ఐపీఎల్ 2025 ప్రారంభానికి చాలా సమయం ఉండగానే అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొద్ది రోజుల కిందట ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు తప్పించగా.. తాజాగా మరో ఫ్రాంచైజీ తమ కోచ్‌పై వేటుకు రంగం సిద్దం చేసింది. ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను తప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బేలిస్ స్థానంలో భారతీయ కోచ్‌ను నియమించుకోవాలని ఫ్రాంచైజీ పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం. కొత్త కోచ్ రేసులో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బాంగర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాంగర్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ప్రస్తుతం అతను అదే ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ డెవలెప్‌మెంట్‌గా వ్యవరిస్తున్నాడు.
బేలిస్ విషయానికొస్తే.. ఇతనిపై పెద్దగా కంప్లెయింట్‌లు లేనప్పటికీ.. స్వదేశీ కోచ్ అనే నినాదం కారణంగా అతన్ని తప్పించాలని పంజాబ్ ఫ్రాంచైజీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన 61 ఏళ్లు బేలిస్ 2023 సీజన్‌కు ముందు పంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని ఆధ్వర్యంలో పంజాబ్ అశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. గత సీజన్‌ను ఆ జట్టు చివరి నుంచి రెండో స్థానంతో ముగించింది. 2023లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండింది. ఆ సీజన్‌లో పంజాబ్ చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
కాగా, గౌతమ్ గంభీర్ (కేకేఆర్), ఆశిష్ నెహ్రా (గుజరాత్) హెడ్ కోచ్‌లుగా సక్సెస్ సాధించాక ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ స్వదేశీ కోచ్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో స్వదేశీ కోచ్‌లకు భారీ డిమాండ్ ఉంది. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి భారత మాజీల కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లడంతో కేకేఆర్ హెడ్ కోచ్ పదవి కూడా ఖాళీ అయ్యింది. ఈ జట్టు కూడా మరో ఇండియన్ కోచ్‌తో గంభీర్ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తుంది.
మరోవైపు టీమిండియా మాజీ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ డీల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాబోయే సీజన్ కోసం ఆర్సీబీ దినేశ్ కార్తీక్‌కు తమ కోచింగ్ టీమ్‌లోకి తీసుకుంది. కోచింగ్ సిబ్బంది మార్పులు చేర్పుల అంశంపై ఈ ఏడాది చివర్లోగా క్లారిటీ వస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ సిబ్బందితో పాటు ఆటగాళ్ల మార్పు చేర్పులపై కూడా దృష్టి పెట్టాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు వచ్చే సీజన్‌లో ఫ్రాంచైజీ మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment