
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టుతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు టీ20ల సిరీస్ నిమిత్తం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటనుంచనుంది. ఇక జూన్ 26న డబ్లిన్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఐర్లాండ్ సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దూరమయ్యాడు.
దీంతో తొలి సారి భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎంపిక కాగా, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. చేతన్ శర్మ భారత జట్టుతో పాటు ఐర్లాండ్‌కు పయనం కానున్నారు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బీసీసీఐ సెలెక్టర్ సునీల్ జోషి కూడా భారత జట్టుతో ఉన్నారు.
ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: Wasim Jaffer Trolls Eoin Morgan: 'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment