Trevor Bayliss
-
IPL 2025: మరో హెడ్ కోచ్‌పై వేటు..?
ఐపీఎల్ 2025 ప్రారంభానికి చాలా సమయం ఉండగానే అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొద్ది రోజుల కిందట ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు తప్పించగా.. తాజాగా మరో ఫ్రాంచైజీ తమ కోచ్‌పై వేటుకు రంగం సిద్దం చేసింది. ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను తప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బేలిస్ స్థానంలో భారతీయ కోచ్‌ను నియమించుకోవాలని ఫ్రాంచైజీ పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం. కొత్త కోచ్ రేసులో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బాంగర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాంగర్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ప్రస్తుతం అతను అదే ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ డెవలెప్‌మెంట్‌గా వ్యవరిస్తున్నాడు.బేలిస్ విషయానికొస్తే.. ఇతనిపై పెద్దగా కంప్లెయింట్లు లేనప్పటికీ.. స్వదేశీ కోచ్ అనే నినాదం కారణంగా అతన్ని తప్పించాలని పంజాబ్ ఫ్రాంచైజీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన 61 ఏళ్లు బేలిస్ 2023 సీజన్‌కు ముందు పంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని ఆధ్వర్యంలో పంజాబ్ అశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. గత సీజన్‌ను ఆ జట్టు చివరి నుంచి రెండో స్థానంతో ముగించింది. 2023లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండింది. ఆ సీజన్లో పంజాబ్ చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.కాగా, గౌతమ్ గంభీర్ (కేకేఆర్), ఆశిష్ నెహ్రా (గుజరాత్) హెడ్ కోచ్‌లుగా సక్సెస్ సాధించాక ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ స్వదేశీ కోచ్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో స్వదేశీ కోచ్‌లకు భారీ డిమాండ్ ఉంది. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి భారత మాజీల కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లడంతో కేకేఆర్ హెడ్ కోచ్ పదవి కూడా ఖాళీ అయ్యింది. ఈ జట్టు కూడా మరో ఇండియన్ కోచ్‌తో గంభీర్ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తుంది. మరోవైపు టీమిండియా మాజీ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ డీల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాబోయే సీజన్ కోసం ఆర్సీబీ దినేశ్ కార్తీక్‌కు తమ కోచింగ్ టీమ్‌లోకి తీసుకుంది. కోచింగ్ సిబ్బంది మార్పులు చేర్పుల అంశంపై ఈ ఏడాది చివర్లోగా క్లారిటీ వస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ సిబ్బందితో పాటు ఆటగాళ్ల మార్పు చేర్పులపై కూడా దృష్టి పెట్టాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు వచ్చే సీజన్లో ఫ్రాంచైజీ మారే అవకాశం ఉంది. -
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
ఈ ఏడాది ఐపీఎల్ టి20 టోర్నీలో పంజాబ్ కింగ్స్ జట్టుకు భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కర్ణాటకకు చెందిన 52 ఏళ్ల సునీల్ జోషి భారత జట్టు తరఫున 1996 నుంచి 2001 మధ్య కాలంలో 15 టెస్టులు ఆడి 41 వికెట్లు... 69 వన్డేలు ఆడి 69 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన సునీల్ జోషి గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు. ఇక ఇప్పటికే పంజాబ్ తమ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ ఆటగాడు ట్రెవర్ బేలిస్ నియమించిన సంగతి తెలిసిందే. అదే విధంగా పంజాబ్ కింగ్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు భారత వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్ అప్పగించింది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. బుమ్రా కీలక నిర్ణయం! -
పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్!
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ ఆటగాడు ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంజాబ్ కింగ్స్ మాజమాన్యం వెల్లడించింది. "మా కొత్త కోచ్ ట్రెవర్ బేలిస్‌కు ఘన స్వాగతం పలుకుతున్నాం. ఇకపై జట్టుకు విజయపథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాం" అని పంజాబ్ కింగ్స్ ట్విటర్లో పేర్కొంది. కాగా ఈ ఏడాది సీజన్ వరకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లేను తన బాధ్యతల నుంచి పంజాబ్ తప్పించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ట్రెవర్ బేలిస్ కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా బేలిస్ వ్యవహరించాడు. 2015 నుంచి 2019 వరకు ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా అతడు పనిచేశాడు. అదే విధంగా ఐపీఎల్లో తన సేవలను అందించాడు. 2012, 2014 ఐపీఎల్ ఛాంపియన్స్ కేకేఆర్‌కు సపోర్టింగ్ స్టాఫ్ హెడ్‌గా వ్యవహరించిన బేలిస్.. 2020, 2021 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. 🚨 New Coach Alert 🚨 IPL winner ✅ ODI World Cup winner ✅ CLT20 winner ✅ Here's wishing a very warm welcome to our new Head Coach, Trevor Bayliss. 😍 Here's looking forward to a successful partnership! 🤝#PunjabKings #SaddaPunjab #TrevorBayliss #HeadCoach pic.twitter.com/UKdKi2Lefi — Punjab Kings (@PunjabKingsIPL) September 16, 2022 చదవండి: Mark Boucher: ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా మార్క్ బౌచర్ -
Punjab Kings: కుంబ్లేపై వేటు.. సన్‌రైజర్స్ మాజీ కోచ్‌కు ఓటు
ఐపీఎల్ 2023 కోసం కొన్ని జట్లు ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇటీవలే సన్‌రైజర్స్ యాజమాన్యం హెడ్ కోచ్ టామ్ మూడీని తప్పిస్తూ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పగా.. తాజాగా పంజాబ్ కింగ్స్ సైతం పాత కోచ్ అనిల్ కుంబ్లేపై వేటు వేసి, సన్‌రైజర్స్ మాజీ కోచ్, 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ (ఇంగ్లండ్) కోచ్ ట్రెవర్ బేలిస్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. స్వతహాగా ఆస్ట్రేలియన్ అయిన బేలిస్ 2020, 2021 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా.. అంతకుముందు 2012, 2014 ఐపీఎల్ ఛాంపియన్ కేకేఆర్‌కు సపోర్టింగ్ స్టాఫ్ హెడ్‌గా వ్యవహరించాడు. 2019 నుంచి పంజాబ్ హెడ్ కోచ్‌గా, ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలందిస్తున కుంబ్లేతో ఒప్పందం గడువు ముగియడంతో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆటగాడిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా కోచ్‌గా ఘనమైన రికార్డు కలిగి ఉండటంతో పంజాబ్ బేలిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా, గత సీజన్లో కేఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ ఆఖరి నిమిషంలో మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. 2021 సీజన్లో కెప్టెన్ మారినా పంజాబ్ ఫేట్ మాత్రం మారలేదు. వరుసగా నాలుగో సీజన్లోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కెప్టెన్‌గా మయాంక్ కూడా విఫలం కావడంతో పంజాబ్ మరో కొత్త కెప్టెన్ వేటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఫ్రాంచైజీ యాజమాన్యం కొద్ది రోజుల కిందట క్లారిటీ ఇచ్చింది. మయాంక్ 2023 సీజన్లోనూ పంజాబ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని కన్ఫర్మ్ చేసింది. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..? -
ఈ సీజన్‌కు వార్నర్ దూరం!
ఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పదవి నుంచి ఉద్వాసన గురైన డేవిడ్ వార్నర్.. ఇక మొత్తం సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో వార్నర్ ఆడకపోవచ్చని కోచ్ ట్రెవర్ బెయిలీస్ సంకేతాలిచ్చాడు. మళ్లీ వార్నర్ ఆటను ఈ సీజన్లో చూడకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు. వార్నర్ వేటుపై ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బెయిలీస్.. జట్టు కూర్పులో భాగంగా వార్నర్ ఇక ఆడటం కష్టమని స్పష్టం చేశాడు. ఇది కఠిన నిర్ణయమే అయినా జట్టు ప్రయోజనాల కోసం తప్పడం లేదన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు వార్నర్ పక్కనపెట్టామన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే వ్యూహం కొనసాగవచ్చన్నాడు. శనివారం(మే1వ తేదీ ) వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించిన సన్‌రైజర్స్ మేనేజ్మెంట్.. రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడే క్రమంలో వార్నర్‌ను పక్కన పెట్టేసింది. దాంతో బెయిర్ స్టో, మనీష్ పాండేలు ఓపెనర్లుగా దిగారు. నేటి మ్యాచ్‌లో వార్నర్ స్థానంలో నబీ తుది జట్టులోకి వచ్చాడు. -
ఆ కారణంగానే విలియమ్సన్‌ను ఆడించట్లేదు: ఎస్ఆర్హెచ్ కోచ్
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముప్పేట దాడి మొదలైంది. జట్టు మిడిలార్డర్ బలహీనంగా ఉందని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఆ స్థానంలో సమర్ధవంతంగా బ్యాటింగ్ చేయగల కేన్ విలియమ్సన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు కలిగిన విలియమ్సన్‌ను ఎందుకు ఆడించడంలేదన్న అంశంపై అభిమానుల మదిలో రకరకాల సందేహాలు మెదులుతున్నాయి. తొలి మ్యాచ్‌లో మహ్మద్ నబీ, రెండో మ్యాచ్‌లో జేసన్ హోల్డర్‌కు అవకాశం కల్పించిన మేనేజ్మెంట్కు మ్యాచ్ విన్నర్ అయిన విలియమ్సన్ కనిపించడం లేదా అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో తుది జట్టులో విలియమ్సన్‌ను ఎంపిక చేయకపోడంపై ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ మొదటిసారిగా నోరు విప్పాడు. జట్టు కూర్పు విషయంలో ఎటువంటి సమస్య లేదని, విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోడంవల్లనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చాడు. ఫిట్నెస్ విషయంలో విలియమ్సన్ కసరత్తు చేస్తున్నాడని, అతను పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చాడు. మరోవైపు ఆర్సీబీతో మ్యాచ్‌లో నబీని తప్పించడంపై కూడా బేలిస్ వివరణ ఇచ్చాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నబీ తలకు బలంగా గాయమైందని అందువల్లనే అతని స్థానంలో హోల్డర్‌కు అవకాశం ఇచ్చామని తెలిపాడు. కాగా, గత నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు ముందు విలియమ్సన్ గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ సిరీస్ మొత్తానికి అతను దూరమాయ్యడు. ఇదిలా ఉంటే నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేసినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమవ్వడంతో ఎస్ఆర్హెచ్కు సీజన్లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు. చదవండి: ఇది వార్నర్ తప్పిదం కాదా? చదవండి: కోహ్లీ 'ఆ సలహా' వల్లే నేడు ఈ స్థాయికి: బాబర్ ఆజమ్ -
సన్‌రైజర్స్ చెంతకు మరో ఆసీస్ మాజీ క్రికెటర్
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. తమ బలాబలాలను పరీక్షించుకుంటూనే, గత సీజన్లో జరిగిన పొరపాట్లపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లు, కోచింగ్ బృందంలో మార్పులు చేపట్టాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందంజలో ఉంది. గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌కు సేవలందిస్తున్న టామ్ మూడీపై వేటు వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ చిరకాల కోరికను అందించిన ట్రేవర్ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమించించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ను సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు సన్‌రైజర్స్ యాజమాన్యం ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌కు స్వాగతం’అంటూ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది. ఇక ప్రధాన కోచ్ ట్రేవర్ బేలిస్ కూడా ఆసీస్‌కు చెందిన వాడే కావడం విశేషం. ఇక వచ్చే సీజన్‌కు సన్‌రైజర్స్‌కు సంబంధించిన పూర్తి సహాయక సిబ్బంది వివరాలను కూడా తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మురళీథరన్‌లు మెంటార్లుగా వ్యవహరిస్తారని తెలిపింది. ఇక 2015 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో హాడిన్ సభ్యుడు. యాషెస్- 2015 అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హాడిన్ 2016లో పలు సిరీస్‌లకు ఆసీస్-ఏ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఆసీస్ తరుపున 66 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 3,266 పరుగులు చేయగా.. 126 వన్డేల్లో 3,122 పరుగులు సాధించాడు. We welcome Brad Haddin as the Assistant Coach of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/XqEn8Y10LX — SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 Mentors, Coaches and Support Staff of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/r7E0Rvm83x — SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 -
సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టును విశ్వ విజేతగా నిలిపి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్ బేలిస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు టామ్ మూడీ (ఆస్ట్రేలియా) హెడ్ కోచ్‌గా ఉన్నాడు. బేలిస్ సైతం ఆస్ట్రేలియాకు చెందినవాడే. కొంతకాలంగా ఇంగ్లండ్‌కు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలోనే ఆ జట్టు 2015 యాషెస్ సిరీస్‌ను 3–2 తేడాతో గెల్చుకుంది. 2016 టి20 ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. అనంతరం వన్డేల్లో నంబర్‌వన్‌గానూ అవతరించింది. తాజాగా వన్డే ప్రపంచ కప్‌నూ సాధించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌తో ఇంగ్లండ్ జాతీయ జట్టుతో బేలిస్ ఒప్పందం ముగియనుంది. దీనికిముందు 2010–11లో అతడు ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం శ్రీలంక జాతీయ జట్టుకు పనిచేశాడు. లంక 2011 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరినప్పుడు బేలిస్ ఆ దేశ కోచ్‌గా ఉన్నాడు. 2012–15 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సందర్భంలోనూ అతడే శిక్షకుడు. బేలిస్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ సైతం ప్రయత్నించాయి. కోల్‌కతాతో చర్చలు కూడా నడిచినా అవి ముందుకు సాగలేదు. మూడీ సేవలకు వీడ్కోలు సన్‌రైజర్స్ కోచ్‌గా టామ్ మూడీది విజయవంతమైన ప్రయాణమే. అతడు ఏడు సీజన్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇందులో 2016లో హైదరాబాద్ లీగ్ విజేతగా నిలవగా, 2018లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. ‘మూడీ స్థానంలో ఫ్రాంచైజీకి కొత్త హెడ్ కోచ్‌ను నియమించాలన్నది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. జట్టు భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసేందుకు అతడు సరైనవాడు ’ అని సన్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. జట్టుపై మూడీ ప్రభావాన్ని ఈ సందర్భంగా కొనియాడింది. ‘సన్ రైజర్స్ పురోగతి, విజయాల్లో మూడీది చెరగని ముద్ర. లీగ్‌లో అత్యధిక కాలం కోచ్‌గా పనిచేశాడు. అయినా కొత్తవారికి కోచింగ్ బాధ్యతలు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది’ అని సన్‌రైజర్స్ సీఈవో షణ్ముగం తెలిపాడు. -
ఇంగ్లండ్ కోచ్‌కు సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న ట్రెవర్ బేలిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు సేవలందించిన టామ్ మూడీకి ధన్యవాదాలు తెలిపింది. ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంతో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ శిక్షణలో ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలవడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా బేలిస్ కోసం చివరి వరకు ప్రయత్నించింది. వచ్చే ఐపీఎల్ సీజన్లో తమ జట్టుకు కోచ్‌గా సేవలందించేందుకు బేలిస్‌కు సన్‌రైజర్స్ భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇక కోచ్‌గా బేలిస్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐపీఎల్లో రెండు సార్లు విజేతగా నిలిచినప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా బేలిస్ ఉన్నాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్ బిగ్‌బాష్ లీగ్ గెలవడంలో కోచ్‌గా బేలిస్ పాత్ర మరవలేనిది. తాజాగా ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ గెలవడంతో అందరి దృష్టి ఇతడిపై పడింది. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు బేలిస్ కోసం పోటీపడ్డాయి. ఇక సన్‌రైజర్స్ కోచ్‌గా టామ్ మూడీకి ఘనమైన రికార్డే ఉంది. మూడీ కోచింగ్‌లోనే సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో పాటు, ఐదు సార్లు ప్లే ఆఫ్‌కు చేరింది. 🚨Announcement🚨 Trevor Bayliss, England's WC Winning coach, has been appointed as the new Head Coach of SunRisers Hyderabad. #SRHCoachTrevor pic.twitter.com/ajqeRUBym5 — SunRisers Hyderabad (@SunRisers) July 18, 2019 -
‘షెల్డన్ సెల్యూట్’పై కోచ్ అసహనం..!
లండన్ : వికెట్ తీసిన వెంటనే ‘సెల్యూట్’ చేసి వెస్టిండీస్ ఫాస్ట్‌బౌలర్ షెల్డన్ కాట్రెల్ తాజా వరల్డ్‌కప్‌లో ఓ నయా ట్రెండ్ సృష్టించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ తీసిన వెంటనే అంపైర్‌కు, డ్రెస్సింగ్ రూమ్‌వైపు సెల్యూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వృత్తిరీత్యా సోల్జర్ అయిన కాట్రెల్ జమైకా డిఫెన్స్ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్ తీసిన వెంటనే మార్చ్ఫాస్ట్ చేసి సెల్యూట్ చేస్తానని వెల్లడించాడు. అయితే, షెల్డన్ సెల్యూట్‌పై ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. తనకు నచ్చని ఒకేఒకే విషయం షెల్డన్ సెల్యూట్ అంటూ పేర్కొన్నాడు. (వికెట్ పడగానే సెల్యూట్.. కారణం ఇదే) ‘ఆటగాళ్లేం నాలుగు పదుల వయసు వారు కాదు. ఇది కుర్రాళ్ల ఆట. సంబరాలు చేసుకునే విధానం ఒక్కో జట్టుకు ఒక్కోలా ఉంటుంది. ఆటగాళ్ల మధ్య సెలబ్రేషన్స్‌లో తేడాలుంటాయి. గెలుపు సంబరాలు అటు సహచరులకు, ఇటు అభిమానులకు ఉత్తేజాన్నిస్తాయి. అయితే, ఒకరి సెలబ్రేషన్స్.. మరొకరికి నచ్చాలనే నియమమేమీ లేదు. షెల్డన్ సెల్యూట్ విషయంలో నాకూ అలానే అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ శుక్రవారం ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగనుంది. (చదవండి : ఈ క్యాచ్ చూస్తే.. ‘సెల్యూట్’ చేయాల్సిందే) -
ఇప్పుడు కోహ్లితో డేంజర్: ఇంగ్లండ్ కోచ్
నాటింగ్‌హామ్: ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో మరింత ప్రమాదకరమని ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బెలీస్ అభిప్రాయపడ్డాడు. నేలకు కొట్టిన బంతిలా కోహ్లి విజృంభించే అవకాశం ఉందని, అతనొక్కడే మ్యాచ్ తిప్పేయగలడని తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. భారత్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్టు శనివారం నుంచి ప్రారంభకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెలీస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గాయం నుంచి కోలుకున్న కోహ్లితో మరింత ప్రమాదకరం. గతాన్ని పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు. కోహ్లి కూడా అలానే రాణించే అవకాశం ఉంది. అతను ప్రాక్టీస్‌లో ఎలాంటి సమస్య లేకుండా స్లిప్‌లో క్యాచ్‌లు అందుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతను తప్పకుండా మూడో టెస్టుకు అందుబాటులోఉంటాడు. అతను ఆడిన ఆడకపోయినా మా వ్యూహం మాత్రం మారదు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం పిచ్సైతం స్వింగ్‌కు అనుకూలిస్తుంది. లార్డ్స్‌లో భారత్‌ను దెబ్బకొట్టినట్లే ఇక్కడా అదే పునరావృతం చేస్తాం.’ అని చెప్పుకొచ్చాడు. ఇక తొలి టెస్టులో కోహ్లి సింగిల్ హ్యాండ్ ప్రదర్శనతో రాణించగా తృటిలో విజయం చేజారిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో గాయంతో ఇబ్బంది పడటంతో భారత్ కనీస పోరాట పటిమను ప్రదర్శించ లేకపోయింది. దీంతో కోహ్లి మూడో టెస్టు ఆడటంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కానీ కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో ముమ్మరంగా సాధన చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇది భారత్‌కు అనుకూల అంశం కాగా.. ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు మంచి రికార్డు ఉండటం ప్రతికూల అంశం. -
గావస్కర్‌కు స్ట్రాంగ్ కౌంటర్!
లండన్: భారత క్రికెట్ జట్టు వరుస రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడానికి పెద్దగా ప్రాక్టీస్ లభించకపోవడం కూడా ఒక కారణమన్న మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌కు ఇంగ్లండ్ కోచ్ ట్రావెర్ బేలిస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ భారత జట్టుకు పెద్దగా ప్రాక్టీస్ లేదనే విషయాన్ని ఒప్పుకుంటేనే, ఉన్న పరిస్థితుల్ని బట్టే ఏ జట్టైనా పోరుకు సిద్ధమవుతుందన్నాడు. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో వార్మప్ మ్యాచ్‌లను ఇరికించడం అంత తేలికైన పనికాదన్నాడు. ‘ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్‌లు ఎక్కువగా క్రికెట్ ఆడుతున్న జట్లు. అయినప్పటికీ ప్రతీ జట్టు వార్మప్ మ్యాచ్‌లను కోరుకోవడం సహజం. అయితే ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేర్చడం దాదాపు అసాధ్యం. మరి అటువంటప్పుడు మాకు ఎక్కువ ప్రాక్టీస్ రాలేదని సాకులు చెప్పడం ఎంతవరకూ సమంజసం. భారత్‌లో పర్యటించేటప్పుడు కూడా మాకు ఇదే డైలమా ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని మాకూ అనిపిస్తుంది. ఆ సమయంలో మీ ప్రిపరేషన్ సరిగా ఉందా అనే ప్రశ్నించడం కరెక్ట్ కాదు కదా. వారానికి పది రోజులు ఉండవు కదా’ అంటూ బేలిస్ తనదైన శైలిలో బదులిచ్చాడు. టెస్టు సిరీస్‌కు ముందు ఎసెక్స్ జట్టుతో భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాక్టీస్ మ్యాచ్‌కు నాలుగు రోజుల కేటాయించగా, కొన్ని కారణాల వల్ల దాన్ని మూడు రోజులకు కుదించాల్సి వచ్చింది. దీనిపై గావస్కర్ విమర్శలు ఎక్కు పెట్టిన నేపథ్యంలో బేలీస్ స్పందించాడు.