IPL 2023, SRH Vs LSG: Harry Brook Trolled On Twitter After Back To Back Flop - Sakshi
Sakshi News home page

IPL 2023: మరి నువ్వు మారవా బ్రో.. 13 కోట్లు తీసుకున్నావు! ఇదేనా ఆట?

Published Mon, Apr 10 2023 7:40 AM | Last Updated on Mon, Apr 10 2023 10:00 AM

Harry Brook trolled on Twitter after backto-back flop shows in IPL 2023 - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హైదారాబాద్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 17.1 ఓవర్లలో రెండు వికెట్టు కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిఫాఠి(74 నాటౌట్‌) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌(37నాటౌట్‌) రాణించాడు.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 66 బంతుల్లో 99 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఉమ్రాన్‌ రెండు, జానెసన్‌, భువీ ఒక వికెట్‌ సాధించాడు.

తీరు మారని హ్యారీ బ్రూక్..
ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ తలరాత మారినప్పటికీ.. ఆ జట్టు ఆటగాడు హ్యరీ బ్రూక్‌ ఆట తీరు మాత్రం మారడం లేదు. మరోసారి బ్రూక్‌ దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన బ్రూక్‌.. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన బ్రూక్‌ 14 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో హ్యారీ బ్రూక్‌ను  రూ.13.25 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసింది. ఇక ఇంత భారీ మొత్తం తీసుకుని మరి దారుణంగా విఫలమవుతున్న బ్రూక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "నీకు మారమా మరి, 13 కోట్లు తీసుకున్నావు ఇదే నా ఆట" అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement