంది. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. '' అంటూ చెప్పుకొచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ లో క్రీడా మౌలిక సదుపాయాలు
ఇంటర్నేషనల్ స్టేడియంలు | 2 |
క్రికెట్ అకాడమీలు | 4 |
ఫస్ట్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్ లు | 18 |
ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు?
ఇక ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ''దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్‌కే), కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్లున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్కటే ఉంది. ఐపీఎల్ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరపున కాదు.
ఆ మధ్య రెండు కొత్త జట్లను ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్‌చంద్రా రెడ్డి కూడా 3,500 కోట్లకు బిడ్ వేశారు. కానీ, ఎక్కువ కోట్ చేసిన వేరేవాళ్లకు ఆ జట్లు వెళ్లాయి. ఒకదశలో వైజాగ్, అమరావతి అన్న పేరుతో ఫ్రాంచైజీ వస్తుందన్న టాక్ నడిచింది.
ఐపీఎల్ కమర్షియల్ టోర్నమెంట్.ఇలాగే ఉంటే కొన్నిరోజులకు బీసీసీఐకి కూడా నష్టం జరుగుతోంది. ఒక రకంగా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేకపోవడమే మంచిది. ఫుట్‌బాల్‌లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు. '' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.
ఇక వికెట్ కీపర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ టీమిండియా తరపున ఆరు టెస్టుల్లో 106 పరుగులు, 17 వన్డేల్లో 131 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థశతకం ఉంది. ఇక 2016 నుంచి 2020 వరకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా విధులు నిర్వర్తించాడు.
చదవండి: #ViratKohli: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం
Comments
Please login to add a commentAdd a comment