ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రపంచ రికార్డు సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను (ఛేదనలో) మెయిడిన్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో (ఐసీసీ ఫుల్‌టైమ్ సభ్యదేశాలు పాల్గొన్న మ్యాచ్‌లు) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) వేసిన బౌలర్‌గా సహచరుడు భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు. భువీ 87 టీ20ల్లో 10 మెయిడిన్లు వేస్తే, బుమ్రా తన 62వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విభాగంలో భువీ, బుమ్రాల తర్వాత బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6), శ్రీలంక నువాన్ కులశేఖర (6) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
ఐర్లాండ్‌తో రెండో టీ20లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (74) తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో చహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 90 వికెట్లతో భువనేశ్వర్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ (58), శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఐర్లాండ్ లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ (72) టాప్ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment