![IPL: Kings XI Punjab trades Ashwin to Delhi Capitals - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/8/Ashwin_Suchith.jpg.webp?itok=e3FO1KqN)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కెప్టెన్‌గా నడిపించిన రవిచంద్రన్ అశ్విన్... తదుపరి సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ‘ఐపీఎల్ ట్రాన్స్‌ఫర్ విండో’ పద్ధతి ప్రకారం ఇరు జట్ల మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అశ్విన్‌ను వదులుకున్నందుకు పంజాబ్ జట్టుకు ఢిల్లీ యాజమాన్యం రూ. 1.5 కోట్ల నగదుతో పాటు స్పిన్నర్ జగదీశ సుచిత్‌ను బదిలీ చేయనుంది. తమతో చేరిన అశ్విన్‌కు రూ. 7.6 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పంజాబ్ ప్రాంఛైజీ సహయజమాని నెస్ వాడియా వెల్లడించారు. నిజానికి సుచిత్‌తో పాటు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌నూ పంజాబ్ కోరినప్పటికీ చివరకు అది సాధ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment