ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 23) జరుగనున్న నామమాత్రపు మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఇదివరకే కైవసం చేసుకున్న భారత్, నేటి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ముకేశ్ కుమార్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్‌లు మూడో టీ20 బరిలోకి దిగే అవకాశం ఉంది.
ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో ఈ నలుగురు బరిలోకి దిగవచ్చు. పై పేర్కొన్న నలుగురికి అవకాశం ఇస్తే ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు మొత్తానికి కనీసం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సైతం విశ్రాంతి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్‌కు ముందు అనవసర రిస్క్ ఎందుకుని మేనేజ్‌మెంట్ భావిస్తే.. బుమ్రా రెస్ట్ తీసుకుని, అర్షదీప్‌కు అవకాశం ఇస్తాడు.
అప్పుడు జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడు. ఆసియా క్రీడల్లో రుతు ఎలాగూ టీమిండియాకు నాయకత్వం వహించాల్సి ఉంది కాబట్టి, అతనికి ఈ మ్యాచ్ ప్రాక్టీస్ అయినట్లవుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్ బెంచ్‌కు పరీక్షగా మారనుంది. మరోవైపు ఐర్లాండ్ సైతం ఒకటిరెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ జట్టు కూడా రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే భారత్‌లా భారీ ప్రయోగాలు కాకుండా ఒకటి, రెండు మార్పులకు ఆస్కారం ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికొస్తే.. ముగ్గురు టీమిండియా బౌలర్లు 4 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్‌లు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఐర్లాండ్‌తో మూడో టీ20కి టీమిండియా (అంచనా): జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)/అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్/కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment