PC: IPL.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా రెండో విజయం అందుకుంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపొందింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగల్గింది.
కెప్టెన్ నితీష్ రాణా(75), రింకూ సింగ్(58) అద్భుతంగా రాణించనప్పటకీ కేకేఆర్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో జానెసన్, మార్కండే రెండు వికెట్లు, భువనేశ్వర్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్..హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ స్పందించాడు.
భువీ సూపర్.. హ్యారీ అద్భుతం
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్‌క్రమ్ మాట్లాడుతూ.. "మా హోం గ్రౌండ్‌లో కాకుండా బయట తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ చాలా క్లోజ్‌గా వెళ్తుందని నాకు ముందే తెలుసు. కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం. కానీ మా బౌలర్లు అద్బుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు. అదేవిధంగా మాకు బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆరంభం లభించింది.
అదే జోరును ఇన్నింగ్స్ ఆఖరి వరకు కొనసాగించాం. మాకు చాలా బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి బ్యాటర్లకు పూర్తి స్వేచ్చను ఇచ్చాం. హ్యారీ బ్రూక్ ఎటువంటి ఆటగాడో మనందరికీ తెలుసు. మరోసారి అతడు తాను ఎంటో నిరూపించుకున్నాడు. అటువంటి ఆటగాడు కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే హ్యారీ విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు ఇచ్చాం. ఆఖరిగా ప్రతీ మ్యాచ్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటాం" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ
Comments
Please login to add a commentAdd a comment