కోహ్లిపైనే ఆధారపడితే ఎలా? | Virat Kohli Cant Do It Every Time, Says Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

కోహ్లిపైనే ఆధారపడితే ఎలా?

Published Tue, Sep 4 2018 12:38 PM | Last Updated on Tue, Sep 4 2018 12:42 PM

Virat Kohli Cant Do It Every Time, Says Sunil Gavaskar - Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌పై టీమిండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస‍్కర్‌ మద్దతుగా నిలిచాడు. ఈ సిరీస్‌లో కోహ్లి ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేశాడని, మిగతా వారు మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారన్నాడు. ‘ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లి సాధించిన సెంచరీలు చూశాం.. హాఫ్‌ సెంచరీలు కూడా చూశాం. ప్రతీసారి కోహ్లి సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు చేస్తూ కూర్చుంటే మిగతా వారు అతని ఆట తీరును ఆస్వాదిస్తారా.

కోహ్లి కూడా మనిషే కదా. అన్ని సందర్బాల్లో అతనిపైనే ఆధారపడితే ఎలా. నా వరకూ టీమిండియా మొత్తం కోహ్లిపైనే ఆధారపడినట్లు కనబడుతోంది. ఇది మంచి విధానం కాదు. సిరీస్‌ను కోల్పోవడానికి టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణం’ అని గావస్కర్‌ విమర్శించాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement