సంజూ శాంసన్
Sanju Samson Comeback In Team India: కేరళ క్రికెటర్ సంజూ శాంసన్‌కు తిరిగి భారత జట్టులో చోటు దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు తమకు సంతోషంగా ఉందని, ఈసారి సంజూ కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సంజూ శాంసన్ 2015లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
అయితే, భారత జట్టు సమీకరణలు, ఇతరత్రా కారణాల వల్ల చాలా సందర్భాల్లో సంజూకు నిరాశే ఎదురైంది. ఇందుకు తోడు నిలకడలేమి ప్రదర్శన అతడి అవకాశాలకు గండికొట్టింది. అదే సమయంలో ఇతర యువ ఆటగాళ్లు రేసులోకి దూసుకురావడంతో సంజూ శాంసన్ అవకాశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి.
గాయం బారిన పడి
ఈ క్రమంలో టీ20 అరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్లకు అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇక చివరిసారిగా.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో జాతీయ జట్టుకు ఎంపికైన సంజూ తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక రెండో మ్యాచ్ సమయానికి గాయం బారిన పడటంతో జట్టులో చోటు కోల్పోయాడు.
తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్
ఇక ఆ తర్వాత ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ నాయకుడిగా జట్టును ముందుకు నడిపిన సంజూ.. 14 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి సంజూకు చోటు దక్కింది.
గ్రేడ్ ‘సీ’ ఆటగాళ్ల జాబితాలో అతడిని చేర్చింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఏడాదికి కోటి రూపాయల వార్షిక వేతనం అందుకోనున్న సంజూ శాంసన్.. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈసారి మాత్రం
దీంతో సంజూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈసారి మాత్రం తగ్గేదేలేదు! మా ఆశలను వమ్ము చేయొద్దు సంజూ! ప్లీజ్ ఈసారి బాగా ఆడాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక విండీస్‌తో వన్డే సిరీస్ తుది జట్టులో సంజూ పేరు ఉంటుందో లేదో చూడాలి!!
ఇక సంజూ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 11 వన్డేల్లో 330 పరుగులు, 17 టీ20 మ్యాచ్‌లలో 301 పరుగులు సాధించాడు.కాగా జూలై 12 నుంచి టీమిండియా వెస్టిండీస్ పర్యటన మొదలుకానుంది.
వెస్టిండీస్‌తో వన్డేలకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్.
చదవండి: అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’!
నక్క తోక తొక్కిన భారత ఆటగాడు! మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ
Excited for This Series 😍
— AV!29 (@SprotsLover29) June 23, 2023
Sanju Samson peak is yet to Come https://t.co/6hjWiLSXvB
Rahane is back as Vice-captain in the test and Sanju Samson is back in the ODI squad.
— Siddharth (@siddies10) June 23, 2023
something to cheer for.. #IndianCricketTeam
Comments
Please login to add a commentAdd a comment