IPL 2023: Trevor Bayliss Appointed As Punjab Kings New Head Coach - Sakshi
Sakshi News home page

IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్ బేలిస్‌!

Published Fri, Sep 16 2022 3:14 PM | Last Updated on Fri, Sep 16 2022 4:22 PM

Trevor Bayliss named new head coach of Punjab Kings - Sakshi

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్‌ ఆటగాడు ట్రెవర్ బేలిస్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంజాబ్‌ కింగ్స్‌ మాజమాన్యం వెల్లడించింది. "మా కొత్త కోచ్‌ ట్రెవర్ బేలిస్‌కు ఘన స్వాగతం పలుకుతున్నాం. ఇకపై జట్టుకు విజయపథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాం" అని పంజాబ్‌ కింగ్స్‌ ట్విటర్‌లో పేర్కొంది.

కాగా ఈ ఏడాది సీజన్‌ వరకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లేను తన బాధ్యతల నుంచి పంజాబ్‌ తప్పించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ట్రెవర్ బేలిస్‌ కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు కోచ్‌గా బేలిస్‌ వ్యవహరించాడు. 2015 నుంచి 2019 వరకు ఇంగ్లండ్ హెడ్‌ కోచ్‌గా అతడు పనిచేశాడు.

అదే విధంగా ఐపీఎల్‌లో తన సేవలను అందించాడు. 2012, 2014 ఐపీఎల్‌ ఛాంపియన్స్‌ కేకేఆర్‌కు సపోర్టింగ్‌ స్టాఫ్‌ హెడ్‌గా వ్యవహరించిన బేలిస్‌.. 2020, 2021 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు.


చదవండి: Mark Boucher: ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌గా మార్క్‌ బౌచర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement