
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టర్ హ్యారీ బ్రూక్ ఎట్టకేలకు బ్యాట్‌ను ఝులిపించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తద్వారా ఐపీఎల్-16వ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా బ్రూక్ రికార్డును సృష్టించాడు. దీనితో పాటు పలు అరుదైన రికార్డులను బ్రూక్ తన పేరిట లిఖించుకున్నాడు.
బ్రూక్ సాధించిన రికార్డులు ఇవే..
►ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ఐదో ఇంగ్లీష్ బ్యాటర్‌గా బ్రూక్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో ఉన్నారు. ఇందులో బట్లర్ అత్యధికంగా ఐదు సార్లు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
►ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేసిన మూడో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ఉన్నారు. అదే విధంగా సొంత మైదానం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం)లో కాకుండా బయట సెంచరీ సాధించిన తొలి ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు. వార్నర్, బెయిర్ స్టో హైదరాబాద్‌లోనే సెంచరీలు చేశారు.
సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై 23 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్(71), రింకూ సింగ్ పోరాడనప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు ఇప్పటికి జ్ఞానోదయం అయింది.. వచ్చిన వెంటనే దుమ్మురేపాడు!
I. C. Y. M. I
— IndianPremierLeague (@IPL) April 14, 2023
When Harry Brook hits, it stays HIT! 👌👌
Relive his two cracking SIXES off Umesh Yadav 🎥 🔽
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/rVBtgeInVW
Comments
Please login to add a commentAdd a comment