
PC: IPL.com
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో జితేష్ శర్మ ఒకడని సునీల్ జోషి కొనియాడాడు. కాగా జితేష్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ముఖ్యంగా ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్‌గా మారాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జితేష్ 165.97 స్ట్రైక్ రేట్‌తో239 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో హిందూస్తాన్ టైమ్స్‌తో జోషి మాట్లాడుతూ.. "ఐపీఎల్‌లో జితేష్ దుమ్మురేపుతున్నాడు. పంజాబ్‌కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ శర్మ మెరుగైన ఆటగాడు.
గత కొన్ని నెలలగా అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గత కొన్ని టీ20 సిరీస్‌లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు. కానీ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఈ సారి మాత్రం అతడికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్‌కు ఏమి చేస్తున్నాడో టీమిండియాకు కూడా అదే అందిస్తాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్
Comments
Please login to add a commentAdd a comment