పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ | Punjab Kings appoint exselector Sunil Joshi as spin bowling coach | Sakshi
Sakshi News home page

IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

Published Tue, Jan 17 2023 8:33 AM | Last Updated on Tue, Jan 17 2023 8:35 AM

Punjab Kings appoint exselector Sunil Joshi as spin bowling coach - Sakshi

ఈ ఏడాది ఐపీఎల్‌ టి20 టోర్నీలో పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ జోషి స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కర్ణాటకకు చెందిన 52 ఏళ్ల సునీల్‌ జోషి భారత జట్టు తరఫున 1996 నుంచి 2001 మధ్య కాలంలో 15 టెస్టులు ఆడి 41 వికెట్లు... 69 వన్డేలు ఆడి 69 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడిన సునీల్‌ జోషి గతంలో హైదరాబాద్‌ రంజీ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు. ఇక ఇప్పటికే పంజాబ్‌ తమ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్‌ ఆటగాడు ట్రెవర్ బేలిస్‌ నియమించిన సంగతి తెలిసిందే. అదే విధంగా పంజాబ్‌​ కింగ్స్‌ తమ జట్టు ​కెప్టెన్సీ బాధ్యతలు భారత వెటరన్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ అప్పగించింది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. బుమ్రా కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement