భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20కి సర్వం సిద్ధమైంది. డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానంలో రేపు (ఆగస్ట్ 18) జరుగబోయే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా దాదాపుగా ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న మ్యాచ్ కావడంతో భారత అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఐపీఎల్ స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తారా లేదా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు రింకూ సింగ్‌పై భారీ అంచనాలు ఉండటంతో ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ మ్యాచ్‌తో రింకూ, జితేశ్‌లు అరంగేట్రం చేస్తారో లేదో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
రింకూ, జితేశ్‌ల అరంగేట్రంపై డిస్కషన్ నేపథ్యంలో ఐర్లాండ్‌తో తొలి టీ20కి భారత జట్టు ఇలా ఉండబోతుందంటూ పలువురు మాజీ, విశ్లేషకులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మెజారిటీ శాతం అభిప్రాయాల మేరకు.. భారత తుది జట్టులో రింకూ సింగ్, జితేశ్ శర్మ ఇద్దరూ చోటు దక్కించుకోనున్నారు. వికెట్‌కీపర్ కోటాలో సంజూ శాంసన్‌ను కాదని జితేశ్‌కు మెజారిటీ శాతం జనాలు ఓటేస్తున్నారు.
సంజూకి విండీస్‌తో సిరీస్‌లో చాలా అవకాశాలు ఇచ్చారని, జితేశ్‌కు కూడా ఒకట్రెండు అవకాశాలిస్తే, అతనిలో విషయం ఉందో లేదో తెలిసిపోతుందని అంటున్నారు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేలను అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, అర్షదీప్ తుది జట్టులో ఎలాగూ ఉంటారు కాబట్టి, మూడో పేసర్‌గా ప్రసిద్ధ కృష్ణ, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బిష్ణోయ్‌కు అవకాశాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
ఐర్లాండ్‌తో తొలి టీ20కి భారత్ తుది జట్టు (అంచనా)..
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, రవి బిష్ణోయ్
Comments
Please login to add a commentAdd a comment