లండన్: భారత క్రికెట్ జట్టు వరుస రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడానికి పెద్దగా ప్రాక్టీస్ లభించకపోవడం కూడా ఒక కారణమన్న మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌కు ఇంగ్లండ్ కోచ్ ట్రావెర్ బేలిస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ భారత జట్టుకు పెద్దగా ప్రాక్టీస్ లేదనే విషయాన్ని ఒప్పుకుంటేనే, ఉన్న పరిస్థితుల్ని బట్టే ఏ జట్టైనా పోరుకు సిద్ధమవుతుందన్నాడు. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో వార్మప్ మ్యాచ్‌లను ఇరికించడం అంత తేలికైన పనికాదన్నాడు.
‘ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్‌లు ఎక్కువగా క్రికెట్ ఆడుతున్న జట్లు. అయినప్పటికీ ప్రతీ జట్టు వార్మప్ మ్యాచ్‌లను కోరుకోవడం సహజం. అయితే ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేర్చడం దాదాపు అసాధ్యం. మరి అటువంటప్పుడు మాకు ఎక్కువ ప్రాక్టీస్ రాలేదని సాకులు చెప్పడం ఎంతవరకూ సమంజసం. భారత్‌లో పర్యటించేటప్పుడు కూడా మాకు ఇదే డైలమా ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని మాకూ అనిపిస్తుంది. ఆ సమయంలో మీ ప్రిపరేషన్ సరిగా ఉందా అనే ప్రశ్నించడం కరెక్ట్ కాదు కదా. వారానికి పది రోజులు ఉండవు కదా’ అంటూ బేలిస్ తనదైన శైలిలో బదులిచ్చాడు. టెస్టు సిరీస్‌కు ముందు ఎసెక్స్ జట్టుతో భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాక్టీస్ మ్యాచ్‌కు నాలుగు రోజుల కేటాయించగా, కొన్ని కారణాల వల్ల దాన్ని మూడు రోజులకు కుదించాల్సి వచ్చింది. దీనిపై గావస్కర్ విమర్శలు ఎక్కు పెట్టిన నేపథ్యంలో బేలీస్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment