Ireland vs India, 1st T20I: టీమిండియాతో తొలి టీ20లో ఆరంభంలో తడబడ్డా ఐర్లాండ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యారీ మెకార్తీ అజేయ అర్ధ శతకం(51 పరుగులు)తో జట్టును ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 139 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు, ప్రసిద్ కృష్ణ రెండు, రవి బిష్ణోయి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌నకు ఒక వికెట్ దక్కింది.
భారత బౌలర్ల దెబ్బ
తొలి టీ20లో భారత బౌలర్ల ధాటికి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమవుతోంది. 35 పరుగులకే ఐర్లాండ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బుమ్రా తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు పడగొట్టి టీమిండియాకు శుభారంభం అందించాడు.
అనంతరం టీ20 అరంగేట్ర బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి ఓవర్‌లోనే (5వ ఓవర్) వికెట్ తీశాడు. టెక్టార్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆ మరుసటి ఓవర్‌లోనే టీమిండియాకు రవి బిష్ణోయ్ మరో వికెట్ అందించాడు.
ఐరిష్ జట్టు సారథి పాల్ స్టిర్లింగ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక 7వ ఓవర్‌లో ప్రసిద్ద్ మరో వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ మూడో బంతికి గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి డాక్రెల్ ఔటయ్యాడు. దీంతో ఏడు ఓవర్లలోనే ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయింది.
టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్-2023 స్టార్, సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. రింకూతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ మ్యాచ్‌తో టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్
Comments
Please login to add a commentAdd a comment