న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్‌ను ఒక్కసారి కూడా సాధించలేని కింగ్స్ పంజాబ్ జట్టు... ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగానే ఆ ఫ్రాంచైజీ తమ ప్రక్షాళనను ముమ్మరం చేసింది. టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను మెంటార్ పదవి నుంచి తొలగించిన ఫ్రాంచైజీ యాజమాన్యం.. తాజాగా బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్‌కు ఉద్వాసన పలికింది.
కేవలం 2018 సీజన్‌కు మాత్రమే కింగ్స్ పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన వెంకటేశ్ ప్రసాద్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను తీసుకొంది. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేఇన శ్రీరామ్‌ను ఎంపిక చేసుకుంది కింగ్స్ పంజాబ్. ఆస్ట్రేలియా జట్టుకు శ్రీరామ్ కన్సల‍్టెంట్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రధాన కోచ్ బ్రాడ్ హడ్జ్ స్థానంలో మైక్ హెసన్‌ను నియమించుకుంది. ఆయన ప్రస్తుతం న్యూజిలాండ్ కోచ్‌గా ఉన్నారు. ఇక కింగ్స్ హై పర్ఫామెన్స్ కోచ్‌గా క్రికెట్ ఆస్ట్రేలియాకు సాంకేతిక వ్యూహ విశ్లేషకుడిగా పనిచేస్తున్నప్రసన్న ఆగోరమ్‌ను తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment