R Ashwin
-
కోహ్లిపై ఫిర్యాదు.. విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు
Ashwin Slams Fake Media Reports In Virat Kohli Issue: మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల(రహానే, పుజారా)తో కలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని, కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి పరోక్ష కారకుడని గత కొద్ది రోజులుగా మీడియాలో వివిధ కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తొలిసారి స్పందించాడు. కోహ్లి ఎపిసోడ్లో తన ప్రమేయం ఏమాత్రం లేదని వివరణ ఇచ్చాడు. ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇదివరకే స్పష్టతనిచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అసత్య కథనాలు ప్రసారం చేసి టీమిండియా అభిమానులను తప్పుదోవ పట్టించరాదని ఓ ప్రముఖ వార్తా సంస్థపై విరుచుకుపడ్డాడు. ఫేక్ న్యూస్ అనే హ్యాండిల్ కోసం వెతుకుతున్నానని, అది పేరు మార్చుకుని ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీగా మారిందని, అలాంటి వార్తా సంస్థల్లో ప్రసారమయ్యే నిరాధారమైన కథనాలను బేస్ చేసుకుని మరిన్ని వార్త సంస్థలు కట్టుకథలు అల్లుతున్నాయని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. కాగా, ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లి అసమర్ధత వల్లే టీమిండియా ఓడిపోయిందని.. ఈ విషయాన్ని అశ్విన్ సహా రహానే, పుజారాలు బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారని ఓ టాప్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అశ్విన్ తనదైన స్టైల్ల్లో విరుచుకుపడ్డాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశాడు. సదరు న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు. చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి -
కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..?
Senior Indian Cricketers Revolted Against Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక గల కారణాలపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పూర్తైన నాటి నుంచి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, రహానే, పుజారాలు కోహ్లిపై అసంతృప్తిగా ఉన్నారని, ఆ ముగ్గురే కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, దీన్ని పరిగణలోకి తీసుకునే కోహ్లి ప్రమేయం లేకుండా టీమిండియా టీ20 ప్రపంచకప్ బృందం ప్రకటించబడిందని, ఇది నచ్చకే కోహ్లి టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని ఆ కథనంలో పేర్కొనబడింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి పుజారా, రహానే, అశ్విన్‌లను బాధ్యులని చేస్తూ.. కోహ్లి నోరుపారేసుకోవడంతో వివాదం మొదలైందని, అది కాస్తా చినికిచినికి గాలివానలా మారి కోహ్లి టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టిందని ప్రచురించింది. అలాగే, టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి వన్డే కెప్టెన్సీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి.. -
టిక్‌టాక్ బ్యాన్: వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడంతో టిక్‌టాక్ స్టార్లపై ఫన్నీ మిమ్స్ క్రియోట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కూడా ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున్న భారత్ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను అశ్విన్ షేర్ చేస్తూ వార్నర్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి ‘అప్పో అన్వర్?’ అంటూ కన్ను కొడుతున్న ఎమోజీని జత చేశాడు. (వార్నర్ ‘మైండ్ బ్లాక్’ అదిరింది కానీ..) Appo Anwar? @davidwarner31 😉 https://t.co/5slRjpmAIs — Ashwin (During Covid 19)🇮🇳 (@ashwinravi99) June 29, 2020 వార్నర్‌ను ట్రోల్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వార్నర్ బాధపుడుతున్న ఓ ఫొటోకు ‘ఒకేసారి ఫ్యాన్స్‌ను కోల్పోయినప్పుడు’, ‘ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను ఎప్పుడు నిషేధిస్తుందా అని వేయిటింగ్’ అంటూ ఫన్నీ మిమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా లాక్డౌన్లో డేవిడ్ వార్నర్ తన భార్య పిల్లలతో కలిసి టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసిన వీడియోలను షేర్ చేస్తుండేవాడు. అవి బాగా వైరల్ అవుతుండటంతో టిక్‌టాక్‌లో 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించి వార్నర్ టిక్‌టాక్ స్టార్ కూడా అయ్యాడు. (వార్నర్ మరో టిక్‌టాక్.. ఈ సారి బాహుబలి) When you lose your entire audiece in a day!#TikTok #59Chineseapps #59chinese #DavidWarner pic.twitter.com/EvFCsajhGg — hitesh makwaney (@Chill_Sergeant) June 29, 2020 -
తొందర పడొద్దు.. రనౌట్ కావొద్దు..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండు రోజుల క్రితం భారతదేశ మొత్తాన్ని లాక్డౌన్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడానికే యత్నిస్తున్నారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో బయటకొచ్చే క్రమంలో ప్రజలు గుంపులుగా రావడం మాత్రం కలవరపరుస్తోంది. ఎవరైనా కూరగాయాలు లాంటి నిత్యావసరాలు తీసుకోవడానికి వెళ్లే క్రమంలో లాక్డౌన్ నియమాన్ని అతిక్రమిస్తున్నారు. ఈ విషయంపైనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.(‘కరోనాపై పోరాటంలో గెలుస్తాం’) దీనిపై క్రికెటర్లు తమదైన శైలిలో ప్రజల్ని బయటకు రావొద్దని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. లాక్డౌన్ నియమాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో భారత క్రికెటర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ పోస్టుల ద్వారా తెలియజెప్పారు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేసిన ఫొటోను అశ్విన్ ట్వీట్ చేయగా, ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజాను రనౌట్ చేసిన వీడియోను జడేజా పోస్ట్ చేశాడు. తొందరపడితే ఇలానే ఉంటుందనే విషయం ప్రజలు తెలుసుకోవాలనేది వీరి రనౌట్ పోస్టులు ఉద్దేశం. ‘జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేసిన ఫోటోను నాకు ఎవరో పంపారు. అదే సమయంలో ఇది జరిగి ఏడాది అయిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. దేశంలో లాక్డౌన్ నడుస్తున్న సమయం. బట్లర్‌ను నేను ఔట్ చేసింది నా దేశ ప్రజలకు బాగా గుర్తు. ఎవరూ బయటకు వెళ్లొద్దు. ఇంట్లోనే ఉండండి.. సేఫ్‌గా ఉండండి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ‘ స్టే ఎట్ హోమ్.. స్టే సేఫ్.. అనవసరంగా రనౌట్ కావొద్దు’ అని జడేజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened. As the nation goes into a lockdown, this is a good reminder to my citizens. Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt — lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020 View this post on Instagram Stay safe, stay at home. Runout matt hona. ❌ 🎥- @foxcricket @cricketcomau A post shared by Ravindra Jadeja (@royalnavghan) on Mar 25, 2020 at 1:38am PDT -
‘గీత’ దాటితే ప్రమాదం!
చెన్నై: సరిగ్గా ఏడాది క్రితం మార్చి 25, 2019న జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. పంజాబ్ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ దూసుకుపోయింది. 44 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన స్థితిలో చేతిలో 9 వికెట్లున్నాయి. ఈ సమయంలో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ రాజస్తాన్ బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్‌కు బౌలింగ్ చేస్తున్నాడు. అయితే నాన్ స్ట్రయికర్‌గా ఉన్న జోస్ బట్లర్... అశ్విన్ ‘డెలివరీ స్ట్రయిడ్’ పూర్తి కాకముందే క్రీజ్ దాటి పరుగు కోసం ముందుకొచ్చాడు. ఏమరుపాటుగా ఉన్న అశ్విన్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. బట్లర్ చాలా ముందుకు వెళ్లిపోవడంతో అవుట్ కాక తప్పలేదు. అలా ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసి అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని విమర్శలు వచ్చినా... నిబంధనల ప్రకారం సరైందేనని భారత స్పిన్నర్ వాదించాడు. బట్లర్ వెనుదిరిగాక ఛేదనలో తడబడిన రాజస్తాన్ చివరకు 14 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ ఘటనను అశ్విన్ మళ్లీ గుర్తు చేసుకున్నాడు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ప్రకటించిన కర్ఫ్యూ, దాని కారణంగా వస్తున్న సమస్యలను అతను ‘మన్కడింగ్’తో పోల్చాడు. గీత దాటితే రనౌట్ అయినట్లు ఇప్పుడు ‘ఇల్లు దాటితే కష్టమని’ అశ్విన్ చెబుతున్నాడు. బయటకు రాకుండా ఉండటం కొంత కష్టమే అయినా... చివరకు విజయం కోసం ఇదంతా చేయాల్సిందేనని అతను అంటున్నాడు. ‘దేశం మొత్తం లాక్డౌన్ అవుతున్న వేళ దీనిని గుర్తు చేయడం అవసరమని నేను భావిస్తున్నా. బయట ఎక్కడా తిరగకండి. ఇంట్లోనే ఉండండి. భద్రంగా ఉండండి’ అని నాటి రనౌట్ ఫొటోతో అశ్విన్ ట్వీట్ చేయడం విశేషం. మొదటి నుంచి ప్రకృతి ప్రేమికుడు అయిన అశ్విన్ తాజా పరిణామాల పట్ల తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘ఈ విశ్వం ఇప్పుడు మానవజాతిని సవాల్ చేస్తోంది. సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండగలమా అని ప్రశ్నిస్తోంది. మరో మనిషి కోసం మనం ఎంత త్యాగం చేయగలమో నిజాయితీగా చెప్పమని అడుగుతోంది. ఇవన్నీ సమాధానం చెప్పలేని కఠినమైన ప్రశ్నలు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వీటికి జవాబులు ఆలోచించండి’ అంటూ కూడా అతను తన ట్విట్టర్లో అభిప్రాయం వ్యక్తం చేశాడు. క్రీడలకంటే ప్రధానమైనవి ఎన్నో... న్యూజిలాండ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం అశ్విన్ కొన్ని స్థానిక లీగ్‌లలో ఆడాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నెలకొన్న నేపథ్యంలో అతను తన సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తన రోజువారీ కార్యక్రమాల గురించి పలు ఆసక్తికర అంశాలు అతను పంచుకున్నాడు. ► ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యకు త్వరలోనే వైద్యులు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నా. ► అయితే ఇదంతా ఇప్పుడు మనకు పెద్ద పాఠం. మనలో చాలా మంది ఆటలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని, జీవితంలో అంతకంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తాజా పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. ► ఇంత సమయం ఉన్నా నేను క్రికెట్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. టీవీలో చూడటం గానీ, యూట్యూబ్‌లో పాత క్లిప్‌లు గానీ అస్సలు చూడటం లేదు. సమీపంలో ఎలాంటి మ్యాచ్‌లు లేవు కాబట్టి నేను ప్రాక్టీస్ కూడా చేయడం లేదు. ► మా అకాడమీ జెన్–నెక్ట్స్ట్ను రెండు వారాల క్రితమే మూసేశాం. దాంతో మా విద్యార్థులకు వాట్సాప్, టెలికాన్ఫరెన్స్ ద్వారా కోచింగ్ ఇస్తున్నా. ► ఉదయం లేచిన దగ్గరి నుంచి నా ఇద్దరు అమ్మాయిలతో (ఐదు, నాలుగేళ్ల వయసు) ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఇంటి చుట్టుపక్కన పక్షుల కిలకిలరావాలు విని ఎన్నేళ్లయింది. ఇప్పుడు ట్రాఫిక్ లేకపోవడం వల్ల కావచ్చు అంతా స్పష్టంగా వినిపిస్తుంది. ఏవో కొత్త పక్షులు చేరినట్లు కూడా అనిపించింది. ► ఇక నేను, భార్య ప్రీతి సినిమాలు, సిరీస్‌లు చూస్తూనే ఉన్నాం. నాకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇష్టమైతే...ఆమెకు ‘సెక్స్ అండ్ ద సిటీ’ అంటే ఆసక్తి. అయితే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద రూపొందించిన సిరీస్ ‘క్వీన్’ను మాత్రం ఇద్దరం కలిసి చూస్తున్నాం. ► ఇక పుస్తకాలు చదివే పాత అలవాటు కూడా మళ్లీ వచ్చింది. కల్కి రచించిన ఐదు భాగాల ‘పొన్నియిన్ సెల్వన్’ పూర్తి చేసేందుకు నా వద్ద తగినంత సమయం ఉంది. ► మా అమ్మానాన్నలు మాతో పాటే ఉంటారు కానీ వారిద్దరూ కూడా చాలా బిజీ. అయితే ప్రతీ రోజు అమ్మతో ఒక్క గంట పాటైనా ‘క్యారమ్’ ఆడుతూ ఉన్నా. కొంత విశ్రాంతి తర్వాత అమ్మాయిలతో పజిల్స్, లెగోలాంటివి ఆడుకుంటా. ఇంతకుముందులాగా సాయంత్రం కాగానే బయటకు వెళ్లాల్సిన అనవసరం లేదు. సరైన సమయానికే నిద్రపోతుండటం కూడా ఒక మంచి మార్పు. ► కరోనాలాంటి ఉత్పాతాన్ని ఇప్పుడు మనం అధిగమించలిగితే అందరికీ ఇదో పెద్ద పాఠం కావాలి. -
అతనికి మళ్లీ అవకాశం ఇవ్వండి: భజ్టీ
న్యూఢిల్లీ: భారత పరిమిత ఓవర్ల క్రికెట్లో యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లు రెగ్యులర్ స్పిన్నర్లుగా మారిపోవడంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను పక్కనపెట్టేశారు. కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమైన అశ్విన్.. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడి రెండేళ్లుపైనే అవుతుంది. టెస్టుల్లో సత్తాచాటుతున్నప్పటికీ అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో అవసరం లేదన్నట్లే టీమిండియా సెలక్షన్ కమిటీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అశ్విన్‌కు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అండగా నిలిచాడు. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ ఎందుకు పక్కన పెట్టేశారో తెలియడం లేదన్నాడు. అశ్విన్‌కు వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లో మళ్లీ ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు. ‘ వికెట్ టేకర్ అయిన అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎందుకు చాన్స్ ఇవ్వడం లేదు. మళ్లీ అతనికి అవకాశం ఎందుకు ఇచ్చి చూడకూడదు. రెడ్ బాల్ క్రికెట్లో అశ్విన్ ఎలా రాణిస్తాడో అంతా చూస్తున్నాం. అశ్విన్ అన్ని వైపులా బంతిని స్పిన్ చేయడంలో సమర్ధుడు. వాషింగ్టన్ సుందర్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. సుందర్ ఒక ప్రతిభా వంతుడే కానీ అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక కుల్దీప్, చహల్‌లు కూడా సమర్థులే. వారిని ప్రతీ గేమ్ ఆడించాలి. కాకపోత ఏ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో చూసుకుని చహల్-కుల్దీప్ల్లో ఒకరికి చాన్స్ ఇస్తూ ఉండాలి. వారు మనకున్న బెస్ట్ ఆప్షన్స్. అలానే అశ్విన్‌కు కూడా మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’ అని భజ్జీ పేర్కొన్నాడు. -
అశ్విన్‌కు బదులుగా సుచిత్, రూ.1.5 కోట్లు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కెప్టెన్‌గా నడిపించిన రవిచంద్రన్ అశ్విన్... తదుపరి సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ‘ఐపీఎల్ ట్రాన్స్ఫర్ విండో’ పద్ధతి ప్రకారం ఇరు జట్ల మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అశ్విన్‌ను వదులుకున్నందుకు పంజాబ్ జట్టుకు ఢిల్లీ యాజమాన్యం రూ. 1.5 కోట్ల నగదుతో పాటు స్పిన్నర్ జగదీశ సుచిత్‌ను బదిలీ చేయనుంది. తమతో చేరిన అశ్విన్‌కు రూ. 7.6 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పంజాబ్ ప్రాంఛైజీ సహయజమాని నెస్ వాడియా వెల్లడించారు. నిజానికి సుచిత్‌తో పాటు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌నూ పంజాబ్ కోరినప్పటికీ చివరకు అది సాధ్యం కాలేదు. -
అది భయానకంగా ఉంది: అశ్విన్
ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో ఇక్కడ అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌ను వాయు కాలుష్యం భయపెడుతోంది. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మరో వేదికకు మార్చాలనుకున్నపటికీ అది సాధ్యం కాకపోవడంతో భారత్-బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. తొలి టీ20కి వాయు కాలుష్య ప్రభావం ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడగా, బంగ్లాదేశ్ కోచ్ డొమింగో కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదన్నాడు. కాగా, భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ‘ ప్రస్తుతం ఢిల్లీలో గాలిలో నాణ్యత లేదు. అదొక భయానకంగా ఉంది. ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం తీసుకునే ఊపిరిలో ఆక్సిజన్ శాతం అవసరమైనంత ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో మాట్లాడిన రోహిత్ శర్మ మాత్రం వాయు కాలుష్యంతో ఇబ్బందేమీ ఉండదన్నాడు. తామంతా మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్ కోచ్ డొమింగో మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదన్నాడు. ఇది కేవలం మూడు గంటల ఆటే కావడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందని పేర్కొన్నాడు. -
మెరుగైన స్థితిలో భారత్; సౌతాఫ్రికా 275 ఆలౌట్
పుణె : మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్ చేసిన కోహ్లి సేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్ చేసింది. ఫలితంగా పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 36/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టును భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించాడు. ఉమేష్ యాదవ్ మూడు, మహ్మద్ షమీ రెండు, జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలాఉండగా.. సౌతాఫ్రికాపై అత్యధిక టెస్ట్ వికెట్లను తీసుకున్న నాలుగో భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే (84), జవగళ్ శ్రీనాథ్ (64, హర్భజన్ సింగ్ (60) తర్వాతి స్థానంలో అశ్విన్ (50) ఉన్నాడు. (చదవండి : రోహిత్‌ను ముద్దాడేందుకు... మైదానంలోకి..) ఇక భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ (64), డికాక్ (31), బ్రూయెన్ (30) మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే, 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్ మహరాజ్, ఫిలాండర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్ (164 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) పోరాటంతో సఫారీ జట్టు ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. నిర్ణీత సమయం ముగియడంతో మూడోరోజు ఆటకు విరామం ఇచ్చారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉంది. ఇక ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్ ఆడించాలా..? లేక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టాలా అనే విషయంపై కోహ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (చదవండి : ద్విశతక కోహ్లినూర్...) తలో చేయి వేశారు.. మార్నింగ్ సెషన్ మొదలైన కొద్దిసేపటికే మహ్మద్ షమీ నూర్జే (3)ని ఔట్ చేశాడు. దీంతో 41 పరుగుల వద్ద పర్యాటక జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చి హడలెత్తించిన పేసర్ ఉమేష్ యాదవ్ క్రీజులో కుదురుకున్న బ్రూయెన్ (30 పరుగులు, 58 బంతులు, 6 ఫోర్లు)ను ఔట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తలకెత్తుకున్న క్వింటన్ డికాక్, కెప్టెన్ డుప్లెసిస్ జోడీని అశ్విన్ విడగొట్టాడు. అశ్విన్ బౌలింగ్‌లో డికాక్ (48 బంతుల్లో 31; 7 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో డుప్లెసిస్-డికాక్ హాఫ్ సెంచరీ భాగస్వామానికి తెరపడింది. అప్పటికీ జట్టు స్కోరు 128/6. ఇక ఏడో వికెట్‌గా ముత్తుసామి (20 బంతుల్లో 7 పరుగులు)ని జడేజా ఎల్బీగా వెనక్కు పంపాడు. కెప్టెన్ డుప్లెసిస్ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) నిదానంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న క్రమంలో అశ్విన్ వేసిన చక్కని బంతికి అతను కూడా పెవిలియన్ చేరక తప్పలేదు. కేశవ్ మహరాజ్ తొమ్మిదో వికెట్‌గా, రబడ పదో వికెట్‌గా పెవిలియన్ చేరారు. -
సిడ్నీ టెస్ట్; భారత జట్టు ఇదే
సిడ్నీ: ఆస్ట్రేలియాతో రేపటి నుంచి సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఇషాంత్ శర్మను జట్టు నుంచి తప్పించింది. అతడికి ఫిట్నెస్ లేదని ప్రకటించింది. గాయపడ్డడా, అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అనేది వెల్లడించలేదు. (ఈసారి వదలొద్దు..) అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పి(సైడ్ స్ట్రెయిన్)తో జట్టుకు దూరమైన అశ్విన్‌కు అవకాశం దక్కింది. రెండు, మూడు టెస్టులు ఆడలేకపోయిన అతడికి చివరి టెస్ట్‌లో ఛాన్స్ ఇచ్చారు. అశ్విన్ తుది జట్టులో ఉంటాడా, లేదా అనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తనకు కూతురు పుట్టడంతో అతడు స్వదేశానికి వచ్చాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పైచేయి సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఫలితం తేలకున్నా సిరీస్ భారత్ సొంతమవుతుంది. బీసీసీఐ ప్రకటించిన జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ -
అశ్విన్‌పై ధోని అభిమానుల ఆగ్రహం
మొహలీ : కింగ్స్ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ పరుగుల సునామీ సృష్టించగా.. చెన్నై తరఫున ధోని అద్భుతంగా పోరాడాడు. అయితే మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్బుతంగా రాణించారని, రాయుడు వికెట్ అనంతరం మ్యాచ్‌పై పట్టు చిక్కిందని తెలిపాడు. ఇక గేల్ ఇన్నింగ్స్ సైతం తమ విజయానికి కలిసొచ్చిందని పేర్కొన్నాడు. అయితే అశ్విన్ ధోని అద్భుత ప్రదర్శనను ప్రస్తావించకపోవడం అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదే ధోని మాట్లాడుతూ.. గేల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. తమ కంటే పంజాబ్ ఆటగాళ్లు బాగా ఆడారని, కొన్ని విషయాల్లో తమింకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అభిమానులు అశ్విన్‌పై మండిపడుతున్నారు. ధోని ప్రత్యర్థి ఆటగాళ్ల గురించి మాట్లాడినప్పుడు అశ్విన్‌కు ఏమైందని సోషల్ మీడియా వేదికగా నిలిదీస్తున్నారు. ధోని గురించి అశ్విన్ ఒక్క మాట మాట్లడకపోవడంతో అతనిపై తమకు గౌరవం పోయిందని కొందరంటే.. అసలు ధోని లేకపోతే అశ్విన్ ఎక్కడా.. కష్టసమయాల్లో ధోని ఎన్నో సార్లు అశ్విన్‌కు మద్దతిచ్చాడని అలాంటిది ధోని అద్భుత ఇన్నింగ్స్ గురించి ఒక్క మాట మాట్లడకపోవడం ఏమిటని ఇంకోందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డ ధోని 5 సిక్సులు, 6 ఫోర్లతో 44 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కడదాక పోరాడిన విషయం తెలిసిందే. Not a single word of appreciation by Ashwin for Dhoni. He completely lost my respect🤗#KXIPvCSK #Dhoni #CSK #Mahi #CSKian — Anjali..🐇🐿❤ (@Anjali39483451) 15 April 2018 With out dhoni ashwin is nothing.. He supported him alot in tough situations.. If u see dhoni speech today he applauded gayle and mujeeb for their game.. But ashwin didn't utter a single word — pradeep yadav :) (@itsmepradeep7) 15 April 2018 -
ఈడెన్‌లో ఆ మైలు రాయి అందుకుంటాడా.?
సాక్షి, కోల్‌కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టులోకి తిరిగొచ్చిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇక గురువారం నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కనుక ఈ సీనియర్ స్పిన్నర్ 8 వికెట్లు పడగొడితే.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గుర్తింపు పొందనున్నాడు. ఇప్పటికే 52 మ్యాచుల్లో 292 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. అంతకు ముందు 56 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించి తొలిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నీస్ లిల్లీ రికార్డు బ్రేక్ చేయనున్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళిధరన్ 58 మ్యాచుల్లో ఈ మైలు రాయి అందుకున్నాడు. ఆ తరువాతి స్థానాల్లో ఉన్న హడ్లీ(న్యూజిలాండ్), మార్షల్( వెస్టిండీస్), స్టేయిన్(దక్షిణాఫ్రికాలు) 61 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 66 టెస్టులో ఈ మైలురాయి అందుకున్నాడు. అశ్విన్‌కు అచ్చిరానీ ఈడెన్.. కానీ శ్రీలంకతో జరిగే టెస్టుల్లో ఈ రికార్డు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఈడెన్ మైదానంలో జరిగిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే అశ్విన్ రికార్డు అంతంత మాత్రమే. ఈ మైదానంలో అశ్విన్ యావరేజ్ (34.05)గా ఉంది. ఇక్కడ రెండు టెస్టులు ఆడిన అశ్విన్ రెండింట్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక మరో 6 వికెట్లు పడగొడితే వరుసగా మూడేళ్లలో 50కి పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా అశ్విన్ గుర్తింపు పొందనున్నాడు. 2016లో 12 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీసిన అశ్విన్..2015లో 9 మ్యాచుల్లో 62 వికెట్లు పడగొట్టాడు. -
వాళ్లిద్దరూ నాకు ప్రత్యర్థులు కాదు: కుల్దీప్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ లు. ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు గట్టి పోటీనిస్తూ సత్తా చాటుకుంటున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే అశ్విన్, జడేజాల స్థానానికి ఎసరపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన కుల్దీప్ యాదవ్..తమకు అశ్విన్, జడేజాలతో పోటీ ఉందనడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. ఒక్కవిషయంలో చెప్పాలంటే అశ్విన్-జడేజాలు తనకు గురువులాంటి వారిని కుల్దీప్ పేర్కొన్నాడు. 'వాళ్లిద్దరూ నాకు ప్రత్యర్థులు కాదు.. గురువులతో సమానం. నా అన్నయ్యలు వంటి వారు కూడా. వారిద్దరి వద్ద నుంచి అనేక సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నా. ముఖ్యంగా వారి వద్ద నుంచి బౌలింగ్ లో ట్రిక్స్ ను తెలుసుకున్నా. అసలు అశ్విన్-జడేజాలను తమతో పోల్చుతూ వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఇటీవల కాలంలో నాతో పాటు చాహల్ కూడా బాగా రాణించాడు. అంతమాత్రాన అశ్విన్-జడేజాలతో మమ్ముల్ని పోల్చడం సరికాదు. నేనైతే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఒక స్పిన్నర్ గా అశ్విన్, జడేజాల మార్గదర్శకాల్లోనే పయనిస్తున్నా. మరి అటువంటప్పుడు వారికి నేను పోటీ ఎలా అవుతాను. వాళ్లిద్దరూ నాకు ఎప్పటికీ ప్రత్యర్థులు కాదు..నేను వారికి పోటీని కాదు'అని కుల్దీప్ స్పందించాడు. -
'ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడలేనేమో'
లండన్: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ నుంచి భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లో భాగంగా వార్సెష్టర్‌షైర్ తరపున ఆడుతున్న అశ్విన్.. ఆసీస్ తో సిరీస్ పై అనుమానం వ్యక్తం చేశాడు. ఆసీస్ తో సిరీస్ కు సంబంధించి తనకు పిలుపువచ్చినా, ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు. 'ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడలేనేమో. వార్సెష్టర్ షైర్ కు నాలుగు మ్యాచ్ లు ఆడతానని హామీ ఇచ్చా. అలా చూసుకుంటే ఆసీస్ తో సిరీస్ ఆడటం కష్టమే. కౌంటీల్లో ఆడుతున్న నేను భారత జట్టు నుంచి పిలుపు వచ్చినా పూర్తిస్థాయి మ్యాచ్ లో ఆడలేకపోవచ్చు'అని అశ్విన్ పేర్కొన్నాడు. 2019 వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో జరుగుతున్న క్రమంలో నా ప్రస్తుత అనుభవం ఉపయోగపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన తనకు, ఆసీస్ తో సిరీస్ కు సంబంధించి బీసీసీఐ నుంచి పిలువు వచ్చే అవకాశాలున్నాయన్నాడు. అయితే ప్రస్తుతం బీసీసీఐతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు భారత్ తో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న అశ్విన్ ఈ సిరీస్‌కి అందుబాటులో ఉండకపోతే.. అతని స్థానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కే అవకాశం ఉంది. -
కోహ్లీ, అశ్విన్ అరుదైన ఘనత!
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2015-16 భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన అవార్డులలో పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ, దిలీప్ సర్దేశాయ్ అవార్డును అశ్విన్ దక్కించుకున్నారు. గతంలో ఏ భారత క్రికెటర్‌కు సాధ్యంకాని రీతిలో మూడోసారి పాలీ ఉమ్రిగర్ అవార్డుకు కోహ్లీ ఎంపికయ్యాడు. గతంలో 2011-12, 2014-15 సీజన్లలో ఈ అవార్డు కోహ్లీని వరించింది. ఈ నెల 8న బెంగళూరులో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మరోవైపు అశ్విన్ రికార్డు స్థాయిలో రెండోసారి దిలీప్ సర్దేశాయ్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2011-12 సీజన్లో తొలిసారి అశ్విన్ కు ఈ అవార్డు దక్కింది. ఏ భారత బౌలర్ కూడా రెండో పర్యాయం ఈ అవార్డుకు ఎంపిక కాలేదు. 2015-16 సీజన్లో అశ్విన్ అత్యుత్తమంగా రాణించిన విషయం తెలిసిందే. సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును రాజేందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్, మహిళల విభాగంలో ఈ అవార్డును శాంతా రంగస్వామి సొంతం చేసుకున్నారు. బీసీసీఐ స్పెషల్ అవార్డు వీవీ కుమార్, రమాకాంత్ దేవాయ్(దివంగత) ఎంపికయ్యారు. -
అశ్విన్ ఖాతాలో మరో రికార్డు
పుణె:ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 250 వికెట్లను సాధించిన రికార్డును సొంతం చేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో తొలి రెండు వికెట్లను అశ్విన్ తీశాడు. దాంతో 2016-17 స్వదేశీ సీజన్లో అశ్విన్ ఖాతాలో 64వికెట్లు చేరాయి. తద్వారా ఒక స్వదేశీ సీజన్ లో వేగంగా అత్యధిక వికెట్లను తీసిన ఘనత సాధించాడు. దాంతో కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ సవరించాడు. 1979-80 హోం సీజన్లో కపిల్ దేవ్ 13 టెస్టుల్లో 63 వికెట్ల తీయగా.. 2016-17 స్వదేశీ సీజన్లో అశ్విన్ ఆ రికార్డును అధిగమించాడు. 10 టెస్టుల్లో 64 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డును చెరిపేశాడు. ఈ రోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా డేవిడ్ వార్నర్, షాన్ మార్ష్ లను పెవిలియన్ కు పంపడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డుకు అశ్విన్ దగ్గరగా వచ్చినప్పటికీ దాన్ని అధిగమించలేకపోయాడు.2012-13 స్వదేశీ సీజన్ లో అశ్విన్ 10 టెస్టుల్లో 61 వికెట్లు మాత్రమే తీసి ఆ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అయితే దాదాపు మూడు సీజన్ల తరువాత ఆ రికార్డును అశ్వినే బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం. -
'ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా'
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బౌలింగ్ చేయడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో ఇక్కడ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో అశ్విన్ స్పందించాడు. 'ఈ పిచ్‌పై బౌన్స్ బాగుంటుంది. దాంతో పాటు ఇదొక పెద్ద గ్రౌండ్ కూడా. ఈ తరహా పిచ్ నాకు లాభిస్తుందనే ఆశిస్తున్నా. ఇక్కడ బంతి పెద్దగా టర్న్ కాకపోయినా, ఊహించని బౌన్స్ వస్తుంది. అది స్పిన్నర్లకు అనుకూలమనే చెప్పొచ్చు'అని అశ్విన్ తెలిపాడు. ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నాడు. బంగ్లాదేశ్ జట్టు ఒక మెరుగైన క్రికెట్ జట్టు అనే సంగతి మరువకుండా పూర్తిస్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందన్నాడు. -
కోహ్లీ కెప్టెన్సీపై అశ్విన్ ఆందోళన
దూకుడే మంత్రంగా చెలరేగిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ టెస్టు కెప్టెన్సీతో పాటు అన్ని ఫార్మాట్లకు సారథ్యం వహించనున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి గతవారం తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు కూల్‌గా సాగిన లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ భవిష్యత్తులోనూ కూల్ గా ఉంటుందో లేదోనని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన చెందుతున్నాడు. దూకుడుతో కోహ్లీ తీసుకునే నిర్ణయాలకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. కఠిన సమమయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తాడని ధోనీని ప్రశంసించాడు. ఇటీవల తన విజయంలో భార్య, కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ధోనీ పేరు ప్రస్తావించకపోవడంతో అశ్విన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. '2010లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంనుంచీ ధోనీ కెప్టెన్సీలోనే వన్డేలు, టీ20లు ఆడుతూ వచ్చాను. ఈ 15న ఇంగ్లండ్ తో జరిగే తొలి వన్డేలో ధోనీ కెప్టెన్సీలో ఆడకపోవడం మార్పును సూచిస్తుంది. గతంలో ధోనీ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ గా వ్యవహరించేవాడు. ఇప్పుడు విరాట్ షార్ట్ మిడ్ వికెట్, షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేస్తాడు. అతడి వ్యూహాలకు అనుగుణంగా ఆడాల్సి వస్తుంది. ధోనీ అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇచ్చి రన్స్ కంట్రోల్ చేపిస్తాడు. కోహ్లీ మాత్రం ఈ ఓవర్లలోనూ అటాకింగ్ గేమ్ ప్లాన్‌లో ఉండి.. వికెట్లు తీయడంపైనే దృష్టిసారిస్తాడు. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది' అని టాప్ స్పిన్నర్ అశ్విన్ వివరించాడు. -
'ఎవ్వరికీ అంతు చిక్కని బౌలర్ అతను'
ముంబై: భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌పై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురింపిచాడు. రోజు రోజుకీ పరిణితి చెందుతున్న అశ్విన్ చాలా తెలివైన క్రికెటరే కాకుండా, బ్యాటింగ్ లో సమయోచిత టెక్నిక్‌ను కల్గిన ఆటగాడని బంగర్ కొనియాడాడు. ఎప్పుడూ తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవడానికి అత్యంత ఉత్సుకత చూపించడమే అశ్విన్ ను నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిందన్నాడు. 'అశ్విన్ చాలా తెలివైన క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అణుకువుగా ఉంటూ తన సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి అశ్విన్ ఎక్కువ కృషి చేస్తాడు. అదే అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది. ప్రస్తుతం టెక్నిక్ పరంగా ఎంతో మెరుగ్గా ఉన్న అశ్విన్ ను కట్టడి చేయడమంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు అంత సులువు కాదు. ఒక ఆటగాడ్ని ఊపిరిపీల్చుకోకుండా చేసే టెక్నిక్ అశ్విన్ సొంతం. ఒకవేళ అశ్విన్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తే వికెట్‌ను సమర్పించుకోవాల్సిఉంటుంది. అవతలి జట్టు స్పిన్నర్లకు కూడా అశ్విన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎవరికీ అంతుచిక్కని బౌలర్ అశ్విన్.దాంతో పాటు బ్యాటింగ్ లో అశ్విన్ టెక్నిక్ చాలా మెరుగ్గా ఉంది' అని బంగర్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అశ్విన్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న అశ్విన్, 612 పరుగులు నమోదు చేసి 'బెస్ట్'గా నిలిచాడు. -
అశ్విన్@1
అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్ధానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరిస్ లో భీకర బౌలింగ్ తో కివీస్ ను చిత్తు చేసిన అశ్విన్ తాజాగా విడుదలైన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 900 పాయింట్లతో తొలిస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటికే ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్లలో జాబితాలో అశ్విన్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. టెస్టు బౌలర్లు, ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఏడు, మూడు స్ధానాల్లో నిలిచాడు. కాగా, టెస్టు బ్యాట్స్ మన్ టాప్ 10 జాబితాలో అజింక్యా రహానే ఒక్కడే ఆరవ స్ధానంలో నిలిచాడు. టాప్ 10 టెస్టు బౌలర్లు 1.ఆర్.అశ్విన్(భారత్) 2.డేల్ స్టెయిన్(దక్షిణ ఆఫ్రికా) 3.జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్) 4.ఎస్.సీ.జే బ్రాడ్(ఇంగ్లాండ్) 5.రంగనా హెరాత్(శ్రీలంక) 6.యాసిర్ షా(పాకిస్తాన్) 7.రవీంద్ర జడేజా(భారత్) 8.మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) 9.ఎన్.వాగ్నెర్(న్యూజిలాండ్) 10.వీ.డీ.ఫిలాండర్(దక్షిణ ఆఫ్రికా) టాప్ 10 టెస్టు ఆల్ రౌండర్లు 1.ఆర్.అశ్విన్(భారత్) 2.షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) 3.రవీంద్ర జడేజా(భారత్) 4.ఎమ్.ఎమ్ అలీ(ఇంగ్లాండ్) 5.మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) 6.వీ.డీ ఫిలాండరర్(దక్షిణ ఆఫ్రికా) 7.బీ.ఏ స్టోక్స్(ఇంగ్లాండ్) 8. స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లాండ్) 9.రంగనా హెరాత్(శ్రీలంక) 10.సీఆర్ వోక్స్(ఇంగ్లాండ్) టాప్ 10 టెస్టు బ్యాట్స్ మన్లు 1.ఎస్.పీ.డీ స్మిత్(ఆస్ట్రేలియా) 2.జేఈ రూట్(ఇంగ్లాండ్) 3.హషీమ్ ఆమ్లా(దక్షిణ ఆఫ్రికా) 4.యూనస్ ఖాన్(పాకిస్తాన్) 5.కేన్ విలియమ్ సన్(న్యూజిలాండ్) 6.అజింక్య రహానే(భారత్) 7.ఏ.బి.డివిలియర్స్(దక్షిణ ఆఫ్రికా) 8.ఏ.సి వోగ్స్(ఆస్ట్రేలియా) 9.డీ.ఏ వార్నర్(ఆస్ట్రేలియా) 10.ఏ.ఎన్.కుక్(ఇంగ్లాండ్) -
ఆ ట్వీట్‌పై క్రికెటర్ల భార్యల స్పందన!
న్యూఢిల్లీ: మూడో టెస్టులో న్యూజిల్యాండ్‌పై విజయం సాధించి సిరీస్‌ను 0-3తో కైవసం చేసుకున్న భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడో టెస్టులోనూ అద్భుతంగా రాణించి 13 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గెలిచాడు. అంతేకాకుండా తన కెరీర్లో ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్ పంచ్ డైలాగ్ విసిరాడు. ’అద్భుతంగా ఆడి ఏడోసారి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న అశ్విన్‌కు అభినందనలు. ఇంటికి వెళ్లాల్సిన తొందరమేమిటో కేవలం పెళ్లయిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది’ అని సెహ్వాగ్ చమత్కరించాడు. ఇందుకు అశ్విన్ కృతజ్ఞతలు చెప్పగా.. అశ్విన్ భార్య ప్రితీ అశ్విన్ స్పందిస్తూ.. ‘హాహాహా.. నేనేం చేయనండి’ అంటూ బదులిచ్చింది. ఈ మధ్య ట్విట్టర్లో అడుగుపెట్టిన సెహ్వాగ్ భార్య ఆర్తి కూడా ఈ సంభాషణలోకి దిగుతూ.. ‘నేను కూడా ఏం చేయను ప్రితీ.. కానీ వాళ్లిద్దరికే (అశ్విన్, సెహ్వాగ్) ఎప్పుడూ తొందరెక్కువ’ అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఈ ఫన్నీ సంభాషణ నెటిజన్లను భలే మురిపిస్తున్నది. .@prithinarayanan Neither did I. Both in a hurry as always @ashwinravi99 @virendersehwag — Aarti Sehwag (@AartiSehwag) October 11, 2016 -
గాయంతో బాధపడుతున్న అశ్విన్!
కోల్‌కతా: గాయపడిన పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో రెండో టెస్టు కోసం ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రధాన స్పిన్నర్ అశ్విన్ చేతి వేలికి గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా జయంత్‌ను పిలిపించినట్లు తెలిసింది. కుడి చేతి మధ్య వేలుకు గాయంతోనే అశ్విన్ కాన్పూర్ టెస్టులో బౌలింగ్ చేశాడు. టెస్టు ప్రారంభానికి కూడా నొప్పి తగ్గకపోతే జయంత్‌కు అవకాశం దక్కవచ్చు కూడా. బుధవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్‌కు అశ్విన్‌తో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా దూరంగా ఉన్నారు. అనూహ్య బౌన్‌సకు అలవాటు పడేందుకు కోహ్లి రబ్బర్ బాల్‌తో సాధన చేశాడు. గంభీర్ జట్టులోకి వచ్చినా... రెండో టెస్టులో ధావన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నారుు. అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో పాల్గొన్నాడు. కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత కూడా ధావన్‌తో కుంబ్లే, బంగర్ ప్రత్యేకంగా సాధన చేయించారు. ప్రాక్టీస్ ముగిశాక కోహ్లి ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్లో పాల్గొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. వారిలో చాలా మంది కోల్‌కతాలో షాపింగ్‌కు వెళ్లి సరదాగా గడిపారు. అశ్విన్‌కు రెండో ర్యాంక్ దుబాయ్: కాన్పూర్ టెస్టులో పది వికెట్లతో అద్భుతంగా రాణించిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (871 పాయింట్లు) ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌సలో రెండో స్థానానికి ఎగబాకాడు. కోల్‌కతా టెస్టులోనూ రాణిస్తే అశ్విన్ మరోసారి టాప్ ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 878 పాయింట్లతో డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కేవలం ఒక పాయింట్ తేడాతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో 906 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉండగా..జో రూట్ (ఇంగ్లండ్)ను వెనక్కినెట్టి విలియమ్సన్ (న్యూజిలాండ్) రెండో స్థానాన్ని సంపాదించాడు. భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 7వ స్థానంలో, విజయ్, రాహుల్ సంయుక్తంగా 16వ ర్యాంకులో, కోహ్లి 20వ ర్యాంకులో ఉన్నారు. -
మహీకి అతనిపై నమ్మకం లేకకాదు..
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో అశ్విన్‌పై ధోనీకి విశ్వాసం లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చెబుతున్నాడు. అశ్విన్‌పై ధోనీ నమ్మకం కోల్పోలేదని, మ్యాచ్ పరిస్థితులే కారణమని చెప్పాడు. 'ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పుణె ఆడింది. వాంఖడే పిచ్ సీమర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు (చెన్నై సూపర్ కింగ్స్ తరపున) ఆడినపుడు అక్కడి వికెట్ స్పిన్‌కు సహకరిస్తుంది కాబట్టి అశ్విన్‌కు ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇతర వేదికల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి' అని అగార్కర్ అన్నాడు.