ఐపీఎల్ 2023 కోసం కొన్ని జట్లు ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇటీవలే సన్‌రైజర్స్ యాజమాన్యం హెడ్ కోచ్ టామ్ మూడీని తప్పిస్తూ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పగా.. తాజాగా పంజాబ్ కింగ్స్ సైతం పాత కోచ్ అనిల్ కుంబ్లేపై వేటు వేసి, సన్‌రైజర్స్ మాజీ కోచ్, 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ (ఇంగ్లండ్) కోచ్ ట్రెవర్ బేలిస్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
స్వతహాగా ఆస్ట్రేలియన్ అయిన బేలిస్ 2020, 2021 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా.. అంతకుముందు 2012, 2014 ఐపీఎల్ ఛాంపియన్ కేకేఆర్‌కు సపోర్టింగ్ స్టాఫ్ హెడ్‌గా వ్యవహరించాడు. 2019 నుంచి పంజాబ్ హెడ్ కోచ్‌గా, ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలందిస్తున కుంబ్లేతో ఒప్పందం గడువు ముగియడంతో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆటగాడిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా కోచ్‌గా ఘనమైన రికార్డు కలిగి ఉండటంతో పంజాబ్ బేలిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
కాగా, గత సీజన్‌లో కేఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ ఆఖరి నిమిషంలో మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. 2021 సీజన్‌లో కెప్టెన్ మారినా పంజాబ్ ఫేట్ మాత్రం మారలేదు. వరుసగా నాలుగో సీజన్‌లోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కెప్టెన్‌గా మయాంక్ కూడా విఫలం కావడంతో పంజాబ్ మరో కొత్త కెప్టెన్ వేటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఫ్రాంచైజీ యాజమాన్యం కొద్ది రోజుల కిందట క్లారిటీ ఇచ్చింది. మయాంక్ 2023 సీజన్‌లోనూ పంజాబ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని కన్ఫర్మ్ చేసింది.
చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్.. కెప్టెన్ ఎవరంటే..?
Comments
Please login to add a commentAdd a comment