Challenging For Last 8-9 Years: Sanju Samson On His Cricket Career - Sakshi
Sakshi News home page

Sanju Samson: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం చాలెంజింగ్‌! ఎప్పుడు, ఎక్కడ ఆడమన్నా..

Published Wed, Aug 2 2023 12:07 PM | Last Updated on Wed, Aug 2 2023 12:49 PM

Ind vs WI 3rd ODI Challenging For Last 8 To 9 Years: Sanju Samson On His Career - Sakshi

West Indies vs India, 3rd ODI: ‘‘టీమిండియా క్రికెటర్‌గా ఉండటం సవాలుతో కూడుకున్నది. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాను.. 8-9 ఏళ్లుగా భారత జట్టుకు కూడా ఆడుతున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఒక స్థానమంటూ లేదు. కాబట్టి ఏ పొజిషన్‌లో ఆడాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలన్న విషయం మనకు బోధపడుతుంది. 

మనం ఎన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉన్నామన్నదే ముఖ్యం. అంతేగానీ బ్యాటింగ్‌ పొజిషన్‌ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఆడమన్నా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి’’ అని టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అన్నాడు.

జట్టులో సుస్థిర స్థానం లేదు!
కాగా కేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ ప్రతిభ ఉన్నా వరుస అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నాడు. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. అడపాదడపా ఛాన్స్‌లు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవడం.. బాగానే ఆడుతున్నాడు అనుకునే సమయంలో గాయాల పాలై జట్టుకు దూరం కావడం జరుగుతూ ఉన్నాయి.

ఇషాన్‌కు పెద్దపీట
ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సంజూ ఎంపిక కావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో అతడికి మొండిచేయి ఎదురైంది. వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టింది.

దీంతో మరోసారి బీసీసీఐ మరోసారి విరుచుకుపడ్డారు సంజూ ఫ్యాన్స్‌. ఈ క్రమంలో రెండో వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వారి ఆశలను వమ్ము చేశాడు. 19 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘అవకాశాలు ఇవ్వలేదు అంటారు.. ఇస్తే ఇలా చేస్తారు’’ అంటూ హేటర్స్‌ సంజూపై ట్రోల్స్‌ రూపంలో విషం చిమ్మారు.

మూడో వన్డే సందర్భంగా మూడో హాఫ్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ మినహా మిగతా వాళ్లంతా విఫలమై జట్టు ఓడిపోయినా కొంతమంది సంజూనే టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో మూడో వన్డేలో ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు. 41 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున వన్డే కెరీర్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేశాడు. 

భిన్న వ్యూహాలతో..
ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం మ్యాచ్‌ బ్రాడ్‌కాస్టర్స్‌తో మాట్లాడిన సంజూ శాంసన్‌.. భారత క్రికెటర్‌గా కొనసాగటం నిరంతరం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ఇక తరచుగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ కేరళ బ్యాటర్‌ ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చాడు.

‘‘మిడిలార్డర్‌లో ఆడటం బాగుంది. పరుగులు సాధించడం అంటే జట్టు గెలవడంలో మన వంతు పాత్ర పోషించడమే! ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో నాకంటూ భిన్న ప్రణాళికలు ఉంటాయి’’ అని సంజూ శాంసన్‌ చెప్పుకొచ్చాడు. కాగా 2015లో జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా సంజూ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

చదవండి: మొన్న వాటర్‌బాయ్‌! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్‌ 
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. పాక్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు బద్దలు.. ఏకంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement