PC: IPL.com
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో చావోరేవో తేల్చుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా ఆదివారం రాజస్తాన్‌తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.
ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇంకా 5 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే మిగిలిన మ్యాచ్‌లు అన్ని విజయం సాధించాలి. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఓ కీలక మార్పు చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. వరుసగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోతే హైదరాబాద్ కథ ముగిసినట్లే. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ ఉన్న పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడం చాలా కష్టం. హైదరాబాద్ జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా పలు సమస్యలు ఉన్నాయి.
హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టాల్సిన సమయం అసన్నమైంది. అతడి స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు అవకాశం ఇవ్వాలి. అదే విధంగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మను ఓపెనర్లుగా కొనసాగించాలి" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(అంచనా): అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, కార్తీక్ త్యాగి
చదవండి: GT Playing XI vs LSG: అన్నదమ్ముల సవాల్.. శ్రీలంక కెప్టెన్ ఐపీఎల్ ఎంట్రీ! అతడు కూడా..
Comments
Please login to add a commentAdd a comment